iDreamPost

ఇమ్మూ చనిపోయాడంటూ వార్తలు.. ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి!

సెలబ్రిటీలుగా బతకడం అంత ఈజీ కాదు. వరుస ప్రాజెక్టులు చేస్తే సంపాదిస్తున్నాడు అంటారు. సైలెంట్ అయిపోతే చచ్చిపోయారు అంటారు. ఇప్పుడు ఇమ్మూ పరిస్థితి అలాగే మారింది.

సెలబ్రిటీలుగా బతకడం అంత ఈజీ కాదు. వరుస ప్రాజెక్టులు చేస్తే సంపాదిస్తున్నాడు అంటారు. సైలెంట్ అయిపోతే చచ్చిపోయారు అంటారు. ఇప్పుడు ఇమ్మూ పరిస్థితి అలాగే మారింది.

ఇమ్మూ చనిపోయాడంటూ వార్తలు.. ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి!

చాలా మంది సెలబ్రిటీలను చూసి వాళ్లకేంరా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు. అయితే కామన్ మ్యాన్ కంటే కూడా సెలబ్రిటీలకే ఎక్కువ కష్టాలు అనే విషయం చాలామందికి తెలియదు. వాళ్లు బయటకు వస్తే సెల్ఫీలు, షేక్ హ్యాండులు అంటూ నానా రచ్చ చేస్తారు. ఎక్కువ షోస్ చేస్తే గట్టిగా సంపాదిస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తారు. సేరేలే కాస్త గ్యాప్ తీసుకుందాం అని సైలెంట్ అయిపోతే.. ఇంకేముంది వాళ్లు కాలం చేశారు అంటూ ప్రచారాలు చేస్తారు. తాజాగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ విషయంలో అదే జరిగింది. అయితే ఇమ్మూ ఈ వార్తలపై చాలా సెటైరిక్ గా రియాక్ట్ అయ్యాడు.

సెలబ్రిటీలు చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం, అవి కాస్తా వైరల్ కావడం చాలానే చూశాం. అంతేకాకుండా అవి వైరల్ అవ్వడంతో.. ఆఖరికి వాళ్లే స్వయంగా నేను చచ్చిపోలేదు బతికే ఉన్నాను అంటూ గొంతు చించుకుని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు బుల్లితెర కమెడియన్ ఇమ్మాన్యుయేల్ కి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. అందుకే తాను బతికే ఉన్నాను అంటూ ఒక వీడియో రూపంలో ప్రేక్షకులకు చెప్పుకున్నాడు. అయితే అదే విషయాన్ని రెగ్యులర్ గా కాకుండా సెటైరిక్ గా చెప్పాడు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే రీల్స్ ని ఇమిటేట్ చేస్తూ.. “అరే.. చేతగాని కొడుకులు నేను నటనం చేస్తే చచ్చిపోయాను అని రాశారంట. నా నటనంరా అది.. నా నటనం. చచ్చిపోలేదు నేను. ఇట్లాంటి వాళ్లను ఏమంటారో తెలుసా? చేతగాని కొడుకులు అంటారు. నా వీడియో ఎక్కడి దాకా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అరే బాబు నేను చావలేదురా నాయనా.. ప్రేమ వాలంటీర్ చేసింది అది” అంటూ ఇమ్మూ తనదైనశైలిలో ఆ విషయాన్ని తెలియజేశాడు.

ఇంక ఈ వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది. ఎందుకంటే నేను బతికే ఉన్నాను అంటూ చెప్పడం వేరు.. కానీ, ఇలా ఫన్నీగా చెప్పడం వేరు. అందుకే ఇప్పుడు ఈ వార్త కూడా వైరల్ అవుతోంది. అందరూ నీ వీడియో ఫలానా దాకా వచ్చింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి తాను బతికే ఉన్నాను అనే విషయాన్ని ప్రేక్షకులు, నెటిజన్స్ దృష్టికి తీసుకెళ్లాలి అనుకున్న ఇమ్మూ ప్రయత్నం అయితే ఫలించింది. మరి.. ఇమ్మాన్యూయేల్ మృతి చెందాడని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలోతెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Jabardasth Emmanuel (@jabardasth_emmanuel)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి