iDreamPost
android-app
ios-app

వీడియో: స్టార్క్‌ బౌలింగ్‌లో అడ్డిగుడ్డి బ్యాటింగ్‌తో పరువుతీసుకున్న టీమిండియా క్రికెటర్‌!

  • Published May 04, 2024 | 10:49 AM Updated Updated May 04, 2024 | 10:49 AM

Mitchell Starc, Ishan Kishan: కేకేఆర్‌ వర్సెస్‌ ముంబై మ్యాచ్‌లో మిచెల్‌ స్టార్క్‌ 4 వికెట్లతో రాణించాడు. అయితే.. స్టార్క్‌ ఈ రేంజ్‌లో చెలరేగేందుకు ఇషాన్‌ కిషన్‌ చెత్త బ్యాటింగ్‌ కారణమంటూ విమర్శలు వస్తున్నాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

Mitchell Starc, Ishan Kishan: కేకేఆర్‌ వర్సెస్‌ ముంబై మ్యాచ్‌లో మిచెల్‌ స్టార్క్‌ 4 వికెట్లతో రాణించాడు. అయితే.. స్టార్క్‌ ఈ రేంజ్‌లో చెలరేగేందుకు ఇషాన్‌ కిషన్‌ చెత్త బ్యాటింగ్‌ కారణమంటూ విమర్శలు వస్తున్నాయి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

  • Published May 04, 2024 | 10:49 AMUpdated May 04, 2024 | 10:49 AM
వీడియో: స్టార్క్‌ బౌలింగ్‌లో అడ్డిగుడ్డి బ్యాటింగ్‌తో పరువుతీసుకున్న టీమిండియా క్రికెటర్‌!

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ 4 వికెట్లతో చెలరేగాడు. సొంత మైదానంలో ముంబైని 170 రన్స్‌ ఛేజ్‌ చేయనివ్వకుండా అడ్డుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు పూర్‌ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న స్టార్క్‌.. ఒక్కసారిగా పెద్దపులిలా ముంబై బ్యాటింగ్‌ లైనప్‌పై విరుచుకుపడ్డాడు. 3.5 ఓవర్లలో కేవలం 33 రన్స్‌ ఇచ్చి 4 కీలక వికెట్లు తీసుకుని కేకేఆర్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో మిచెల్‌ స్టార్క్‌ను ముంబై ఇండియన్స్‌ యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ చాలా లైట్‌ తీస్కొని ఆడి.. ఫామ్‌లో లేని అతన్ని ఫామ్‌లోకి తెచ్చాడు. అదే ముంబై ఇండియన్స్‌కి శాపమైంది.

ఈ మ్యాచ్‌ కంటే ముందు మిచెల్‌ స్టార్క్‌ ఎంత చెత్త ఫామ్‌లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే అలుసుగా తీసుకుని.. ఇషాన్‌ కిషన్‌ స్టార్క్‌ వేసిన ఇన్నింగ్స​్‌ రెండో ఓవర్‌లో చాలా ఫ్రీగా అడ్డదిడ్డంగా ఆడాడు. రెండు బంతికి ఫోర్‌, మూడో బంతికి సిక్స్‌ కొట్టి.. స్టార్క్‌ బ్యాడ్‌ ఫామ్‌ను క్యాష్‌ చేసుకున్నాడు. కానీ, ఎంత బ్యాడ్‌ ఫామ్‌లో ఉన్నా.. ఒక క్వాలిటీ బౌలర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇ‍వ్వాలి. ఇక్కడే ఇషాన్‌ కిషన్‌ తప్పు చేశాడు.. మిచెల్‌ స్టార్క్‌ను తక్కువగా అంచనా వేసి.. కళ్లు ముసుకుని అడ్డిగుడ్డి షాట్‌ ఆడాడు. ఫలితంగా వికెట్‌ ఎగిరి పడింది. ఇషాన్‌ కిషన్‌ను సూపర్‌ బాల్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేసినా.. స్టార్క్‌ కనీసం సెలబ్రేట్‌ చేసుకోలేదు. ఎందుకంటే.. అది ఇషాన్‌ అడ్డదిడ్డమైన షాట్‌కు వచ్చిన వికెట్‌ అని అతనికి తెలుసు.

అయితే.. ఇషాన్‌ కిషన్‌ను తొలి ఓవర్‌లనే అవుట్‌ చేయడంతో స్టార్క్‌కు కొత్త కాన్ఫిడెన్స్‌ వచ్చింది. అక్కడి నుంచి మంచి లైన్‌ అండ్‌ లెంత్‌తో బౌలింగ్‌ చేసిన స్టార్క్‌.. పోయిన తన రిథమ్‌ను తిరిగి పట్టుకున్నాడు. కిషన్‌ను అవుట్‌ చేసిన తర్వాత.. డేంజరస్‌ మ్యాన్‌ టిమ్‌ డేవిడ్‌ని అవుట్‌ చేశాడు. దాంతో పాటే మరో రెండు వికెట్లు పడగొట్టి.. మొత్తం నాలుగు వికెట్లతో కేకేఆర్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 12 ఏళ్ల నుంచి వాంఖడేలో గెలుపంటే ఏంటో తెలియని కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌.. విజయం అందించాడు. అయితే.. డేంజరస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఫామ్‌లోకి రావడానికి ఇషాన్‌ కిషన్‌ చెత్త బ్యాటింగ్‌ కారణమంటూ క్రికెట్‌ అభిమానులు సైతం విమర్శలు చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.