iDreamPost

‘స్పై’ విషయంలో నిఖిల్ డిజప్పాయింట్ లో ఉన్నాడా..?

  • Author ajaykrishna Published - 04:51 PM, Mon - 3 July 23
  • Author ajaykrishna Published - 04:51 PM, Mon - 3 July 23
‘స్పై’ విషయంలో నిఖిల్ డిజప్పాయింట్ లో ఉన్నాడా..?

గతేడాది ‘కార్తికేయ 2′ మూవీతో పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. ఆ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ వచ్చినప్పటికీ.. సరైన కంటెంట్ తో మళ్లీ పాన్ ఇండియా ప్రయత్నాలు చేయాలని భావించాడు. అందుకే కార్తికేయ 2 తర్వాత వచ్చిన ’18 పేజెస్’ మూవీని కేవలం తెలుగు వరకే పరిమితం చేశారు. అయితే.. కార్తికేయ 2 రేంజ్ లో కాకపోయినా 18 పేజెస్ బాక్సాఫీస్ దగ్గర మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత చేసిన ‘స్పై’ మూవీ మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేశాడు నిఖిల్. సుభాష్ చంద్రబోస్, దేశభక్తి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన స్పై మూవీ.. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

మొదటి రోజు టాక్ కి భిన్నంగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. ఆ తర్వాత పూర్తిగా కలెక్షన్స్ లో ఊపు కోల్పోయింది. ఇండియాకి స్వాతంత్య్రం రావడం వెనుక గాంధీ, నెహ్రూల కంటే బోస్ పాత్రే కీలకమనే కథాంశం ఉండేసరికి మూవీ కనీసం నార్త్ వాళ్లకైనా కనెక్ట్ అవుతుందని భావించారు మేకర్స్. కానీ.. ఊహించని విధంగా స్పై మూవీ.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. వెరసి.. ఈ సినిమా తెలుగు వాళ్లకే సరిగ్గా కనెక్ట్ కాలేదు. ఇంకా నార్త్ ప్రేక్షకులైతే స్పై ని అసలు పట్టించుకున్నట్లే కనిపించడం లేదు. తెలుగేతర భాషల్లో సినిమా నామమాత్రంగా రిలీజ్ అయిందని సమాచారం.

ఇదిలా ఉండగా.. స్పై రిలీజ్ విషయంలో హీరో నిఖిల్ డిజపాయింట్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. కార్తికేయ 2 తెచ్చిన ఫేమ్ ని క్యాష్ చేసుకోవాలని అనుకున్న నిఖిల్ ఆశలు ఆవిరైపోయాయట. ముందు నుండి బజ్ క్రియేట్ చేయలేక.. సరైన ప్రమోషన్స్ లేక అరకొరగా విడుదలైన స్పై.. తెలుగు తప్ప వేరే ఏ భాషలోనూ సరిగ్గా రిలీజ్ కాలేదట. కాంట్రాక్టు ఇష్యూస్ వలన నేషనల్ మల్టీప్లెక్స్ లలో స్పై మూవీ అసలు ప్లే అవ్వలేదని ఇండస్ట్రీ టాక్. ఇక కంటెంట్ డెలివరీ డిలే ఇష్యూస్ వలన 75% యూఎస్ఏ ప్రీమియర్స్ కాన్సల్ అవ్వడం సినిమాకి మైనస్ అయ్యింది. కట్ చేస్తే.. ఫస్ట్ వీకెండ్ పూర్తయినా స్పై ఇంకా కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. అందుకే స్పై విషయంలో నిఖిల్ నిరాశ చెందినట్లు టాక్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి