iDreamPost

IPL 2022 : బెంగుళూరు వర్సెస్ చెన్నై.. ధోని ఈ రికార్డులని సాధిస్తాడా??

IPL 2022 : బెంగుళూరు వర్సెస్ చెన్నై.. ధోని ఈ రికార్డులని సాధిస్తాడా??

 

IPL 2022 లో నేడు మే 4న రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు ఈ మ్యాచ్ ని గెలిచి తీరాలని చూస్తున్నాయి. ఈ సీజన్‌లో ధోని మొన్నటి పూణే మ్యాచ్‌తో జడేజా నుంచి కెప్టెన్సీ తీసుకోగా మొదటి మ్యాచ్‌లోనే విజయం సాధించాడు. దీంతో ఈ మ్యాచ్ కూడా ధోని సారథ్యంలో చెన్నై గెలుస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు. అయితే ఈ మ్యాచ్ ధోనికి చాలా స్పెషల్ కానుంది. ఈ మ్యాచ్‌లో ధోని ముందు పలు రికార్డులు ఉన్నాయి.

 

IPL టోర్నీలో ధోనీకి ఇది 200వ మ్యాచ్‌. ఈ టోర్నీ చరిత్రలో ఒకే జట్టుకు 200 మ్యాచ్‌లు ఆడుతున్న రెండో ప్లేయర్ గా రికార్డు సృష్టించనున్నాడు ధోని. బెంగళూరు తరఫున కోహ్లీ 217 మ్యాచ్‌లు ఆడి మొదటి స్థానంలో ఉన్నాడు. గతంలో చెన్నైని రెండు సంవత్సరాలు బ్యాన్ చేయడం వల్ల ధోనికి ఈ రికార్డ్ మిస్ అయింది.

టీ20 కెప్టెన్‌గా ధోనీకి ఇది 302వ మ్యాచ్‌. టీ20ల్లో ఇప్పటివరకు కెప్టెన్ గా 5994 పరుగులు సాధించాడు ధోనీ. ఒక్క 6 పరుగులు చేస్తే 6వేల పరుగుల మైలురాయిని ఈ మ్యాచ్‌తో అందుకోనున్నాడు. ఈ రికార్డు సాధిస్తే కెప్టెన్‌గా టీ20ల్లో భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు. 6451 పరుగులతో కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక ఈ IPL టోర్నీలో బెంగళూరుపై ధోనీ ఇప్పటివరకు 836 పరుగులు చేశాడు. ఇందులో 46 సిక్స్‌లు కూడా ఉన్నాయి. మరో నాలుగు సిక్స్‌లు కొడితే IPL మెగా టోర్నీలో ఒక జట్టుపై 50 సిక్స్‌లు కొట్టిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు ధోని.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి