iDreamPost

Ishan Kishan: BCCI స్ట్రాంగ్ వార్నింగ్.. ఎట్టకేలకు దిగొచ్చిన ఇషాన్ కిషన్!

బీసీసీఐ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ తో టీమిండియా యంగ్ ప్లేయర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ దిగొచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

బీసీసీఐ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ తో టీమిండియా యంగ్ ప్లేయర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ దిగొచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Ishan Kishan: BCCI స్ట్రాంగ్ వార్నింగ్.. ఎట్టకేలకు దిగొచ్చిన ఇషాన్ కిషన్!

గత కొన్ని రోజులుగా టీమిండియా స్టార్ వికెట్ కీపర్, పాకెట్ డైనమెట్ ఇషాన్ కిషన్ కు బీసీసీఐ కు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇషాన్ తీరుపై కోపంతో ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. సెంట్రల్ కాంట్రాక్ట్ కలిసిగిన ప్లేయర్లు జాతీయ జట్టులోకి రావాలంటే.. తప్పకుండా దేశవాలీ టోర్నీల్లో ఆడాలని స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలను పట్టించుకోకుండా ఇషాన్ ఐపీఎల్ సన్నాహకాల్లో నిమగ్నమైయ్యాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ నుంచి ఇషాన్ కు ఓ స్ట్రాంగ్ మెయిల్ వెళ్లిందని తెలుస్తోంది. దీంతో దెబ్బకు దిగొచ్చాడట ఈ యంగ్ ప్లేయర్.

టీమిండియాలోకి రావాలంటే తప్పనిసరిగా ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ. అయినప్పటికీ.. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు దేశవాలీ క్రికెట్ కాదని ఐపీఎల్ సన్నాహకాల్లో పాల్గొంటున్నారు. దీంతో వీరిపై గుర్రుగా ఉంది బీసీసీఐ. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సైతం ఇదే విషయాన్ని ఇటీవలే చెప్పుకొచ్చాడు. కాగా.. ద్రావిడ్ మాటలను పెడచెవిన పెట్టిన ఇషాన్ రంజీలకు దూరంగా ఉన్నాడు. దీంతో ఈ యువ ఆటగాడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

ఇక ఆ హెచ్చరికలను చూసి ఏం అనుకున్నాడో ఏమో గానీ.. ఎట్టకేలకు ఇషాన్ దిగొచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ప్రాక్టీస్ ను పక్కనపెట్టి త్వరలోనే ప్రారంభంకానున్న డీవై పాటిల్ టోర్నీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడట. కాగా.. ఈ విషయాన్ని ఇషాన్ స్వయంగా చెప్పకపోయినప్పటికీ.. అతడి సన్నిహితులు స్థానిక మీడియాతో వెల్లడించినట్లు సమాచారం. అదీకాక ఐపీఎల్ కు ముందు దేశవాలీ ట్రోర్నీల్లో పాల్గొనకుంటే.. సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. ఇది కూడా ఇషాన్ తలొగ్గడానికి ప్రధాన కారణమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇషాన్ కిషన్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో ‘గ్రేడ్ – సి’లో ఉన్నాడు. అతడికి సంవత్సరానికి కోటి రూపాయాల వేతనం లభిస్తోంది. మరి బీసీసీఐ వార్నింగ్ కు దిగొచ్చిన ఇషాన్ కిషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IND vs ENG: మూడో టెస్టుకు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. ఇద్దరు కుర్రాళ్ల ఎంట్రీ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి