iDreamPost

పాకిస్థాన్‌ను వణికించిన ఆసీస్‌ యువ బౌలర్‌! గాల్లో వికెట్ల డ్యాన్స్‌

  • Published Feb 08, 2024 | 6:20 PMUpdated Feb 08, 2024 | 6:20 PM

అండర్‌ 19 వరల్డ్‌ కప్‌లో సూపర్‌ బౌలింగ్‌ తో ఆకట్టుకున్నాడు ఆసీస్‌ యువ బౌలర్‌ టామ్‌. అతని దెబ్బకు పాకిస్థాన్‌ బ్యాటర్ల వికెట్లు గాల్లో పిట్టల్లా ఎగిరాయి. మరి ఆ అద్భుత ప్రదర్శన గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

బాల్‌ పడుతుంటే.. బ్యాటర్లు వణికిపోతున్నారు. బుల్లెట్‌లా దూసుకొస్తున్న బంతులను ఎదుర్కొలేక చేతులెత్తేశారు. దాంతో.. వికెట్లు గాల్లో పక్షుల్లా ఎగిరాయి. ఈ సూపర్‌ బౌలింగ్‌ స్పెల్‌.. అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ 2024 సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో చోటు చేసుకోంది. ఈ విధ్వంసానికి బలమైంది మాత్రం పాకిస్థాన్‌. ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ బ్యాటర్లను ఆసీస్‌ బౌలర్‌ టామ్ స్ట్రాకర్ వణికించాడు.

నిప్పులు చిమ్ముతున్న అతని బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు పాక్‌ యువ జట్టు అల్లాడిపోయింది. టామ్‌ దెబ్బకు సెమీస్‌లో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్‌ కేవలం 179 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ యువ సంచలనం టామ్‌ ఏకంగా 6 వికెట్లతో చెలరేగాడు. టామ్‌ స్ట్రాకర్‌ దెబ్బకు ఏకంగా నలుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే పరిమితం అయ్యారు. మొత్తం 9.5 ఓవర్లు వేసిన టామ్‌ కేవలం 24 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి పాకిస్థాన్‌ పతనాన్ని శాసించాడు. అతనితో పాటు మిగతా ఆసీస్‌ బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బౌలింగ్‌ వేయడంతో పాకిస్థాన్‌ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.

ఆస్ట్రేలియాను సెమీస్‌లో ఓడించి.. ఫైనల్లో ఇండియాతో తలపడితే.. సూపర్‌ మ్యాచ్‌ను చూడొచ్చని క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆశపడ్డారు. అయితే.. ఆ ఆశ తీరేలా లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియాను 180 పరుగుల చేయనివ్వకుండా పాక్‌ అడ్డుకోగలిగితే.. ఇండియా-పాకిస్థాన్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ చూడొచ్చు. అయితే.. అది సులువైన విషయం కాదు. ఆస్ట్రేలియా కుర్రాళ్ల టీమ్‌ కూడా చాలా పటిష్టంగా ఉంది. వాళ్లను ఓడించి.. పాక్‌ ఫైనల్‌కు రావడం దాదాపు కష్టంగానే కనిపిస్తోంది. మరి ఈ మ్యాచ్‌లో టామ్‌ స్ట్రాకర్‌ బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి