iDreamPost

IPL 2024: టీమిండియా ప్లేయర్ల మధ్య చిచ్చుపెడుతున్న IPL! ఇలా అయితే కష్టమే..

  • Author Soma Sekhar Updated - 07:13 PM, Fri - 1 December 23

ఐపీఎల్ సీజన్ 2024 స్టార్ట్ కాకముందే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. మరీ ముఖ్యంగా టీమిండియా ప్లేయర్ల మధ్యలో చిచ్చుపెడుతోందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఐపీఎల్ సీజన్ 2024 స్టార్ట్ కాకముందే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. మరీ ముఖ్యంగా టీమిండియా ప్లేయర్ల మధ్యలో చిచ్చుపెడుతోందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

  • Author Soma Sekhar Updated - 07:13 PM, Fri - 1 December 23
IPL 2024: టీమిండియా ప్లేయర్ల మధ్య చిచ్చుపెడుతున్న IPL! ఇలా అయితే కష్టమే..

క్యాష్ రిచ్ లీగ్ గా ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలు పొందుతున్న మెగాటోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL). 16 ఎడిషన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని మరికొన్ని నెలల్లో 17వ సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. అయితే ఐపీఎల్ సీజన్ 2024 స్టార్ట్ కాకముందే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. మరీ ముఖ్యంగా టీమిండియా ప్లేయర్ల మధ్యలో చిచ్చుపెడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే.. టీమిండియా భవిష్యత్ ఆగమ్యగోచరంగా తయ్యారు అవ్వడం ఖాయమంటున్నారు క్రీడా పండితులు. దీనికి ఉదాహరణగా పాండ్యా-బుమ్రాల అంశాన్ని ఎత్తిచూపుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే.. భారత క్రికెట్ కు కష్టాలు తప్పేలా లేవు.

ఐపీఎల్ ప్రభావం టీమిండియా క్రికెట్ పై తీవ్రంగా పడుతోందని, అందుకే భారత జట్టు మెగాటోర్నీలను సాధించలేకపోతోందని అభిమానులు ఎప్పటి నుంచో మెుత్తుకుంటున్నారు. అయితే ఈ టోర్నీ ద్వారా ఎంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. ఇది మంచి విషయమే అయినప్పటికీ.. ఒక విధంగా ఐపీఎల్ టీమిండియాను ముంచేస్తోందని ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఇకా తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే.. భారత జట్టుకు కష్టాలు తప్పేలా లేవు. హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ క్యాష్ ఆన్ డీల్ లో భాగంగా కొనుగోలు చేసింది. ఇప్పుడు ఇదే విషయం భారత క్రికెట్ ను కాకావికలం చేస్తోంది. పాండ్యా ముంబైలోకి రావడంతో.. బుమ్రా అలిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకే షాకింగ్ పోస్టులు పెడుతున్నాడని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు.

కాగా.. రోహిత్ శర్మ తర్వాత ముంబై కెప్టెన్ ఎవరనే ప్రశ్నకు గతంలో బుమ్రా పేరే వినిపించింది. కానీ అనూహ్యంగా పాండ్యా ఎంట్రీ ఇవ్వడంతో కథ మెుత్తం అడ్డం తిరిగింది. ఈ కాంట్రవర్సీ కారణంగా టీమిండియాలో ఆటగాళ్ల మధ్య బాండింగ్ దెబ్బ తింటుందని, ఇది జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని క్రీడా పండితులు ఆరోపిస్తున్నారు. త్వరలోనే టీ20 వరల్డ్ కప్ ఉండటం.. ఇలాంటి సమయంలో జట్టులో వాతావరణం వివాదాలకు దారితీసే విధంగా ఉండటం.. టీమిండియాకు ఆందోళన కలిగించే అంశం. జట్టులో విభేదాలు ఇలాగే కొనసాగితే.. ప్లేయర్ల మధ్య ఉన్న అనుబంధం దెబ్బతిని అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్ గా తీసుకోకపోతే భవిష్యత్ లో భారీ మూల్యం చెల్లించుకోకతప్పదంటూ టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి టీమిండియా ప్లేయర్ల మధ్య IPL చిచ్చు పెడుతోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి