SNP
Irfan Pathan, Rohit Sharma, Virat Kohli, T20 World Cup2024: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌కి ముందు ఓ భారత మాజీ క్రికెటర్ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. టీమిండియా ఓ ముగ్గురు క్రికెటర్లు హ్యాండిక్యాప్ టీమ్‌లా మార్చేశారని అన్నాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Irfan Pathan, Rohit Sharma, Virat Kohli, T20 World Cup2024: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌కి ముందు ఓ భారత మాజీ క్రికెటర్ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. టీమిండియా ఓ ముగ్గురు క్రికెటర్లు హ్యాండిక్యాప్ టీమ్‌లా మార్చేశారని అన్నాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభమైంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు కూడా ముగిసిపోయాయి. బుధవారం(జూన్ 5) టీమిండియా సైతం ఐర్లాండ్‌తో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌తోనే రోహిత్ సేన వరల్డ్ కప్ వేటను మొదలుపెట్టనుంది. ఇలాంటి కీలక సమయంలో టీమిండియాను ఓ ముగ్గురు క్రికెటర్లు అవిటి(హ్యాండిక్యాప్డ్) జట్టులా మార్చేశారంటూ భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆరోపించాడు. ఆ ముగ్గురు క్రికెటర్లు మరెవరో కాదు.. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్. ఈ ముగ్గురు స్టార్ బ్యాటర్ల కారణంగా టీమిండియా ఒక అవిటి టీమ్‌లా తయారైందని అన్నాడు. ఇంతకీ పఠాన్ అలా ఎందుకు అన్నాడో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..
ఐపీఎల్‌లా.. టీ20 వరల్డ్ కప్‌లో ఇంప్యాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో.. ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు పలువురు మాజీ క్రికెటర్లు తమ తమ సూచనలు చేశారు. జట్టులో బౌలింగ్ బలంగా ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. కేవలం ఐదుగురు క్వాలిటీ బౌలర్లతో బరిలోకి దిగితే దెబ్బతినే ప్రమాదం ఉంటుందని అందుకోసం.. ఆల్‌రౌండర్లు టీమ్‌లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. బౌలింగ్ ఆప్షన్ ఎక్కువగా ఉంటే.. టీమిండియాకు మేలు జరుగుతుందని అంటున్నారు.
అలా అని ఆల్‌రౌండర్లు, బౌలర్లను ఎక్కువగా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంటే.. టీమిండియా బ్యాటింగ్ బలం తగ్గిపోతుందనే భయం కూడా ఉంది. ఇదే విషయంపై ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. గతంలో ఉన్నట్లు.. స్టార్ బ్యాటర్లు అవసరమైన సమయంలో ఒకటీ రెండు ఓవర్లు వేయగలిగితే.. టీమ్ ఎంపికలో ఇంత ఇబ్బంది ఉండేది కాదేని, కానీ ఇప్పుడున్న స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అస్సలు బౌలింగ్ వేయకపోవడంతో పూర్తిగా బౌలర్లపై ఆధారపడుతున్నారని, వారి ఏ ఒక్కరు లయ తప్పి పరుగులు సమర్పించుకుంటున్నా.. బౌలింగ్ మార్చే అవకాశం టీమ్‌లో లేదని, అందుకే ఈ ముగ్గురు టీమ్‌ను హ్యాండిక్యాప్డ్ టీమ్‌గా మార్చారంటూ పఠాన్ పేర్కొన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
rohit sharma virat kohli and suryakumar yadav made india handicapped -irfan pathan #t20worldcup2024 @IrfanPathan pic.twitter.com/o4vEgxbFCy
— Sayyad Nag Pasha (@nag_pasha) June 3, 2024