Nidhan
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు చెబితేనే మహా మహా బౌలర్లు కూడా పోసుకుంటారు. అలాంటిది కింగ్ ఓ బౌలర్‌ను చూసి భయపడ్డాడట. మరి.. విరాట్‌ను భయపెట్టినోడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు చెబితేనే మహా మహా బౌలర్లు కూడా పోసుకుంటారు. అలాంటిది కింగ్ ఓ బౌలర్‌ను చూసి భయపడ్డాడట. మరి.. విరాట్‌ను భయపెట్టినోడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు సక్సెస్ బాట పట్టింది. వరుసగా ఆరు ఓటముల తర్వాత అభిమానులకు ఊరటను ఇస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా గురువారం ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ సేననే గెలుపు వరించింది. 35 పరుగుల తేడాతో నెగ్గిన ఆర్సీబీ.. ఇప్పుడు మంచి జోష్‌లో ఉంది. ప్లేఆఫ్స్ ఆశలు ఎలాగూ లేవు. కానీ గ్రూప్ దశ ముగిసేసరికి టాప్ టీమ్స్ అందరికీ షాక్ ఇవ్వాలని బెంగళూరు గట్టిగా డిసైడ్ అయ్యింది. తమను దారుణంగా ఓడించిన జట్లను చిత్తు చేసి వారి ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బ తీయాలని చూస్తోంది. ఆ టీమ్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ ఫ్యాన్స్‌ను మరింత ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నాడు.
ఎస్ఆర్హెచ్పై నెగ్గిన ఆర్సీబీ.. తదుపరి గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఆ టీమ్ అహ్మదాబాద్‌కు చేరుకుంది. ఈ తరుణంలో కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ బౌలర్‌ను చూసి భయం వేసిందన్నాడు. కోహ్లీ పేరు చెబితేనే మహా మహా బౌలర్లు కూడా పోసుకుంటారు. దశాబ్దంన్నరగా ఇంటర్నేషనల్ క్రికెట్లోని తోపు బౌలర్లు అందర్నీ వణికిస్తూ వస్తున్నాడు విరాట్. పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థి జట్ల పాలిట సింహస్వప్నంలా మారాడు. అతడి బాదుడుకు కొందరు క్రికెటర్ల కెరీర్లే ఖతం అయ్యాయి. కోహ్లీకి బౌలింగ్ చేయాలంటేనే స్టార్లు కూడా భయపడతారు. ఎక్కడ తమ మీద విరుచుకుపడతాడోనని వణుకుతూనే బౌలింగ్‌కు దిగుతారు. అలాంటిది కింగ్ ఓ బౌలర్‌ను చూసి భయపడ్డాడట. మరి.. విరాట్‌ను భయపెట్టినోడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
కెరీర్ మొదట్లో ఓ బౌలర్‌ను చూసి భయపడ్డానని కోహ్లీ తెలిపాడు. అతడ్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక చిన్ననాటి కోచ్‌ను కాంటాక్ట్ అయ్యానని అన్నాడు. ఆయన ఇచ్చిన సలహాతోనే ఆ బౌలర్‌ను ఫేస్ చేశానని కోహ్లీ చెప్పాడు. తన కెరీర్ స్టార్టింగ్ డేస్‌లో శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్ టాప్ ఫామ్‌లో ఉన్నాడని పేర్కొన్నాడు. ‘నా కెరీర్ మొదట్లో అజంతా మెండిస్ అంటే బిగ్ సెన్సేషన్. ఆ సమయంలో అతడ్ని ఎదుర్కోలేక టాప్ బ్యాటర్స్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో నా చిన్ననాటి కోచ్‌తో మాట్లాడా. ఆయన ఒకటే సలహా ఇచ్చారు. మెండిస్ చేతి మణికట్టును గమనించమని చెప్పారు. అలా మెండిస్ మణికట్టును చూస్తూ అతడి వేరియేషన్స్‌ను అర్థం చేసుకున్నా. 2 ఓవర్లలోనే అతడి బౌలింగ్ కిటుకు అర్థమవడంతో కుమ్మేశా’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
Virat Kohli said – “In start of my career, Ajantha Mendis was big sensation that time and every Top batters struggles against him. I spoke to my childhood coach & he said just watch his wrist & I understand his every variation in just 2 overs and then I played him really well”. pic.twitter.com/YTaBivsR1x
— Tanuj Singh (@ImTanujSingh) April 27, 2024