iDreamPost
android-app
ios-app

చంద్రయాన్-3 పనితీరుపై కీలక ప్రకటన చేసిన ఇస్రో..

చంద్రయాన్-3 పనితీరుపై కీలక ప్రకటన చేసిన ఇస్రో..

భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైంది. జులై 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 రాకెట్‌.. వివిధ దశలను దాటుకుంటూ అంతిమంగా చంద్రుడిపై సేఫ్ గా ల్యాండ్ అయింది. దీంతో చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం అయినట్లు.. చంద్రుడిపై కాలుమోపిన నాలుగో దేశంగా, చంద్రుడి దక్షిణ ద్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ అవతరించింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిసింది. అలానే రోవర్ కూడా తన పనిని ప్రారంభించి.. అక్కడ కాలుమోపిన కొన్ని గంటల్లోనే ఫోటోలను భూమి మీదకు పంపింది. ఇలాంటి తరుణంలో చంద్రయాన్ పనీతీరుపై కీలక అప్ డేట్ ఒకటి వచ్చింది.

చంద్రయాన్-3 పని తీరుపై  ఇస్రో కీలక ప్రకటన చేసింది. జాబిల్లిపై మన ల్యాండర్, రోవర్ లు ఎలా  పని చేస్తున్నాయనే విషయంతో పాటు పలు కీలక అంశాలను ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్-3 కి సంబంధించిన అన్ని యాక్టీవిటీస్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని, అన్ని సిస్టమ్స్ నార్మల్ గా పని చేస్తున్నాయని ఇస్రో ప్రకటించింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్స్ పేలోడ్స్ ఐఎల్ఎస్ఏ, RAMBHA, ChaSTEలను గురువారం ఆన్ చేసినట్లు పేర్కొంది.  ప్రగ్యాన్ రోవర్ మొబిలిటీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని ఇస్రో  తెలిపింది. ప్రొషల్షన్ మాడ్యూల్ పై  షేప్ పేలోడ్ ఆదివారం ఆన్ చేస్తామని  ట్వీట్ చేసింది.

ఇక చంద్రయాన్-3 విజయంతో ఇస్రో.. ఖ్యాతి.. ఖండాంతరాలను దాటింది. అలానే ఈ చంద్రయాన్‌-3 ప్రయోగంతో విక్రమ్‌ ల్యాండర్‌ను జాబిల్లిపై ల్యాండ్‌ చేయడంతో చంద్రుడిపై జెండా పాతిన నాలుగో దేశంగా భారత్  నిలిచింది. అలాగే చంద్రుడి దక్షిణ ద్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో యావత్‌ దేశం గర్వంగా తలెత్తుకుని విశ్వంలో మన దేశం.. తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. చంద్రయాన్‌-3 రాకెట్‌ లాంచ్‌ చేసిన తర్వాత.. మనకంటే ముందుగా చంద్రుడి దక్షిణ ద్రువంపై అడుగు పెట్టాలని రష్యా హడావిడిగా చేపట్టిన ప్రయోగం విఫలం అయ్యింది. కానీ, నిదానమే ప్రధానంగా సాగిన చంద్రయాన్‌ ప్రయోగం విజయవంతమైంది. అంతేకాక తన పనితీరు కూడా చంద్రయాన్-3 మొదలు పెట్టింది. మరి.. చంద్రయాన్-3పై వచ్చిన కీలక సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదీ చదవండి: వీడియో: జాతీయ జెండాను తీసి జేబులో పెట్టుకున్న ప్రధాని మోదీ..