iDreamPost

IND vs ENG: మూడో టెస్టుకు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. ఇద్దరు కుర్రాళ్ల ఎంట్రీ!

  • Published Feb 13, 2024 | 7:52 PMUpdated Feb 13, 2024 | 7:52 PM

ఇంగ్లండ్​తో రెండు టెస్టులు ఆడేసిన టీమిండియా.. మూడో మ్యాచుకు రెడీ అవుతోంది. సిరీస్​లో కీలకంగా మారిన ఈ టెస్టుకు రాజ్​కోట్ ఆతిథ్యం ఇస్తోంది.

ఇంగ్లండ్​తో రెండు టెస్టులు ఆడేసిన టీమిండియా.. మూడో మ్యాచుకు రెడీ అవుతోంది. సిరీస్​లో కీలకంగా మారిన ఈ టెస్టుకు రాజ్​కోట్ ఆతిథ్యం ఇస్తోంది.

  • Published Feb 13, 2024 | 7:52 PMUpdated Feb 13, 2024 | 7:52 PM
IND vs ENG: మూడో టెస్టుకు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. ఇద్దరు కుర్రాళ్ల ఎంట్రీ!

ఇంగ్లండ్​తో తొలి రెండు టెస్టులు ముగియడం, లాంగ్ గ్యాప్ దొరకడంతో భారత క్రికెటర్లు తమ ఇళ్లకు వెళ్లి రెస్ట్ తీసుకున్నారు. అటు ఇంగ్లీష్ టీమ్ మొత్తం అబుదాబికి వెళ్లారు. అక్కడ తమ కుటుంబాలతో కలసి సరదాగా గడిపారు. అలా దొరికిన విరామాన్ని ఇరు జట్లు కంప్లీట్​గా వాడుకున్నాయి. ఇక, మూడో టెస్టుకు సమయం ఆసన్నమవడంతో ఇరు జట్లు మళ్లీ సీరియస్ మోడ్​లోకి వచ్చేశాయి. ఈ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తున్న రాజ్​కోట్​కు ఇప్పటికే భారత జట్టు ఆటగాళ్లు చేరుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ సహా మిగిలిన వాళ్లందరూ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు. ఇంగ్లండ్ క్రికెటర్లు కూడా రాజ్​కోట్​కు పయనమయ్యారు. ఈ తరుణంలో మూడో టెస్టుకు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. సీనియర్ల ప్లేసులో ఇద్దరు జూనియర్లు ఎంట్రీ ఇవ్వడం పక్కా అని తెలుస్తోంది.

గాయంతో బాధపడుతున్న స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మూడో టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. తొలి రెండు టెస్టుల్లో దారుణంగా ఫెయిలైన స్టార్ బ్యాట్స్​మన్ శ్రేయస్ అయ్యర్​కు సిరీస్​లోని మిగిలిన మూడు టెస్టులకు ప్రకటించిన జట్టులో చోటు దక్కలేదు. జట్టు ఎంపిక సమయంలో అతడ్ని సెలక్టర్లు పట్టించుకోలేదు. మొదటి రెండు మ్యాచుల్లో కీపర్ భరత్ అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ ముగ్గురి ప్లేసుల్లోకి కొత్త ఆటగాళ్లు రావడం పక్కా అని తెలుస్తోంది. ఇందులో భరత్​ స్థానాన్ని కొత్త వికెట్ కీపర్ ధృవ్ జురెల్​తో భర్తీ చేయనున్నారని సమాచారం. అయ్యర్​ ప్లేసును సర్ఫరాజ్ ఖాన్​తో రీప్లేస్ చేయనున్నారని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక, రాహుల్ స్థానంలో రజత్ పాటిదార్ రెండో టెస్టులో బరిలోకి దిగాడు. అతడు అంతగా రాణించకున్నా మరో ఛాన్స్ ఇవ్వాలని టీమ్ మేనేజ్​మెంట్ భావిస్తోందట.

ఒకవేళ రజత్ పాటిదార్​ను పక్కన పెట్టాలని అనుకుంటే డాషింగ్ లెఫ్టాండర్ దేవ్​దత్ పడిక్కల్​కు ఛాన్స్ దక్కొచ్చు. మొత్తంగా ప్రస్తుత పరిస్థితలను బట్టి సీనియర్ల ప్లేసుల్లో కనీసం ఇద్దరు యంగ్ ప్లేయర్స్ అరంగేట్రం చేయడం పక్కాగా కనిపిస్తోంది. ఇందుకు భారత నెట్ ప్రాక్టీస్ ఫొటోలు కూడా ఊతమిస్తున్నాయి. సర్ఫరాజ్, జురెల్, పాటిదార్ కలసి ఒకే సమయంలో బ్యాటింగ్ చేశారు. అలాగే జురెల్ చాలా సేపు కీపింగ్ ప్రాక్టీస్ చేయగా.. ఫస్ట్ స్లిప్​లో సర్ఫరాజ్, సెకండ్ స్లిప్​లో జైస్వాల్, గల్లీలో పాటిదార్ ఫీల్డింగ్ సాధన చేస్తూ కనిపించారు. హెడ్ కోచ్ ద్రవిడ్​తో పాటు కెప్టెన్ రోహిత్ ప్రాక్టీస్ సందర్భంగా వీళ్లతో ముచ్చటిస్తూ, సూచనలు ఇవ్వడం కూడా కెమెరా కంటికి చిక్కింది. దీంతో ఈ యంగ్​స్టర్స్​ను ఆడించడం ఖాయం అని అనలిస్టులు కూడా అంటున్నారు. మరి.. మూడో టెస్టులో ఇద్దరు యంగ్​స్టర్స్ అరంగేట్రం చేయడం పక్కా అనే వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs ENG: KS భరత్ నే ఆడించాలి.. ఆ ప్లేయర్ వద్దు! మాజీ క్రికెటర్ ఆసక్తికర కామెంట్స్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి