iDreamPost
android-app
ios-app

గంభీర్​తో గొడవ సద్దుమణగడం వాళ్లకు నచ్చలేదు.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Published Apr 11, 2024 | 4:04 PM Updated Updated Apr 11, 2024 | 4:04 PM

కోహ్లీ-గంభీర్​కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉందనేది తెలిసిందే. అయితే ఈ మధ్యే వీళ్లు కలసిపోయారు. దీనిపై విరాట్ రియాక్ట్ అయ్యాడు.

కోహ్లీ-గంభీర్​కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉందనేది తెలిసిందే. అయితే ఈ మధ్యే వీళ్లు కలసిపోయారు. దీనిపై విరాట్ రియాక్ట్ అయ్యాడు.

  • Published Apr 11, 2024 | 4:04 PMUpdated Apr 11, 2024 | 4:04 PM
గంభీర్​తో గొడవ సద్దుమణగడం వాళ్లకు నచ్చలేదు.. కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

క్రికెట్ ఫీల్డ్​లో ఫైట్స్ కామనే. మైదానంలో ఆడేందుకు దిగిన ఇరు జట్లలోని ఆటగాళ్లకు మధ్య ఏదో ఒక సందర్భంలో గొడవలు జరగడం సర్వసాధారణం. అయితే చాన్నాళ్ల పాటు ఒకే టీమ్​కు ప్రాతినిధ్యం వహించిన వారు కూడా కొన్ని కారణాల వల్ల శత్రువులుగా మారడం చూస్తూనే ఉంటాం. ఇలాంటోళ్లు వేర్వేరు టీమ్స్​కు ఆడుతూ తలపడితే ఫైట్ జరగడం పక్కా. అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్​లో గౌతం గంభీర్-విరాట్ కోహ్లీది ఒకటి. వీళ్లిద్దరూ టీమిండియాకు కలసే ఆడారు. డొమెస్టిక్ లెవల్​లోనూ ఒకే జట్టు (ఢిల్లీ)కు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఐపీఎల్​లో వీళ్ల మధ్య ఫైట్ జరగడం తెలిసిందే. గతేడాది లక్నో సూపర్ జియాంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ముగిశాక కోహ్లీ-గౌతీ ఒకరి మీదకు ఒకరు దూసుకొస్తూ గొడవకు దిగారు. అప్పట్లో ఇది హాట్ టాపిక్​గా మారింది. అయితే రీసెంట్​గా వీళ్లిద్దరూ కలసిపోయారు.

ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీ, కేకేఆర్​కు మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత కోహ్లీ-గంభీర్​లు కలుసుకున్నారు. ఒకరికొకరు హగ్ చేసుకొని నవ్వుతూ కాసేపు ముచ్చటించారు. తమ మధ్య ఫైట్​ను పక్కనపెట్టి సరదాగా మాట్లాడుకున్నారు. ఇద్దరి మధ్య నవ్వులు, కౌగిలించుకోవడం చూసి వీళ్ల ఫ్యాన్స్ కూడా సంతోషించారు. తాజాగా ఈ విషయంపై విరాట్ రియాక్ట్ అయ్యాడు. గంభీర్​, తాను కలసిపోవడం కొంతమందికి నచ్చలేదన్నాడు. గొడవకు స్వస్తి చెప్పి కలసిపోవడంతో చాలా మంది మసాలా మిస్సవుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు కింగ్. ‘కొందరు నా బిహేవియర్​తో చాలా నిరాశకు లోనయ్యారు. నవీనుల్ హక్​తో పాటు గంభీర్​ భాయ్​ను నేను హగ్ చేసుకున్నా. దీంతో తమకు కావాల్సిన మసాలా మిస్సయిందని వాళ్లు డిజప్పాయింట్ అయ్యారు’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

గత ఏడాది ఐపీఎల్​లో తొలుత మ్యాంగోమ్యాన్ నవీన్​తో గొడవకు దిగాడు విరాట్. దీంతో నవీన్ ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో టీమ్​కు మెంటార్​గా ఉన్న గంభీర్ ఇందులో కలుగజేసుకున్నాడు. గౌతీ రాకతో విరాట్ ఇంకా సీరియస్ అయ్యాడు. కేఎల్ రాహుల్​తో పాటు ఇతర ఆటగాళ్లు మధ్యలో వచ్చి విడిపించడంతో గొడవ ఆగిపోయింది. అయినా ఆ సీజన్ మొత్తం గంభీర్, నవీన్​ను టార్గెట్ చేసుకొని కోహ్లీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్-2023లో మ్యాంగోమ్యాన్​ను కింగ్ క్షమించాడు. అతడ్ని హగ్ చేసుకున్నాడు. తాజాగా కేకేఆర్​తో మ్యాచ్ తర్వాత గంభీర్​ను కౌగిలించుకొని ఈ వివాదానికి ఎండ్ కార్డ్ వేశాడు. అయితే కొందరు మాత్రం తమ గొడవ సద్దుమణిగినందుకు బాధపడుతున్నారని.. మసలా మిస్సయినందుకు నిరాశకు లోనవుతున్నారంటూ చురకలు అంటించాడు కింగ్. మరి.. గంభీర్ వివాదంపై కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.