SNP
Mayank Yadav, RCB vs LSG, IPL 2024: ఐపీఎల్‌లో నయా సంచలనంగా మారిన మయాంక్ యాదవ్.. తన వేగంతో అందర్ని భయపెడుతున్నాడు. అయితే.. ఈ స్థాయికి అతను సులువుగా చేరుకోలేదు. దాని వెనుక ఎంతో కష్టం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Mayank Yadav, RCB vs LSG, IPL 2024: ఐపీఎల్‌లో నయా సంచలనంగా మారిన మయాంక్ యాదవ్.. తన వేగంతో అందర్ని భయపెడుతున్నాడు. అయితే.. ఈ స్థాయికి అతను సులువుగా చేరుకోలేదు. దాని వెనుక ఎంతో కష్టం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ప్రస్తుతం ఇండియన్ క్రికెట్‌లోనే కాదు.. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఓ 21 ఏళ్ల కుర్రాడి పేరు మారుమోగిపోతోంది. ఐపీఎల్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ అతనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. ఈ రెండు మ్యాచ్‌లతోనే ఐపీఎల్ చరిత్రనే తిరగరాశాడు మయాంక్ యాదవ్ అనే ఓ స్పీడ్‌స్టర్. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతూ.. మంగళవారం బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గంటకు ఏకంగా 156.7 కిలో మీటర్ల వేగంతో బంతి విసిరి.. చివరి మ్యాచ్‌లో తాను సృష్టించిన రికార్డును తానే బ్రేక్ చేశాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యాదవ్.. గంటకు 155.8 కిలో మీటర్ల బంతి విసిరి.. ఐపీఎల్ 2024 సీజన్‌లోనే ఫాస్టెస్ట్ బౌలర్‌గా నిలిచిచాడు.
ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు తాజాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 14 రన్స్ ఇచ్చి.. 3 కీలక వికెట్లు పడగొట్టి.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ముఖ్యంగా.. ఆర్సీబీ స్టార్ ఆల్‌రౌండర్ కామెరున్ గ్రీన్‌ను మయాంక్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేసిన విధానం మాత్రం మొత్తం టోర్నీకే హైలెట్‌గా నిలిచేలా ఉంది. ఆ బాల్‌ను గ్రీనే కాదు ప్రపంచంలో కొమ్ములు తిరిగిన బ్యాటర్లు కూడా ఆడలేరని చాలా మంది క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. నిప్పులు చిమ్ముకుంటూ వచ్చిన ఆ బాల్.. గ్రీన్ బ్యాట్‌ను ముందుకు తెచ్చేలోపే.. జెడ్‌స్పీడ్‌తో దూసుకెళ్లి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఆ వేగానికి గ్రీన్ ఒక్కడే కాదు.. మొత్తం ఆర్సీబీ ఆటగాళ్లు కళ్లు తేలేశారు.
ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన 8 ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్.. లీగ్ చరిత్రలోనే గంటకు 150 కిలో మీటర్ల వేగంతో అత్యధిక బంతులేసిన బౌలర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. అయితే వేగం ఒక్కటే కాకుండా.. కచ్చితమైన లైన్ అండ్ లెంత్ ఉండటం మయాంక్ యాదవ్‌ను డేంజరస్‌గా మారుస్తోంది. గతంలో ఉమ్రాన్ మాలిక్ కూడా 150కి పైగా వేగంతో బంతులేసినా.. సరైన లైన్ అండ్ లెంత్ లేక ఇబ్బంది పడ్డాడు. కానీ, మయాంక్ యాదవ్‌లో మాత్రం కచ్చితత్వంతో బంతులేస్తూ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.
