iDreamPost

ఎలక్షన్స్ టైంలో ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభమేనా?

ఎలక్షన్ సీజన్ వచ్చేసింది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, ఏపీలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల ప్రభావం తెలుగు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ మీద పడనుంది. ఈ ఒక్కసారి మాత్రమే కాదు.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రియల్ ఎస్టేట్ మీద పడుతుంది. మరి ఇలాంటి సమయంలో ప్రాపర్టీ కొనుక్కోవచ్చా? కొనుక్కోవడం వల్ల లాభమా? నష్టమా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

ఎలక్షన్ సీజన్ వచ్చేసింది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, ఏపీలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల ప్రభావం తెలుగు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ మీద పడనుంది. ఈ ఒక్కసారి మాత్రమే కాదు.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రియల్ ఎస్టేట్ మీద పడుతుంది. మరి ఇలాంటి సమయంలో ప్రాపర్టీ కొనుక్కోవచ్చా? కొనుక్కోవడం వల్ల లాభమా? నష్టమా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

ఎలక్షన్స్ టైంలో ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభమేనా?

ఐదేళ్లకొకసారి జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఎన్నికల ప్రచారం కోసం, ఇతర ఖర్చుల కోసం పెద్ద మొత్తంలో డబ్బు అనేది అవసరమవుతుంది. రాజకీయాల్లో ఉన్న చాలా మంది రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతుంటారు. కరెక్ట్ గా ఎలక్షన్స్ సమయంలో ఎన్నికల ప్రచారం కోసం, ఇతర ఖర్చుల కోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దాని కోసం ప్రాపర్టీలను అమ్మి డబ్బుని ఎలక్షన్ ఫండ్ గా వినియోగించాలని అనుకుంటారు. రాజకీయ నాయకులు మాత్రమే కాదు.. కొంతమంది రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ప్రైవేట్ వ్యక్తులు కూడా పార్టీలకు ఫండ్స్ ఇస్తుంటారు. ఈ క్రమంలో డబ్బు కోసం ప్రాపర్టీస్ ని అమ్మే ప్రయత్నం చేస్తుంటారు. ఈ కారణంగా ప్రాపర్టీ అమ్మి డబ్బు తీసుకురావాలన్న ఒత్తిడి రియల్ ఎస్టేట్ డెవలపర్స్ పై పడుతుంది. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ దగ్గర ఎలక్షన్ ఫండ్ కి సరిపడా డబ్బు ఉండదు. అప్పటికప్పుడు భారీగా డబ్బు కావాలంటే ప్రాపర్టీలు వెంటనే అమ్ముడైపోవాలి.

అలా జరగాలంటే బయ్యర్స్ ని ఆకట్టుకోవాలి. అందుకోసం మార్కెట్ లో ఉన్న ధర కంటే ప్రాపర్టీ రేట్లను తగ్గించాలి. అందుకే ఉన్న ధర మీద 20 నుంచి 30 శాతం ధరలు తగ్గిస్తారు. అసలు ధర కంటే తక్కువ ధరకే స్థలాలను, ఫ్లాట్స్ ని అమ్మే ప్రయత్నం చేస్తారు. దీంతో ఎలక్షన్ ఫండ్ కి సరిపడా డబ్బు అనేది వస్తుంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇదే తంతు రిపీట్ అవుతుంది. అందుకే చాలా మంది ఎన్నికల సమయంలో ప్రాపర్టీస్ కొంటూ ఉంటారు. దీని వల్ల లాభమా? నష్టమా? అంటే ఖచ్చితంగా లాభమే అన్న విషయం అర్ధమవుతుంది. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కి డబ్బు అవసరం. ప్రాపర్టీ కొనేవారికి దాని ధర తగ్గడం అవసరం. మార్కెట్ రేటు మీద 20, 30 శాతం తగ్గుతుందంటే ఎవరు మాత్రం కొనకుండా ఉంటారు చెప్పండి.

అందుకే ఎలక్షన్స్ టైంని బయ్యర్స్ టైం అని పిలుస్తారు. పైగా ఎన్నికల సమయంలో కొనడం వల్ల ఎన్నికల ఫలితాల అనంతరం అధికారంలోకి వచ్చే పార్టీ రియల్ ఎస్టేట్ రంగంలో చేసే మార్పుల కారణంగా భారీ లాభాలు ఉంటాయన్న ఆశ అందరిలో ఉంటుంది. ప్రభుత్వాలు కూడా రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపెడతాయి. రకరకాల పాలసీలు తీసుకొస్తుంటాయి. ఈ కారణంగా చాలా మంది ఎన్నికల సమయంలో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతుంటారు. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఎలాగైనా సరే అమ్ముడవ్వని ప్రాపర్టీలని అమ్మాలని ప్రయత్నం చేస్తుంటారు. దీన్ని చాలా మంది క్యాష్ చేసుకుంటారు. అందుకే చాలా మంది బేరం ఆడి ఇంకా తక్కువ ధరకి ప్రాపర్టీలను కొనుగోలు చేస్తారు. డెవలపర్స్ కూడా డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తుంటారు. కాబట్టి ఎన్నికల సమయంలో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడం లేదా ప్రాపర్టీ కొనడం వల్ల లాభమే తప్ప నష్టం ఉండదు అనేది నిపుణుల వాదన.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి