iDreamPost

తెలుగుదేశం బినామీలకు జగన్ స్ట్రోక్ !

తెలుగుదేశం బినామీలకు జగన్ స్ట్రోక్ !

ఆంధ్రప్రదేశ్ రాజధానులపై కొనసాగుతున్న సస్పెన్స్ కి ముఖ్యమంత్రి జగన్ తెరదింపారు. రాజధాని ఏర్పాటుపై తన దైన శైలిలో వినూత్నమైన పరిష్కారంతో ముందుకు వచ్చారు , ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజధాని పై జరుగుతున్న చర్చ సందర్భంగా రాజధానిపై వేసిన కమిటి రిపోర్టు రెండు మూడు రోజుల్లో తనకి అందుతుందని, ఆ రిపోర్టుని పరిశీలించిన తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, దక్షిణాఫ్రికాకు 3 రాజధానులు ఉన్నాయని మనం కూడా మారాలని, అభివృద్ది వికేంద్రికరణపై దృష్టి పెట్టాలని , బహుశా అమరావతిలో లేజిస్లేటివ్ రాజధాని రావచ్చేమో, విశాఖ లో అడ్మినిస్ట్రేటివ్ రాజధాని, కర్నూల్ లో జ్యుడిషియల్ రాజధాని రావచ్చేమో, బహుశా రాష్ట్రానికి కూడా మూడు రాజధానులు వస్తాయేమో, ఇలా చేయటంవలన రాజధాని నిర్మాణంలో ఆర్ధిక బారం తగ్గుతుందని ఆలోచన చేస్తునట్టు చెప్పుకొచ్చారు. అయితే ఇందులో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయమని రెండు ప్రముఖ కంపెనీలకు ఇచ్చామని ఆ రిపోర్టు రాగానే పరిశీలన జరిపి ఆచరణలో పెడతామని చెప్పుకొచ్చారు.

Read Also: మూడు రాజధానులు- సౌత్ కొరియా లో డెమోక్రసీ లేదు – టీవీ9

ఆర్ధిక మంత్రి బుగ్గన అమరావతిలో రాజధాని పేరిట జరిగిన భూ కుంభకోణాన్ని ప్రజంటేషన్ రూపంలో చూపిస్తూ గత ప్రభుత్వంలో రాజధాని పేరిట 4,070 ఎకరాలు తన బినామీలకు దోచి పెట్టారని, తెలుగుదేశం నేతలంతా అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్[పాల్పడి రైతుల దగ్గర భూములు అప్పనంగా కొట్టేశారని ఆంజనేయులు, పయ్యావుల, పల్లే రఘునాద్ రెడ్డి, కోడెల , పరిటాల సునిత, ధూళిపాల నరేంద్ర, నారాయణ ఇలా తెలుగుదేశం నేతలంతా భూములు కొని కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పుకొచ్చారు.

జగన్ నిర్ణయంతో తెలుగుదేశం నేతలంతా ఒక్కసారికి షాక్ కి గురయ్యారు , లక్షలు పెట్టి కోట్లు కొల్లగోట్టాం అనే ఆశలు ఆవిరైపోయాయి. జగన్ ఇచ్చిన స్ట్రోక్ తో వారికి ఒక్కసారిగా వెన్ను విరిగినట్టు అయ్యింది. తెలుగుదేశం నేతలంతా మూకుమ్మడిగా జగన్ నిర్ణయం తుగ్లక్ చర్య అంటు దుమ్మెతి పోస్తుంటే రాష్ట్ర ప్రజలు జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఏదీ ఏమైనా జగన్ తెలుగుదేశానికి గట్టి షాకే ఇచ్చారని చెప్పుకోవాలి..

Read Also: ఎన్ని రాష్ట్రాలలో ఒకటి కన్నా ఎక్కువ రాజధానులు ఉన్నాయి? 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి