iDreamPost

భారీగా పెరగనున్న TV ధరలు!.. త్వరగా కొనేసుకోండి!

మీరు కొత్త టీవీ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి. త్వరలోనే టీవీల ధరలు భారీగా పెరగనున్నాయి. ఆ కారణంతోనే టీవీల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ రీజన్ ఏంటంటే?

మీరు కొత్త టీవీ కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి. త్వరలోనే టీవీల ధరలు భారీగా పెరగనున్నాయి. ఆ కారణంతోనే టీవీల ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ రీజన్ ఏంటంటే?

భారీగా పెరగనున్న TV ధరలు!.. త్వరగా కొనేసుకోండి!

ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించిన ధరలు పెరుగుతున్నాయి. వీటి తయారీలో కీలకంగా మారే విడిభాగాల కొరత ఉండడం, నిర్వహణ వ్యయాలు, ముడిసరుకు, ఆర్థిక మాంద్యం వంటివి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే టీవీల ధరలకు రెక్కలు రానున్నాయి. టీవీ ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ధరల పెరుగుదల కొత్తగా టీవీలు కొనాలనుకునే వారికి షాకింగ్ గా మారనుంది. మీరు ఈ మధ్య కొత్త టీవీ కొనాలనుకుంటే వెంటనే కొనుగోలు చేయండి. లేదంటే మీ జేబుకు చిల్లు పడే అవకాశం ఉందంటూ సూచిస్తున్నారు ఎక్స్ పర్ట్స్.

భారత్ లో టీవీల ధరలు త్వరలోనే పెరగనున్నట్లు తెలుస్తోంది. దీనికి గల ప్రధాన కారణం టీవీల తయారీలో కీలక భాగమైన ఓపెన్ సెల్స్ ధరలు భారీగా పెరగడమే. మరికొన్ని రోజుల్లోనే ఓపెన్ సెల్స్ ధరలు ఆకాశాన్నంటబోతున్నాయని అంటున్నారు టెలివిజన్ ప్యానెల్ మేన్యుఫ్యాక్చరింగ్​ ఎక్స్​పర్ట్స్​. గతేడాది నుంచి ఓపెన్ సెల్స్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఓపెన్ సెల్ ధరలు ఏకంగా 20శాతం పెరగగా వచ్చే నెల ఫిబ్రవరి చివరి నాటికి వీటి ధరలు మరో 15 శాతం పెరగొచ్చని టెలివిజన్ ప్యానెల్ మేన్యుఫ్యాక్చరింగ్​ ఎక్స్​పర్ట్స్​ అభిప్రాయపడుతున్నారు.

కాగా టెలివిజన్ సెట్ల తయారీ ప్రొడక్షన్​ కాస్ట్​లో ఓపెన్ సెల్స్ ధరే 60-65శాతం వరకు ఉంటుంది. అయితే ఓపెన్ సెల్స్ ను చైనాలోని కొన్ని కంపెనీలు మాత్రమే తయారు చేస్తుండటం ధరల పెరుగుదలకు కారణమవుతోంది. అంతేగాక ఓపెన్ సెల్ తయారీదారులు ఉత్పత్తిని తగ్గించడం.. దీంతో వాటి డిమాండ్ పెరగడంతో ఇటీవలి కాలంలో టీవీల ధరల్లో పెరుగుదల చోటుచేసుకుంటుంది. మరి ఓపెన్ సెల్స్ ధరల కారణంగా టీవీల ధరలు పెరగనుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి