iDreamPost

శ్రీలంకపై మరోసారి రివేంజ్ తీర్చుకున్న బంగ్లాదేశ్.. ఆపేలాలేరుగా.?

Bangladesh Mocking Sri Lanka: శ్రీలంక టూర్ ఆఫ్ బంగ్లాదేశ్ లో భాగంగా జరిగిన వన్డే సిరీస్ లో బంగ్లాదేశ్ ఘన విజయం నమోదు చేసింది. సిరీస్ గెలిచిన తర్వాత బంగ్లాదేశ్ ప్లేయర్స్ చేసుకున్న సెలబ్రేట్ చేసుకున్న తీరు నెట్టింట వైరల్ అవుతోంది.

Bangladesh Mocking Sri Lanka: శ్రీలంక టూర్ ఆఫ్ బంగ్లాదేశ్ లో భాగంగా జరిగిన వన్డే సిరీస్ లో బంగ్లాదేశ్ ఘన విజయం నమోదు చేసింది. సిరీస్ గెలిచిన తర్వాత బంగ్లాదేశ్ ప్లేయర్స్ చేసుకున్న సెలబ్రేట్ చేసుకున్న తీరు నెట్టింట వైరల్ అవుతోంది.

శ్రీలంకపై మరోసారి రివేంజ్ తీర్చుకున్న బంగ్లాదేశ్.. ఆపేలాలేరుగా.?

శ్రీలంక టూర్ ఆఫ్ బంగ్లాదేశ్ లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ లు హోరా హోరీగా జరుగుతున్నాయి. ఇప్పటికే టీ20 సిరీస్ లో శ్రీలంక విజయం సాధించగా.. బంగ్లాదేశ్ జట్టు 3 వన్డేలా సిరీస్ లో 2-1 తేడాతో విజయం సాధించి సిరీస్ ని సొంతం చేసుకుంది. ఈ సిరీస్ కి సంబంధించిన ట్రోఫీ అందుకున్న తర్వాత బంగ్లాదేశ్ ఆటగాళ్లు చేసుకున్న సెలబ్రేషన్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్ గా మారిపోయింది. అసలు వీళ్ల మధ్య ఏం జరుగుతోంది? వీళ్ల సెలబ్రేషన్స్ కి కారణం ఏంటి? ఎందుకు శ్రీలంక- బంగ్లాదేశ్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది? పూర్తి వివరాలు చూద్దాం.

శ్రీలంక టూర్ ఆఫ్ బంగ్లాదేశ్ 2024 ఆసక్తిగా సాగుతోంది ఈ టూర్ లో భాగంగా 3 టీ20 మ్యాచుల సిరీస్, 3 వన్డే మ్యాచుల సిరీస్, 2 టెస్టుల సిరీస్ లలో తలపడుతున్నారు. ఇప్పటికే టీ20 సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ లో శ్రీలంక విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన 3 మ్యాచుల వన్డేల సిరీస్ లో 2-1 తేడాతో బంగ్లాదేశ్ సిరీస్ ని కైవసం చేసుకుంది. అయితే సిరీస్ విన్ తర్వాత బంగ్లాదేశ్ చేసుకున్న సెలబ్రేషన్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.

ట్రోఫీ అందుకున్న తర్వాత టీమ్ ఫొటో తీసుకోవడానిక రెడీ అయ్యింది. ఆ సమయంలో ముష్ ఫికర్ హెల్మెట్ తీసుకుని గ్రౌండ్ లోకి వచ్చాడు. ఆ హెల్మెట్ చూపిస్తూ.. కాస్త నిరుత్సాహంగా ఉన్నట్లు ఫేస్ పెట్టాడు. చాలామందికి ఆ సెలబ్రేషన్స్ ఎందుకు అనే విషయం అర్థం కాలేదు. అయితే శ్రీలంక- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధానికి ఈ సెలబ్రేషన్స్ ఒక కారణం. ఈ సెలబ్రేషన్స్ కి కారణం శ్రీలంక టీమ్ ని, మాథ్యూస్ ని మాక్ చేయడమే వీళ్ల మధ్య ఈ యుద్ధం జరగడానికి ఒక “టైమ్డ్ అవుటే” కారణం.

అసలు ఏం జరిగింది?:

వరల్డ్ కప్ క్లాష్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆంజెలో మాథ్యూస్ టైమ్డ్ అవుట్ గా వెనుదిరిగాడు. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే మొట్ట మొదటి ఆటగాడిగా మాథ్యూస్ నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఆటగాడిని అవుట్ చేసిన తర్వాత మాథ్యూస్ టైమ్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. అలాగే టీ20 సిరీస్ గెలిచిన తర్వాత కూడా బంగ్లాదేశ్ ఆటగాళ్లని మాక్ చేస్తున్నట్లు వాచ్ చూశాడు. ఇలా వీళ్ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా ఫుష్ ఫిఖర్ హెల్మెట్ ని గ్రౌండ్ లోకి తీసుకొచ్చి ట్రోఫీ తీసుకుంటూ గేళి చేశాడు. వీళ్ల డిఫరెంట్ సెలబ్రేషన్స్ ఒకరిని ఒకరు మాక్ చేసుకోవడం చూస్తున్న నెటిజన్స్ నోరెళ్లబెడతున్నారు. అసలు వీళ్ల మధ్య జరుగుతున్న గొడవలు, పిల్లాటలు చూసి నవ్వేసుకుంటున్నారు. ఇప్పుడల్లా ఆపేలా లేరుగా వీళ్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వీళ్ల గొడవలు అందరికీ మంచి ఎంటర్ టైన్మెంట్ అందిస్తోందిగా అంటున్నారు. మరి.. శ్రీలంక- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఈ పరోక్ష యుద్ధంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి