iDreamPost

వర్షాకాలంలో ఇవి తిన్నారా.. రోగాలకు స్వాగతం పలికినట్లే!

  • Published Jul 26, 2023 | 4:09 PMUpdated Jul 26, 2023 | 4:09 PM
  • Published Jul 26, 2023 | 4:09 PMUpdated Jul 26, 2023 | 4:09 PM
వర్షాకాలంలో ఇవి తిన్నారా.. రోగాలకు స్వాగతం పలికినట్లే!

మిగతా కాలాలతో పోలిస్తే.. వర్షాకాలంలో ఆరోగ్యం విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఏది పడితే అది.. ఎక్కడ పడితే అక్కడ తినలేం. బయట ఆహారం అసలు తినకూడదు అంటారు. ఈ కాలంలో ఇంట్లోనే వేడి వేడిగా వండిన పదార్థాలు తీసుకోవాలని సూచిస్తారు. అయితే వర్షాకాలంలో బయట ఆహారం మాత్రమే కాక.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొన్ని కూరగాయలు, ఆకు కూరలు కూడా తినకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. అదేంటి తాజా ఆకు కూరలు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కదా.. మరి వాటిని ఎందుకు తినకూడదు అంటే..

వర్షాకాలంలో ఆకు కూరలు ఎప్పుడు తేమగా ఉంటాయి. దాని వల్ల వాటిలోని పోషకాలన్ని మన శరీరానికి అందవు అంటున్నారు. అంతేకాక తేమ కారణంగా వాటిలో బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. సాధారణంగా ఆకు కూరలు ఆరోగ్యానికి మంచివి అంటారు. వీటిల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నప్పటికి.. వర్షాకాలంలో మాత్రం ఆకు కూరలు తినకూడదు అంటున్నారు. వర్షాకాలంలో వాటికి తగినంత సూర్య రష్మి తగలకపోవడం వల్ల వాటిలో బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువ. అందుకే వాటిని ఎక్కువగా వినియోగించకూడదు అంటున్నారు.

అలానే క్యాబేజీ, బ్రొకోలీ, కాలిఫ్లవర్‌ వంటి కూరగాయాల్లో ఆకులు చాలా దగ్గరదగ్గరగా ఉండి.. వాటిల్లో క్రిములు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక వాటిని వాడకుండా ఉంటేనే మంచిది అంటున్నారు.ఒకవేళ ఆకు కూరలు, కూరగాయలు వినియోగించాల్సి వస్తే.. వాటిని వేడి నీటిలో ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడగాలి. నీరు పూర్తిగా వంపేసిన తర్వాత బాగా ఉడికించి ఆ తర్వాత వాటితో వంటలు చేయాలి.

ఎందుకు తినకూడదు అంటే..

  1. వర్షాకాలంలో ఆకు కూరల్లో బ్యాక్టీరియా ఎక్కువగా చేరతాయి. ఆకుల మధ్య బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వినియోగించకపోవడం ఉత్తమం.
  2. ఆకు కూరలు చిత్తడి ప్రాంతంలో పెరుగుతాయి. సూర్య రష్మి లేకపోవడం వల్ల బ్యాక్టీరియా చాలా త్వరగా చేరుతుంది.
  3. చల్లని ప్రదేశంలో ఆకు కూరలు ఉంచినప్పుడు ఫ్రెష్‌గా కనిప్తిఆయి. వాటిని నిల్వ చేసే ప్రదేశం శుభ్రంగా లేకపోతే ఆకుకూరలు కలుషితం అవుతాయి. వాటిని తింటే ఫుడ్‌ పాయిజన్‌ అయ్యే అవకాశం ఉంటుంది.
  4. కాలీఫ్లవర్‌, బ్రొకోలీ వంటి కూరగాయల్లో సూక్ష్మ జీవులు చేరి ఆహారంగా తింటుంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవాలనుకుంటే.. వీటిని ముందుగా వేడి నీటిలో ఉప్పు వేసి బాగా కడిగి శుభ్రం చేసి.. వాడుకోవాలి.
  5. కలర్‌ ఇంజక్షన్స్‌ను వాడటం వల్ల ఆకు కూరలకు మరింత ముదురు రంగులో కనిపిస్తున్నాయి. కానీ ఇవి ఆరోగ్యానికి చాలా హానీ చేస్తాయి. కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి