iDreamPost

రుతురాజ్ ఊరికే కెప్టెన్ అయిపోలేదు.. ధోనీ మెచ్చిన 5 కారణాలు!

CSK Captain Ruturaj Gaikwad: ఐపీఎల్ 2024 సీజన్ కి ముందు ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. వాటిని రుతురాజ్ గైక్వాడ్ కి అప్పగించారు. అయితే రుతురాజ్ కే ఎందుకు అంటే ఈ 5 కారణాలు చెప్తున్నారు.

CSK Captain Ruturaj Gaikwad: ఐపీఎల్ 2024 సీజన్ కి ముందు ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. వాటిని రుతురాజ్ గైక్వాడ్ కి అప్పగించారు. అయితే రుతురాజ్ కే ఎందుకు అంటే ఈ 5 కారణాలు చెప్తున్నారు.

రుతురాజ్ ఊరికే కెప్టెన్ అయిపోలేదు.. ధోనీ మెచ్చిన 5 కారణాలు!

ఐపీఎల్ 2024 సీజన్ కచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ముఖ్యంగా ముంబయి, చెన్నై జట్లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవబోతున్నాయి. అందుకు ఆ జట్లకు సీనియర్స్, 5 టైటిల్స్ అందించిన కెప్టెన్స్ కాకుండా కొత్తవాళ్లు పగ్గాలు అందుకోవడమే. హార్దిక్ కెప్టెన్ గా కొత్త కాకపోయినా.. ముంబయికి మాత్రం కొత్త కెప్టెనే. ఇంక రుతురాజ్ గైక్వాడ్ కొత్త కెప్టెన్ చెన్నైని ఎలా నడిపిస్తాడు అనే అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే రుతురాజ్ గైక్వాడ్ ఊరికే కెప్టెన్ అయ్యాడు అనుకుంటే పొరపాటే అవుతుంది. జట్టులో ఎంతోమంది స్టార్స్ ఉన్నా ధోనీ మాత్రం రుతురాజ్ నే ఎందుకు ఎంచుకున్నాడు? అనే ప్రశ్న ఎవరికైనా వచ్చిందా? వస్తే ఆ ప్రశ్నకు 5 కారణాలు చెప్పచ్చు. మరి.. అవేంటో చూడండి.

మొదటి కారణంగా క్రమశిక్షణ అని చెప్పచ్చు. క్రికెట్ కి మరో పేరు ఏంటో అందరికీ తెలుసు. జెంటిల్ మెన్ గేమ్ అంటారు. అంటే ఈ ఆటలో ఎంతో హుందాగా వ్యవహరించాలి. కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి. రుతురాజ్ గైక్వాడ్ ఎంతో డిసిప్లిన్ కలిగిన ఆటగాడు అని ఎవరైనా చెప్పేస్తారు. చెన్నై జట్టులో ఉన్న ప్లేయర్స్ లో రుతురాజ్ గైక్వాడ్ కచ్చితంగా ఒద్దికగా ఉండే ఆటగాడు. అందుకే ధోనీ ఆసక్తి రుతురాజ్ పై పడింది అంటున్నారు. తర్వాత రుతురాజ్ యాటిట్యూడ్ కు మంచి మార్కులు పడతాయి. రుతురాజ్ ఎప్పుడూ కూడా కూల్ గా ఉంటాడు. కెప్టెన్ కూ తరహాలోనే బ్యాటింగ్ లో ప్రెజర్ ఉన్నా కూడా ఎంతో కూల్ గా ఉంటాడు. అది ధోనీని మెప్పించిన మరో కారణంగా చెప్పచ్చు. రుతురాజ్ లో ధోనీ తనని తాను చూసుకున్నాడు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

Ruturaj

ఇంక తర్వాతి కారణం/క్వాలిటీ గురించి చెప్పుకోవాలి అంటే.. రెస్పాన్సిబిలిటీ అని చెప్పచ్చు. జట్టులో అందరూ రెస్పాన్సిబిల్ గానే ఉంటారు. కానీ, రుతురాజ్ మాత్రం సమయానికి తగినట్లు తనకి తానే రెస్పాన్సిబిలిటీ తీసుకుని జట్టును తన బ్యాటింగ్ తో బయట పడేసిన తీరు చాలాసార్లే చూశాం. ఒక జట్టు విజయం సాధించాలి అంటే ఆటగాళ్లు అంతా అలాంటి ఒక బాధ్యత తీసుకోవాలి. అలాంటి విషయంలో రుతురాజ్ ముందు వరుసలో ఉంటాడు. అందుకే ధోనీ మనసు గెలిచేశాడు. ఇంక రుతురాజ్ లో ఉన్న ఇంకో మంచి క్వాలిటీ ఏంటంటే.. అందర్నీ కలుపుకొని పోవడం. జట్టులో అందరూ బాగా ఆడాలి అంటే ఒక మంచి వాతావరణం ఉండాలి.

 

View this post on Instagram

 

A post shared by Chennai Super Kings (@chennaiipl)

జట్టులో అందర్నీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. అలాంటి క్వాలిటీ ముఖ్యంగా కెప్టెన్ కి ఉండాలి. అలాంటప్పుడే ఆటగాళ్లంతా ఒక తాటి మీదకు వస్తారు. అలాంటి లక్షణం రుతురాజ్ గైక్వాడ్ లో పుష్కలంగా ఉంది. అందుకే ధోనీ మనసు గెలిచాడు అనచ్చేమో? అలాగే గేమ్ అవేర్నెస్ కూడా రుతురాజ్ కి ఉన్న మరో ప్రధాన లక్షణం. పరిస్థితులను, గేమ్ ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలడు. ఒక కెప్టెన్ కి ఉండాల్సిన ప్రధాన లక్షణాల్లో అది కూడా ఒకటి. అందుకే రుతురాజ్ కెప్టెన్ కాగలిగాడు. ఇలా ధోనీ ఊరికే కెప్టెన్సీ పగ్గాలు రుతురాజ్ కి ఇవ్వలేదు. ఇలాంటి లక్షణాలు, క్వాలిటీలు రుతురాజ్ కి ఉన్నాయి కాబట్టే ఎల్లో ఆర్మీకి రుతురాజ్ కెప్టెన్ కాగలిగాడు. మరి.. రుతురాజ్ గైక్వాడ్ లో మీకు నచ్చిన క్వాలిటీస్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Chennai Super Kings (@chennaiipl)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి