SNP
SNP
పసికూన ఐర్లాండ్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు యువ టీమిండియా ఐరిష్ గడ్డపై అడుగుపెట్టింది. శుక్రవారం భారత్-ఐర్లాండ్ మధ్య డబ్లిన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో టీమిండియాకు బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గతేడాది ఆసియా కప్‌కు ముందు గాయంతో టీమిండియాకు దూరమైన బుమ్రా.. తిరిగి ఇప్పుడే జట్టులోకి వస్తున్నాడు. వెన్నుముక సర్జరీ తర్వాత తొలిసారి టీమిండియా తరఫున మ్యాచ్ ఆడనున్నాడు. ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023కి ముందు ఓ ప్రాక్టీస్ సిరీస్‌గా బుమ్రాకు ఈ ఐర్లాండ్ సిరీస్ ఉపయోగపడనుంది.
అయితే.. బుమ్రా సారథ్యంలోని టీమిండియాలో అంతా యువ క్రికెటర్లే ఉన్నారు. తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, సంజు శాంసన్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, శివమ్ దూబే ఇలా అంత యంగ్ బ్లడ్‌తో టీమిండియా ఫ్రెష్‌గా కనిపిస్తోంది. మరి ఈ యంగ్ టీమిండియాను చూసి.. ఓడించగలమే నమ్మకం వచ్చిందేమో కానీ, ఐర్లాండ్ ఆటగాడు టీమిండియాకు వార్నింగ్ లాంటి ఓ స్టేట్‌మెంట్‌ను ఇచ్చాడు. ఐర్లాండ్ ఆటగాడు బెన్ వైట్ మాట్లాడుతూ.. ‘తమదైన రోజు ఐర్లాండ్ ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించడగలదు. ఇక ఇండియా ప్రపంచంలోనే అత్యుత్తమైన జట్టు. వారితో ఆడటం చాలా పెద్ద విషయం. కానీ, మేము ఈ సవాల్‌ను ఆస్వాదిస్తాం.’ అని అన్నాడు. తమదైన రోజు టీమిండియానే కాదు ఎవరినైనా ఓడిస్తామని, తమను తక్కువ అంచనా వేయొద్దని బెన్ చెప్పకనే చెప్పాడు.
ఇటీవల టీమిండియా.. వన్డే వరల్డ్ కప్‌కు క్వాలిఫై కూడా కాలేకపోయిన వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌ను ఓడిపోవడం కూడా ఐర్లాండ్ ధైర్యానికి కారణంగా చెప్పుకొవచ్చు. మరి బెన్ చెప్పినట్లు టీమిండియాకు ఐర్లాండ్ గట్టి పోటీ ఇచ్చినా.. పోటీ రసవత్తరంగా మారుతుంది. పైగా భారత ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ దొరకుతుంది. కానీ, అతను చెప్పినట్లు ఐర్లాండ్, టీమిండియాను ఓడిస్తే మాత్రం.. అది చరిత్రే అవుతుంది. ఇక మూడు మ్యాచ్‌ల షెడ్యూల్ చూస్తే.. 18న శుక్రవారం తొలి టీ20, 20న రెండో టీ20, 23న మూడో టీ20 జరగనుంది. ఈ మూడు మ్యాచ్‌లు డబ్లిన్ వేదికగానే జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మరి ఐర్లాండ్ క్రికెటర్ బెన్ వైట్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ireland’s Ben White said, “Ireland can beat any team on their day. Playing against India is huge, they’re the best team in the world, but we are relishing the challenge”. (BBC). pic.twitter.com/GfKfdmYERE
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 16, 2023
ఇదీ చదవండి: వరుస సెంచరీలు! కట్ చేస్తే.. టోర్నీ నుంచి ఔట్! పాపం పృథ్వీ షా