iDreamPost

నేను బాధితురాలినే, సుకేష్ చంద్రశేఖర్ కేసులో నోరా ఫతేహీ ఎలా సాక్షి అవుతుంది? ప్ర‌శ్నించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్

నేను బాధితురాలినే, సుకేష్ చంద్రశేఖర్ కేసులో నోరా ఫతేహీ ఎలా సాక్షి అవుతుంది? ప్ర‌శ్నించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్

కొద్ది నెల‌లుగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఎలాంటి ఆఫ‌ర్స్ లేవు. నిర్మాత‌లు ఆమెకు త‌మ సినిమాల్లో అవ‌కాశాలివ్వ‌డానికి వెనుక‌బ‌డుతున్నారు. కార‌ణం? ఆమెపై ఈడీ దాడులు. ఎప్పుడు ఆమెను లోప‌ల వేస్తారో తెలియ‌దు. దీనికితోడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమర్పించిన ఛార్జిషీట్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను నిందితురాలిగా చెప్పారు. సుకేశ్ చంద్రశేఖర్ రూ. రూ. 200 కోట్ల దోపిడీ కేసులో, నోరా ఫతేహి వంటి మరికొందరు ప్రముఖులను సాక్షిగా చేర్చారు. అస‌లు తాను ఏ నేరం చేయ‌లేద‌ని, ఇతర సెలబ్రిటీల మాదిరిగానే తాను కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడు సుకేష్‌కు చిక్కినట్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అంటోంది.

సుకేష్ చంద్ర, అతని సహచరుడి నుండి 7 కోట్లు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో పాటు ఆమె కుటుంబం కూడా మోసగాడి నుంచి ఆర్థిక సాయం పొందినట్లు ED రుజువును కూడా సమర్పించింది. జాక్వెలిన్‌తో పాటు, నోరా ఫతేహి వంటి కొంతమంది సెల‌బ్రిటీల పేర్లు కూడా బైట‌కు వ‌చ్చాయి. సుకేష్ నుండి బహుమతులు అందుకున్నవారిలో నోరాను సాక్షిగా పేర్కొనగా, జాక్వెలిన్‌ను మాత్రం నిందితుల్లో ఒకరిగా చేర్చారు. ఇది అన్యాయ‌మంటోంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్.

పీఎంఎల్‌ఏ అప్పీలేట్ అథారిటీ ముందు ఆమె దాఖ‌లు చేసిన‌ పిటిషన్‌లో, సాక్ష్యంలో భాగంగా సమర్పించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లకు, నేరంతో ఎలాంటి సంబంధం లేదని, నేను సొంతంగా సంపాదించిన ఆదాయాన్నే ఫిక్స్ డ్ డిపాజిట్ యేశాన‌ని, సుకేష్ చంద్రశేఖర్ గురించి తనకు తెలియక ముందే డిపాజిట్లు ఉన్నాయ‌ని, దర్యాప్తుకు స‌హ‌క‌రించాన‌ని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పిటీష‌న్ లో చెప్పింది.

ఇతరుల మాదిరిగానే మోసగాడు సుకేష్ చేతిలో మోసపోయిన బాధితురాలన‌ని ఆమె వాదిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి