iDreamPost

బిల్డర్ కట్టిన ఇల్లు మంచిదా?.. కట్టించుకున్న ఇల్లు మంచిదా?

సొంతిల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా? బిల్డర్ కట్టిన ఇళ్లను కొంటే మంచిదా లేక సొంతంగా దగ్గరుండి ఇల్లు కట్టుకుంటే మంచిదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

సొంతిల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా? బిల్డర్ కట్టిన ఇళ్లను కొంటే మంచిదా లేక సొంతంగా దగ్గరుండి ఇల్లు కట్టుకుంటే మంచిదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

బిల్డర్ కట్టిన ఇల్లు మంచిదా?.. కట్టించుకున్న ఇల్లు మంచిదా?

కూడు, గూడు, గుడ్డ అనేవి మనిషికి ప్రాథమిక అవసరాలు. నేటికి ఈ అవసరాలను తీర్చుకోలేని వారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా సొంతిల్లు లేని వారు అద్దె ఇళ్లలో ఉంటూ బతుకుల వెల్లదీసుకుంటున్నారు. ఎప్పటికైనా సొంతింటి కలను నెరవేర్చుకోవాలని రేయింబవళ్లు కష్టపడుతూ పైసా పైసా పోగు చేసుకుంటుంటారు. ఇంటికి సరిపడా డబ్బు జమ అయిన తర్వాత స్థలం కొనుక్కోని మంచి ఇల్లును నిర్మించుకోవాలని భావిస్తుంటారు. మరికొంతమందేమో ఆల్రెడీ కట్టిన ఇల్లును కొనుక్కోవాలని ప్లాన్ చేస్తుంటారు. మరి సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి బిల్డర్లు కట్టిన ఇల్లు కొనుక్కుంటే మంచిదా? లేదా ఎవరికి వారే దగ్గరుండి ఇల్లు కట్టుకోవడం మంచిదా?

హైదరాబాద్ వంటి నగరాల్లో బిల్డర్లు ఫ్లాట్లను కట్టి అమ్ముతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇది గ్రామీణ ప్రాంతాలకు ఎగబాకింది. బిల్డర్లు ఇళ్లను నిర్మించి కస్టమర్లకు అమ్ముతున్నారు. ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతాలకు వలస పోయిన వారు సొంత ఊళ్లో దగ్గరుండి ఇల్లు కట్టుకునే తీరిక ఉండదు. ఇలాంటి వారు బిల్డర్లు కట్టిన ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. మరికొంత మంది దగ్గరి బంధువులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారికి అప్పగించి ఇల్లు కట్టించుకుంటున్నారు. అయితే బిల్డర్ కట్టిన ఇల్లును కొనుక్కోవాలనుకుంటే కాస్త ఆలోచించాల్సిందే?ఎందుకంటే.. ఫ్లాట్లను నిర్మించి అమ్మే బిల్డర్లు ఒకేసారి నాలుగైదు ఇళ్ల నిర్మాణం చేపడుతుంటారు. నిర్మాణాల కోసం తాపీ మేస్త్రీని మాట్లాడుకుని పనులు ప్రారంభిస్తుంటారు. ఏ బిల్డర్ అయినా వ్యాపారంలో నష్టాలు రావాలని కోరుకోరు కదా. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ నిర్మాణాలను చేపట్టడం వల్ల నిర్మాణ వ్యయం కాస్త తగ్గుతుందని భావిస్తుంటారు.

మరోవైపు నిర్మాణాలు సగం పూర్తి కాగానే కస్టమర్లు ఫ్లాట్లను బుక్ చేసుకుని అడ్వాన్స్ లు కూడా చెల్లిస్తుంటారు. వీలైనంత తొందరగా కస్టమర్లకు ఫ్లాట్స్ అందించాలనే ఆలోచనతో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలను పూర్తి చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఖర్చు తగ్గించుకునేందుకు క్వాలిటీ లేని మెటీరియల్ ను ఉపయోగించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టే అవకాశం లేకపోలేదంటున్నారు. లక్షలు ధారపోసి ఇలాంటి ఇళ్లను కొనుగోలు చేస్తే ఆ తర్వాత నాణ్యతాపరమైన లోపాలు బయటపడడంతో బాధపడడం తప్పా చేసేదేమీ ఉండదు. కాబట్టి బిల్డర్లు కట్టిన ఇళ్లకంటే కూడా సొంతంగానే ఇల్లు కట్టుకోవడం ఉత్తమమని నిపుణులు వెల్లడిస్తున్నారు. నాణ్యమైన మెటీరియల్ తో తమకు నచ్చిన డిజైన్ లో సొంతిల్లును దగ్గరుండి నిర్మించుకుంటేనే మంచిదంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి