iDreamPost

ఎంఫాన్ తుఫాన్‌పై ముందే స్పందించిన జ‌గ‌న్‌

ఎంఫాన్ తుఫాన్‌పై ముందే స్పందించిన జ‌గ‌న్‌

వివిధ రాష్ట్రాల‌పై ప్ర‌భావం చూపే ఎంఫాన్ తుఫాన్ గురించి అంద‌రి కంటే ముందుగానే ప‌సిగ‌ట్టి అధికారుల‌ను, రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను, మ‌త్స్య‌కారుల‌ను అప్ర‌మ‌త్తంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేశారు. ముందుచూపుతో ఆదేశాలు ఇవ్వ‌డంతో తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం స‌న్న‌ద్ధం అయ్యింది.
ప్ర‌స్తుతం నెల‌కొన్న ఈ తూఫాన్ గ‌త 15 రోజులుగా వివిధ రూపాంత‌రం జ‌రుగుతూ వ‌స్తుంది. అది ఇప్ప‌టికీ తుఫాన్‌గా మారింది. బంగ్లాదేశ్, ప‌శ్చిమ బెంగాల్‌, ఒరిస్సా వంటి రాష్ట్రాల‌పై తుఫాన్ ఎక్కువ ప్ర‌భావం చూప‌నుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్, త‌మిళ‌నాడు, సిక్కి, అస్సాం, మేఘాల‌య వంటి రాష్ట్రాల‌పై కొద్ది త‌క్కువ‌ ప్ర‌భావం ఉండే అవ‌కాశం ఉంది. అయితే ఈ తుఫాన్ ప్రాథ‌మిక స్థాయిలో ఉన్న‌ప్పుడే సిఎం జ‌గ‌న్మోన్ రెడ్డి ప‌సిగ‌ట్టి ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించారు.

మే 4వ‌ తేదీనే సిఎం జ‌గ‌న్ హెచ్చ‌రిక‌

ఎంఫాన్ తుఫాన్‌పై సిఎం జ‌గ‌న్ మే 4నే హెచ్చ‌రించారు. ఎంఫాన్‌ తుపాను ఏపి వైపు వస్తే సన్నద్ధంగా ఉండాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. తుఫాను కదలికలను గమనిస్తూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. దీనిపై విద్యుత్తు, రెవిన్యూ, పౌర సరఫరాలు, వైద్యశాఖలు అస‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవడానికి స‌న్న‌ద్ధం కావాల‌ని ఆదేశించారు. తుఫాను వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని, చేపల వేట నిషేధ సమయమే అయినా బోట్లలో ఏ ఒక్కరూ సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. తగినంత కార్యచరణతో పాటు అధికారులను కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. అంతేగాక తుపానును దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలును కూడా వేగవంతం చేయాలని సిఎం జగన్‌ ఆదేశించారు.

తుఫాన్‌పై స్పందించిన మోడీ

ఎంఫాన్ ప్ర‌చండ తుఫాన్‌గా మారే అవ‌కాశం ఉంద‌ని కేంద్ర ఎర్త్ సైన్స్ మంత్రిత్వ శాఖ హెచ్చ‌రించిన త‌రువాత ప్ర‌ధాని మోడీ నేతృత్వంలో మే 18 (సోమ‌వారం)న ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఎన్ డిఆర్ ఎఫ్ ఉన్న‌తాధికారుల‌తో నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి, అమిత్ షా, పిఎం ప్ర‌ధాన స‌ల‌హాదారుడు పికె సిన్హా, క్యాబినేట్ కార్య‌ద‌ర్శి రాజీవ్ గౌబా, ఇత‌ర ఉన్న‌తాధికారులు ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి