iDreamPost

DC vs CSK: ఢిల్లీ vs చెన్నై.. గెలుపెవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

  • Published Mar 30, 2024 | 9:52 PMUpdated Mar 30, 2024 | 9:52 PM

ఈసారి ఐపీఎల్​లో ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మరో వేటకు సిద్ధమైంది. వరుస ఓటములతో డీలాపడ్డ ఢిల్లీ క్యాపిటల్స్​ను ఢీకొట్టనుంది రుతురాజ్ సేన.

ఈసారి ఐపీఎల్​లో ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మరో వేటకు సిద్ధమైంది. వరుస ఓటములతో డీలాపడ్డ ఢిల్లీ క్యాపిటల్స్​ను ఢీకొట్టనుంది రుతురాజ్ సేన.

  • Published Mar 30, 2024 | 9:52 PMUpdated Mar 30, 2024 | 9:52 PM
DC vs CSK: ఢిల్లీ vs చెన్నై.. గెలుపెవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-2024లో సూపర్ ఫామ్​లో ఉంది. ఆ జట్టు ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి అపోజిషన్ టీమ్స్​కు డేంజర్ సిగ్నల్స్ పంపించింది. సీనియర్లు, కుర్రాళ్ల కలయికతో ఉన్న ఆ జట్టు వింటేజ్ సీఎస్​కేను తలపిస్తూ రెచ్చిపోతోంది. అలాంటి రుతురాజ్ సేన ఇప్పుడు ఢిల్లీ క్యాపిటిల్స్​తో మ్యాచ్​కు రెడీ అయింది. ఈ రెండు టీమ్స్ మధ్య రేపు వైజాగ్​లో మ్యాచ్ జరగనుంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడి డీలాపడ్డ డీసీ.. సీఎస్​కేను ఎలా ఎదుర్కొంటుందనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. ఈ నేపథ్యంలో ఇరు టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఢిల్లీ క్యాపిటల్స్

చెన్నైతో సమరానికి సిద్ధమైన ఢిల్లీ జట్టులో బలాల కంటే బలహీనతలే ఎక్కువగా ఉన్నాయి. ఆ టీమ్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్​ మంచి స్టార్ట్ అందించడంలో ఫెయిలవుతున్నారు. వార్నర్ ఫర్వాలేదనిపిస్తున్నా మార్ష్ త్వరగా ఔటై నిరాశపరుస్తున్నాడు. రికీ భుయ్ రెండు మ్యాచుల్లోనూ తుస్సుమన్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్ మంచి స్టార్ట్ అందుకున్నా వాటిని భారీ స్కోర్లుగా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. ఫస్ట్ మ్యాచ్​లో రాణించిన అభిషేక్ పోరెల్ రెండో మ్యాచ్​లో అదే జోరును కొనసాగించలేకపోయాడు. స్టబ్స్ ఫామ్​లోకి రావడం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. బౌలింగ్​లో నార్త్​జే, ముకేశ్ కుమార్ ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటున్నారు. కుల్దీప్ కూడా రన్స్ లీక్ చేస్తుండటం మైనస్​గా మారింది.

చెన్నై సూపర్ కింగ్స్

సీఎస్​కేలో మైనస్​లు తక్కువగా, ప్లస్​లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాజీ కెప్టెన్ ధోని జట్టులో ఉండటం ఆ టీమ్​కు బిగ్ ప్లస్. బ్యాటర్లు రచిన్ రవీంద్ర, శివమ్ దూబె సూపర్ ఫామ్​లో ఉండటం అదనపు బలం. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మంచి టచ్​లో ఉండటం కలిసొచ్చే అంశం. ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్​లోనూ ధోనీకి బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు. దీన్ని బట్టే ఆ టీమ్ బ్యాటింగ్ యూనిట్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్లు రుతురాజ్-రచిన్ మంచి స్టార్ట్స్ ఇస్తూ భారీ స్కోరుకు పునాదులు వేస్తున్నారు. బౌలింగ్​లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ టీమ్​ను లీడ్ చేస్తున్నాడు. అతడికి తోడుగా దీపక్ చాహర్, పత్తిరానా రాణిస్తుండటంతో చెన్నైకి ఎదురు లేకుండా పోయింది.

ప్రిడిక్షన్

రెండు జట్ల బలాబలాలు, ప్రస్తుత ఫామ్​ను బట్టి చూస్తే రేపటి మ్యాచ్​లో చెన్నై గెలుపు నల్లేరు మీద నడకే. ఈ ఇరు జట్ల మధ్య ఇప్పటిదాకా 29 మ్యాచులు జరిగాయి. అందులో 10 మ్యాచుల్లో డీసీ నెగ్గగా.. 19 మ్యాచుల్లో సీఎస్​కే విజయం సాధించింది. రుతురాజ్ సేన ఆడుతున్న తీరు చూస్తుంటే ఆ టీమ్​ను ఆపడం డీసీ వల్ల కాదనే చెప్పాలి.

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

ఢిల్లీ:
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రికీ భుయ్, రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జే, ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్.

చెన్నై:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానె, డారిల్ మిచెల్, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్​పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి