iDreamPost

Jagananna Vidya Kanuka: జగనన్న విద్యాకానుక, ఒక్కో కిట్ విలువ రూ.2వేలు, మొత్తం రూ.931.02 కోట్ల ఖ‌ర్చు

Jagananna Vidya Kanuka:  జగనన్న విద్యాకానుక, ఒక్కో కిట్ విలువ రూ.2వేలు, మొత్తం రూ.931.02 కోట్ల ఖ‌ర్చు

జ‌గ‌న్ ప్రభుత్వం బడులు తెరిచిన తొలిరోజు నుంచే విద్యార్థులకు కిట్లు పంపిణీ మొద‌లుపెట్టింది. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మందికి ఈ కిట్లు అంద‌నున్నాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో సీఎం చేతుల మీదుగా విద్యా కానుక కిట్ల పంపిణీ మొద‌లైంది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్ల పిల్లలకు కిట్స్ నివ్వ‌డం ఇది వ‌రుస‌గా మూడోయేడాది.

దేవుని దయతో ఈ రోజు మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. 47.40 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక కిట్ల‌ను అందిస్తున్నాం. విద్యాకానుక కోసం రూ.931 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రతి ఇంట్లో మంచి చదువు ఉండాలి. నాణ్యమైన చదువుతోనే పేదరికం పోతుంది. అంద‌రూ ఇంగ్లీష్‌ మీడియం చదువుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు.

పిల్లలను బడికి పంపే తల్లులకు, అమ్మ ఒడి అమలు చేస్తున్నామ‌ని చెప్పిన సీఎం జ‌గ‌న్, నాడు-నేడు కింద​ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. జగనన్న గోరుముద్ద పథకంతో బడి పిల్లలకు మంచిఆహారం అందిస్తున్నాం. బైజూస్‌ యాప్‌ను పేద పిల్లల కోసం అందుబాటులోకి తెస్తున్నాం. విద్యార్థుల కోసం బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలు ఇచ్చాం. ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ కూడా అందజేస్తున్నాం. విద్యార్ధుల‌ భవిష్యత్‌పై దృష్టిపెట్టిన ప్రభుత్వం మాది. అందుకే ఆరంభంలోనే విద్యాకానుక అందిస్తున్నాం. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం. ఒక్కో కిట్‌ విలువ రూ.2వేలు అని సీఎం జగన్‌ అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి