iDreamPost
android-app
ios-app

IPL 2024: ఇషాన్ కిషన్ కు వెరైటీ పనిష్మెంట్! వైరలవుతున్న వీడియో..

  • Published Apr 02, 2024 | 6:14 PM Updated Updated Apr 02, 2024 | 6:14 PM

టీమ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ముంబై ఇండియన్స్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు ఎంఐ మేనేజ్ మెంట్ వెరైటీ పనిష్మెంట్ ఇచ్చింది.

టీమ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ముంబై ఇండియన్స్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు ఎంఐ మేనేజ్ మెంట్ వెరైటీ పనిష్మెంట్ ఇచ్చింది.

IPL 2024: ఇషాన్ కిషన్ కు వెరైటీ పనిష్మెంట్! వైరలవుతున్న వీడియో..

ముంబై ఇండియన్స్-రాజస్తాన్ రాయల్స్ మధ్య వాంఖడే స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. సప్పగా సాగిన ఈ పోరులో 6 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది రాజస్తాన్ టీమ్. ఇక ఈ మ్యాచ్ లో టీమ్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ముంబై ఇండియన్స్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు ఎంఐ మేనేజ్ మెంట్ వెరైటీ పనిష్మెంట్ ఇచ్చింది. ఆ శిక్షకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఇషాన్ కిషన్.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు టీమిండియాలో హాట్ టాపిక్ గా మారిన ఆటగాడు. మానసిక ఒత్తిడి కారణంగా విశ్రాంతి కావాలని చెప్పి.. అతడు చేసిన పనులకు బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు కావడం, బీసీసీఐ మాట వినడం, ఐపీఎల్ ప్రారంభం కావడం ఇవన్నీ అందరికి తెలిసిందే. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. సాధారణంగా ఓ ఆటగాడు మ్యాచ్ లో నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఐసీసీ క్రమ శిక్షణాచర్యలు తీసుకుంటుంది. వారికి మ్యాచ్ ఫీజులో జరిమానా విధించడంతో పాటుగా కొన్ని మ్యాచ్ లను కూడా ఆడకుండా నిషేధిస్తుంది.

అలాగే ఐపీఎల్ లో ఆడే అన్ని జట్లకు తమ ఫ్రాంచైజీలు కొన్ని రూల్స్ ను పెడతాయి. ఆ నిబంధనలు అతిక్రమిస్తే.. వారికి పనిష్మెంట్లను కూడా ఇస్తాయి. తాజాగా టీమ్ రూల్స్ ను అతిక్రమించిన ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కు మేనేజ్మెంట్ వెరైటీ శిక్షను విధించింది. పనిష్మెంట్ లో భాగంగా రోజంతా సూపర్ హీరో జంప్ సూట్ ధరించాల్సిందిగా ఎంఐ మేనేజ్ మెంట్ ఇషాన్ ను ఆదేశించింది. దాంతో అతడు రోజు మెుత్తం జంప్ సూట్ ధరించే చక్కర్లు కొట్టాడు. అదే సూట్ తో ఎయిర్ పోర్ట్ లోపలికి వెళ్తున్న, విమానంలో ఆ సూట్ తో సరదాగా కనిపించాడు ఇషాన్. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇషాన్ తో పాటుగా మరికొందరు ప్లేయర్లు కూడా ఆ సూట్ లో దర్శనమిచ్చారు.

అయితే ఇషాన్ ఇలాంటి శిక్ష ఎదుర్కొవడం ఇదే మెుదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి పనిష్మెంట్ ను అనుభవించాడు. కాగా.. హోటల్స్ లో కాల్ సమయం పాటించకపోవడం, ప్రాక్టీస్ కు ఆలస్యంగా రావడం ఇలాంటి రూల్స్ అతిక్రమిస్తే.. వారికి ఇలా వెరైటీ శిక్ష విధిస్తారు. ఫ్రాంచైజీలు ప్రతీ సీజన్ కు ప్రత్యేకమైన డ్రస్సులు సిద్ధం చేసి.. ఇలా పనిష్మెంట్స్ ఇస్తుంటారు. అయితే ఎంతో ఫన్నీగా ఉండే ఇషాన్ కు ఇది శిక్షలా లేదు.. సరదాగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి ఇషాన్ కు విధించిన ఫన్నీ పనిష్మెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mumbai Indians (@mumbaiindians)

ఇదికూడా చదవండి: SRH vs CSK: ధోని ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌! ఇది అస్సలు ఊహించి ఉండరు

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş