iDreamPost
android-app
ios-app

రూ. 5 కోట్లు దండగ అన్నారు.. కానీ నేడు హీరో అయ్యాడు! యశ్ దయాళ్ తండ్రి ఎమోషనల్..

  • Published May 20, 2024 | 4:40 PM Updated Updated May 20, 2024 | 4:40 PM

చెన్నైతో ఇటీవల ముగిసిన మ్యాచ్ లో తన కొడుకు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు ఆర్సీబీ స్టార్ బౌలర్ యశ్ దయాళ్ తండ్రి. ఈ క్రమంలోనే భావోద్వేగానికి గురైయ్యాడు.

చెన్నైతో ఇటీవల ముగిసిన మ్యాచ్ లో తన కొడుకు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు ఆర్సీబీ స్టార్ బౌలర్ యశ్ దయాళ్ తండ్రి. ఈ క్రమంలోనే భావోద్వేగానికి గురైయ్యాడు.

రూ. 5 కోట్లు దండగ అన్నారు.. కానీ నేడు హీరో అయ్యాడు! యశ్ దయాళ్ తండ్రి ఎమోషనల్..

ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరడంలో ఆ జట్టు స్టార్ బౌలర్ యశ్ దయాళ్ కీలక పాత్ర పోషించాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి 42 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అదేంటి ఇన్ని పరుగులు ఇచ్చిన ప్లేయర్ ను విజయంలో కీలక పాత్ర పోషించాడు అంటున్నారని ఆలోచిస్తున్నారా? అతడు ఎన్ని పరుగులు ఇచ్చాడు అన్నది ముఖ్యం కాదు.. ఎలాంటి పరిస్థితుల్లో పుంజుకుని టీమ్ కు విజయాన్ని అందించాడు అన్నది ముఖ్యం. ఈ మ్యాచ్ లో ఇదే పని చేశాడు దయాళ్. దాంతో అతడి తండ్రి భావోద్వేగానికి గురైయ్యాడు. తన కొడుక్కి ఆర్సీబీ 5 పెట్టడం దండగ అని చాలా మంది అన్నారు.. కానీ నేడు హీరో అయ్యాడు అంటూ ఎమోషనల్ అయ్యాడు.

చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో సంచలన బౌలింగ్ తో ఆర్సీబీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాడు యశ్ దయాళ్. చివరి ఓవర్లో మహేంద్రసింగ్ ధోని లాంటి బ్యాటర్ ను అడ్డుకుని 17 రన్స్ ను డిఫెన్స్ చేసిన తీరు అద్భుతం. తొలి బంతికే ధోని సిక్సర్ బాదినా.. బెదరకుండా బౌలింగ్ చేసి అతడిని ఔట్ చేశాడు యశ్. దాంతో ఆర్సీబీకి చిరస్మరణీయ విజయం దక్కింది. ఇక ఈ విజయం తర్వాత యశ్ దయాళ్ తండ్రి చంద్రపాల్ భావోద్వేగానికి గురైయ్యాడు.

“నా కొడుకుని ఆర్సీబీ రూ. 5 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు చాలా మంది అన్ని డబ్బులు దండగ అని ఎగతాళి చేశారు. ఇక నేనున్న ఒక వాట్సాప్ గ్రూప్ లో నా బిడ్డ ఇచ్చిన 5 సిక్సులను ప్రస్తావిస్తూ ఒక మీమ్ షేర్ చేశారు. దాంతో నేను ఆ గ్రూప్ నుంచి బయటకి వచ్చేశాను. ఈ విమర్శల నేపథ్యంలోనే నేను మా ఫ్యామిలీ గ్రూప్ ఒక్కదానిలో మాత్రమే ఉన్నాను. కానీ ఇప్పుడు నా కొడుకు ప్రదర్శనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఒక తండ్రిగా ఇది నాకెంతో గౌరవం. అప్పుడు విమర్శించిన వారి నోళ్లు ఇప్పుడు మూతపడ్డాయి” అంటూ ఎమోషనల్ అయ్యాడు.

కాగా.. గత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిథ్యం వహించిన యశ్ దయాళ్.. కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ కొట్టిన 5 సిక్సులతో మానసికంగా గాయపడ్డాడు. మానసిక వేదనలో కొన్ని రోజులు ఆటకు కూడా దూరమైయ్యాడు. ఇక యశ్ దయాళ్ ను గుజరాత్ వదిలేయడంతో.. వేలంలో ఆర్సీబీ రూ. 5 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో అందరూ షాకైయ్యారు. 5 కోట్లు దండగా అంటూ విమర్శించారు. కానీ తనపై ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా రాణించాడు. ఈ సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడి 15 వికెట్లు తీశాడు. ఆర్సీబీ సాధించిన విజయంతో తమపై వచ్చిన విమర్శలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు దయాళ్ తండ్రి.