iDreamPost
android-app
ios-app

పాకిస్థాన్‌ను వణికించిన ఐర్లాండ్‌! టీమిండియాకు డేజంర్‌ బెల్స్‌!

  • Published May 11, 2024 | 1:21 PM Updated Updated May 11, 2024 | 1:21 PM

Ireland vs Pakistan, T20 World Cup 2024: ఐర్లాండ్‌ చేతిలో పాకిస్థాన్‌ ఓడిపోవడంతో భారత క్రికెట్‌ అభిమానుల్లో కొత్త భయం మొదలైంది. అదే జరిగే ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు. మరి వారి భయానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Ireland vs Pakistan, T20 World Cup 2024: ఐర్లాండ్‌ చేతిలో పాకిస్థాన్‌ ఓడిపోవడంతో భారత క్రికెట్‌ అభిమానుల్లో కొత్త భయం మొదలైంది. అదే జరిగే ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు. మరి వారి భయానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published May 11, 2024 | 1:21 PMUpdated May 11, 2024 | 1:21 PM
పాకిస్థాన్‌ను వణికించిన ఐర్లాండ్‌! టీమిండియాకు డేజంర్‌ బెల్స్‌!

ఇండియాలో ఐపీఎల్‌ హవా నడుస్తోంది. మరోవైపు మన శత్రుదేశం పాకిస్థాన్‌, ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడుతోంది. మూడు టీ20ల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓటమి పాలైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో పసికూన జట్టుగా పిలువబడే ఐర్లాండ్‌ చేతిలో పాక్‌ ఓటమి పాలు కావడం సంచలనంగా మారింది. డబ్లిన్ వేదికగా ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది ఐర్లాండ్‌. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ బాబర్ అజమ్‌ 57, సైమ్‌ ఆయూబ్ 45, ఇఫ్తికర్ అహ్మద్ 37(నాటౌట్‌) పరుగులతో రాణించారు.

అనంతరం 183 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఆండ్రీవ్ బల్బర్నీ 77 పరుగులతో రాణించి జట్టుకు విజయాన్ని అందించాడు. హ్యారీ టెక్టర్ 36 రన్తో రాణించాడు. ఇక చివర్లో కాంప్ హెర్(15*), డెలానీ(10*) నాటౌట్ గా నిలిచి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. కాగా, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓటమి పాలుకావడంతో టీమిండియాకు డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయి. అందేంటి.. పాకిస్థాన్‌ ఓడిపోతే.. టీమిండియా ఎందుకు భయం అని అనుకోవచ్చు. కానీ, అక్కడే ఉంది అసలు ట్రిక్కు. అదేంటంటే..

మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్‌, అమెరికా సంయుక్త వేదికగా జూన్‌ 2 నుంచి ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ టోర్నీ కోసం ఇప్పటికే భారత సెలెక్టర్లు 15 మందితో కూడిన స్క్వౌడ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్‌ జట్లు జూన్‌ 9న న్యూయార్క్‌ వేదికగా తలపడనున్నాయి. కానీ, అంతకంటే ముందే జూన్‌ 5న ఇండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఐర్లాండ్‌, ఇప్పుడు పాకిస్థాన్‌ను ఓడించినట్లే.. టీ20 వరల్డ్‌ కప్‌లో ఇండియాను ఓడించి సంచలన సృష్టించవచ్చు. ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయకూడదు. అలా అని టీమిండియా, పాకిస్థాన్‌ అంత చెత్తగా ఆడుతుంది అని కాదు కానీ, తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైతే.. జట్టులో ఆత్మవిశ్వసం దెబ్బతింటుందని క్రికెట్‌ అభిమానులు భయపడుతున్నారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూక్తిని అనుసరించి.. ఐర్లాండ్‌తో మ్యాచ్‌ను లైట్‌ తీసుకోకుండా టీమిండియా వంద శాతం ఎఫర్ట్‌ పెట్టి ఆడాలని భారత క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.