ప్రస్తుతం టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్‌గా మారిన మయాంక్ యాదవ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే.. ఇతను ఢిల్లీకి చెందిన కుర్రాడు. అక్కడే పుట్టి పెరిగాడు. మయాంక్ వాళ్ల నాన్న ప్రభు చిన్నపాటి వ్యాపారం చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందులోనా.. ఫాస్ట్ బౌలర్లంటే మరీ ఇష్టం. అందుకే తన కొడుకును కూడా ఒక గొప్ప ఫాస్ట్ బౌలర్‌గా చూడాలనుకున్నారు. అందుకోసం ప్రభు ఎంతో కష్టపడ్డాడు. టీవీలో డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్, మిచెల్ జాన్సన్ లాంటి ఫాస్ట్ బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తున్నారో చూడు అంటూ మయాంక్ యాదవ్‌కు చూపించేవాడు ప్రభు. దాంతో.. స్పీడ్ బౌలింగ్‌పై మయాంక్ యాదవ్ కూడా మక్కువ పెంచుకున్నాడు. అక్కడి నుంచి క్రికెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టిన యాదవ్‌ను 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతన్ని సోనెట్ క్లబ్‌లో చేర్పించాలని ప్రభు విశ్వప్రయత్నాలు చేశాడు. సోనెట్ క్లబ్‌లో చేర్పించడానికి ఆడిషన్స్ కోసం ఆయన ఏడాది పాటు కష్టపడాల్సి వచ్చింది. నెట్స్‌లో బౌలింగ్ వేసి, కోచ్ తారక్ సిన్హాను మెప్పించడంతో మయాంక్‌కు సోనెట్ క్లబ్‌లో చేరే ఛాన్స్ వచ్చింది. ఆ సమయంలో మయాంక్ యాదవ్ వద్ద కనీసం మంచి షూ కూడా ఉండేవి కావు. క్లబ్ తరఫునే అతనికి మంచి షూ అందించారు.
దశ తిరిగిపోయింది ఇక్కడే..
2021లో దేశవాళి టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో యూపీ, ఢిల్లీ టీమ్స్ పక్కపక్కనే ప్రాక్టీస్ చేశాయి. ఆ సమయంలో అప్పటి యూపీ కోచ్ విజయ దహియా.. మయాంక్ బౌలింగ్‌ను చూసి ఫిదా అయిపోయాడు. ఇలాంటి బౌలర్ లక్నో టీమ్‌లో ఉంటే బాగుంటుందని వెంటనే.. అప్పటి లక్కో టీమ్ మెంటర్ గౌతమ్ గంభీర్‌కు కాల్ చేసి చెప్పేశాడు. దాంతో 2022 ఐపీఎల్ వేలంలో మయాంక్ యాదవ్‌ను బేస్‌ప్రైజ్ రూ.20 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. కానీ, ఆ సీజన్‌లో అతనికి ఆడే అవకాశం రాలేదు. అలాగే ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడే ఛాన్స్ వచ్చినా.. సరిగ్గా మ్యాచ్‌కి ఒక రోజు ముందు ప్రాక్టీస్ చేస్తూ.. సరైన షూ లేకపోవడంతో తడిపిచ్‌పై జారిపడి గాయపడ్డాడు. అలాగే గత సీజన్‌లో బరిలోకి దిగే అవకాశం కోల్పోయాడు.
ఇలా కాదని.. ప్రత్యేకంగా ఆస్ట్రేలియా నుంచి తనకు సరిపడా, మంచి గ్రిప్ ఉన్న షూస్ తెప్పించుకుని.. ఈ ఐపీఎల్ సీజన్‌లో అరంగేట్రం చేసి.. తన సత్తా చాటుతున్నాడు. ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫాస్ట్ బౌలర్‌గా ఎదగాలనే కసి, తపన, ఆకలితో ఈ స్థాయికి చేరుకున్న మయాంక్ యాదవ్.. దేశానికి ఆడటమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. అది కూడా త్వరలోనే తీరిపోయే ఛాన్స్ ఉంది. ఇదే ఫామ్‌ను కంటీన్యూ చేస్తూ.. జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తరఫున మయాంక్ యాదవ్ ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఒక వైపు బుమ్రా, మరోవైపు మయాంక్ యాదవ్ బంతులు సంధిస్తుంటే.. బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. మరి మయాంక్ యాదవ్ ఇప్పటి వరకు చేసిన లైఫ్ జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
What a Pace 156.7kph#MayankYadav
pic.twitter.com/Z6YtUW9lLh— Rishavh Yadav (@rishavhyadavji) April 3, 2024