iDreamPost

ఒకేరోజు 12 మంది మైనారిటీలను ఉరితీసిన ఇరాన్

ఒకేరోజు 12 మంది మైనారిటీలను ఉరితీసిన ఇరాన్

ఒకేరోజు 12 మంది మైనారిటీలను ఉరితీసింది ఇరాన్ ప్రభుత్వం. ఈ విషయాన్ని ఇరాన్ హ్యూమన్ రైట్స్ అనే నార్వేకి చెందిన హక్కుల సంస్థ వెల్లడించింది. డ్రగ్స్, హత్యా నేరాలపై జైలు శిక్ష అనుభవిస్తున్న 11 మంది పురుషులు, ఒక మహిళను నిర్థాక్షిణ్యంగా ఉరితీసిందని సదరు సంస్థ పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ కు సరిహద్దులకు సమీపంలోని సిస్తాన్–బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఉన్న జహేదాన్ జైలులో ఉరిశిక్షలను అమలు చేసినట్లు తెలిపింది. అయితే ఈ విషయాన్ని ఇరాన్ మీడియా సంస్థలు, అధికారులు అధికారికంగా ప్రకటించలేదని పేర్కొంది.

డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ఆరుగురిని, హత్య కేసుల్లో మరో ఆరుగురిని ఉరి తీసినట్లు ఇరాన్ హ్యూమన్ రైట్స్ అనే నార్వేకి చెందిన హక్కుల సంస్థ తెలిపింది. గార్జిజ్ అనే మహిళను 2019లో తన భర్తను చంపినందుకు అరెస్ట్ చేసి.. ఇప్పుడు ఉరి తీశారని వాపోయింది. ఉరిశిక్ష అమలు చేయబడిన వారంతా మైనారిటీ తెగలకు చెందిన వారు.. అందునా సున్నీ తెగకు చెందిన వారని వివరించింది. మైనారిటీలే టార్గెట్ గా ఇరాన్ మరణశిక్షలు విధిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. 2021లో అమలు చేసిన ఉరి శిక్షల్లో 21 శాతం మంది బాధితులు బలూచ్ లే ఉండగా.. ఇరాన్ ప్రజలు కేవలం 2-6 శాతం మందే ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి