iDreamPost
android-app
ios-app

Sanju Samson: కేరళలో సంజూ శాంసన్ క్రేజ్.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోతారు!

  • Published May 15, 2024 | 3:41 PM Updated Updated May 15, 2024 | 3:41 PM

టీమిండియా స్టార్ క్రికెటర్, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కు కేరళలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా శాంసన్ క్రేజ్ ను తెలియజేసే వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

టీమిండియా స్టార్ క్రికెటర్, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కు కేరళలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా శాంసన్ క్రేజ్ ను తెలియజేసే వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

Sanju Samson: కేరళలో సంజూ శాంసన్ క్రేజ్.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోతారు!

ఇండియాలో క్రికెట్ అంటే పడి చచ్చిపోతారు యువత. ఎక్కడ మ్యాచ్ జరిగితే అక్కడ వాలిపోయి, తమ అభిమాన ఆటగాళ్ల ఆటను దగ్గర నుంచి చూసి మురిసిపోతుంటారు. ఇక వారిని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఓ సెల్ఫి దిగితే జీవితానికి ఇంతకంటే ఏం కావాలనుకుంటారు. అలాగే తమ అభిమాన ప్లేయర్ పై ఎంత ప్రేమ ఉందో తెలియజేయడానికి ఫ్యాన్స్ పడే కష్టం అంతా ఇంతా కాదు. తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ పై తనకు ఉన్న ప్రేమను ఆర్ట్ ద్వారా తెలియజేశాడు ఓ అభిమాని. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంజూ శాంసన్.. టీమిండియాలోకి వస్తూ.. పోతూ.. అదృష్టం లేని క్రికెటర్ గా పేరొందాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో దుమ్మురేపే ప్రదర్శనతో అకట్టుకుంటున్నాడు. ఇటు బ్యాటింగ్, అటు కెప్టెన్ గా రాణిస్తూ.. రాజస్తాన్ రాయల్స్ ను ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. ఇక ఈ సీజన్ లో అతడు చూపెట్టిన ఆటతో మరికొన్ని రోజుల్లో ప్రారంభం అయ్యే టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపికైయ్యాడు. ఈ క్రమంలోనే ఓ ఆర్టిస్ట్ తనకు సంజూ శాంసన్ పై ఉన్న ప్రేమను ఆర్ట్ ద్వారా తెలిజేశాడు.

కేరళలోని సుజిత్ అనే ఆర్టిస్ట్ తన ఇంటి డాబాపై పెయింట్ తో ఎంతో కష్టపడి సంజూ శాంసన్ చిత్రాన్ని అద్భుతంగా వేశాడు. రాజస్తాన్ రాయల్స్ జెర్సీలో శాంసన్ ఫొటో అదిరిపోయింది. ఆ తర్వాత డ్రోన్ కెమెరాతో ఆ విజువల్స్ ను చిత్రీకరించిన, ఆ ఫొటోకు మరింత అందం తెచ్చాడు. సంజూపై తనకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నాడు. ఈ పిక్ చూసి.. శాంసన్ సైతం అతడికి రిప్లై ఇచ్చాడు. అయితే సుజిత్ కు ఇలా పెయింటింగ్ వేయడం హాబీ. ఇంతకు ముందు కూడా చాలా మంది ప్రముఖుల చిత్రాలను డాబాపై చిత్రించాడు. కాగా.. శాంసన్ కు కేరళలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో అతడిని జట్టులోకి తీసుకోవాలని ధర్నాలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetbetvolePradabet güncel girişjojobetpokerklasJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet