iDreamPost

జాను VS చిన్న సినిమాలు

జాను VS చిన్న సినిమాలు

సంక్రాంతికి వచ్చిన రెండు తప్ప ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మూవీ లవర్స్ తో పాటు బాక్స్ ఆఫీస్ జనాలు కూడా డల్ గా ఉన్నారు. డిస్కో రాజా, అశ్వద్ధామ అంచనాలు అందుకోలేకపోవడంతో మళ్ళీ బన్నీ, మహేష్ సినిమాలే దిక్కయ్యాయి. ఈ నేపథ్యంలో ఎల్లుండి రాబోతున్న సినిమాలు ఆసక్తిని రేపుతున్నాయి. అందులో ప్రధానమైంది జాను. శర్వానంద్-సమంతా జంటగా తమిళ బ్లాక్ బస్టర్ 96 రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం మీద యూత్ లో చాలా అంచనాలు ఉన్నాయి.

ఆల్రెడీ ప్రూవ్ అయిన సబ్జెక్టు కాబట్టి ఇక్కడా అంతే స్థాయి విజయం అందుకుంటుందన్న ప్రీ టాక్ బాగానే ఉంది. ఇదిలా ఉండగా జానుకి సరిసమానమైన పోటీ లేదు కానీ ఉన్నంతలో చెప్పుకోదగ్గ చిన్న సినిమాలు గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాయి. అందులో మొదటిది సవారి. నందు హీరోగా డెబ్యూ డైరెక్టర్ సాకేత్ మోత్కూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గుర్రం ప్రధాన పాత్ర పోషించడం విశేషం. టాక్ బాగా వస్తే రెండో రోజు నుంచి మంచి ప్రోగ్రెస్ చూసే ఛాన్స్ ఉంది

ఇక రెండోది డిగ్రీ కాలేజీ. అవార్డు చిత్రాల దర్శకుడు నరసింహ నంది తన ట్రాక్ ని మార్చి తీసిన ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఉందని ప్రమోషన్ మెటీరియల్ చూస్తేనే అర్థమవుతోంది. కథను బట్టి కాస్త బోల్డ్ గా తీశామని యూనిట్ చెప్పుకుంటున్నా టీజర్ లాంచ్ ఈవెంట్ లో జీవిత రాజశేఖర్ డైరెక్ట్ గా స్టేజి మీద క్లాసు పీకడం అందరికీ గుర్తే. ఒకరకంగా యూత్ ని టెంప్ట్ చేసే కంటెంట్ తో వస్తోంది కాబట్టి డిగ్రీ కాలేజీకి ఓపెనింగ్స్ అయితే బాగానే రావొచ్చు. ఇక ముగ్గురు బుల్లితెర కమెడియన్స్ నటించిన 3 మంకీస్ కూడా అదే రోజు వస్తోంది. దీనికి మొదటి రోజు ఓపెనింగ్స్ ఆశించలేం కానీ ఇదీ టాక్ మీదే ఆధారపడి వస్తోంది. మొత్తానికి జానుకి సరిసమానమైన పోటీ లేదు కానీ జానర్ పరంగా చూసుకుంటే వివిధ వర్గాలను టార్గెట్ చేసిన మరో మూడు చిన్న సినిమాలు కూడా రేస్ లో ఉన్నాయి. సో పోరు ఆసక్తికరంగానే ఉంటుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి