iDreamPost

హైదరాబాద్ vs ముంబై! ఈ మూడు జరిగితే SRH దే విజయం

  • Published Mar 26, 2024 | 6:55 PMUpdated Mar 27, 2024 | 4:06 PM

ఐపీఎల్-2024లో మరో ఇంట్రెస్టింగ్​ మ్యాచ్​కు అంతా రెడీ అయింది. సొంతగడ్డపై తొలి మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​ను ఢీకొట్టనుంది సన్​రైజర్స్ హైదరాబాద్.

ఐపీఎల్-2024లో మరో ఇంట్రెస్టింగ్​ మ్యాచ్​కు అంతా రెడీ అయింది. సొంతగడ్డపై తొలి మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​ను ఢీకొట్టనుంది సన్​రైజర్స్ హైదరాబాద్.

  • Published Mar 26, 2024 | 6:55 PMUpdated Mar 27, 2024 | 4:06 PM
హైదరాబాద్ vs ముంబై! ఈ మూడు జరిగితే SRH దే విజయం

ఐపీఎల్-2024 ఇంట్రెస్టింగ్​గా సాగుతోంది. చాలా వరకు మ్యాచ్​లు లాస్ట్ ఓవర్ దాకా వెళ్తుండటంతో హైటెన్షన్ క్రియేట్ అవుతోంది. ఉత్కంఠ భరించలేక ప్రేక్షకులు మునివేళ్లపై నిల్చొని మ్యాచులు చూడాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో మరో ఆసక్తికర సమరానికి సర్వం సిద్ధమైంది. ఆడిన ఫస్ట్ మ్యాచ్​లో ఓడిన సన్​రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. సీజన్​లో బోణీ కొట్టాలని చూస్తున్న ఇరు టీమ్స్ మధ్య మ్యాచ్ కావడంతో అందరూ దీనిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఉప్పల్ గ్రౌండ్​లో బుధవారం జరగనున్న ఈ మ్యాచ్​లో టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయి? ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

సన్​రైజర్స్ హైదరాబాద్

ఈ సీజన్​లో తొలి విజయాన్ని రుచి చూడాలని సన్​రైజర్స్ ఎదురు చూస్తోంది. కోల్​కతా నైట్ రైడర్స్​తో జరిగిన తొలి మ్యాచ్​లో గెలుపు అంచుల దాకా వచ్చి ఓటమిపాలైంది ఎస్​ఆర్​హెచ్. బ్యాటింగ్​లో హెన్రిచ్ క్లాసెన్ టాప్ ఫామ్​లో ఉండటం.. అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్ కూడా మంచి టచ్​లో ఉండటం టీమ్​కు అతిపెద్ద బలంగా చెప్పొచ్చు. ఫస్ట్ మ్యాచ్​లో ఫర్వాలేదనిపించిన మార్క్​రమ్, త్రిపాఠీ, సమద్ కూడా చెలరేగితే సన్​రైజర్స్​కు తిరుగుండదు. తొలి మ్యాచ్​లో మయాంక్-అభిషేక్ జోడీ ఫస్ట్ వికెట్​కు 60 పరుగులు జోడించారు. కాబట్టి ఓపెనర్లతో పాటు మిగిలిన బ్యాటర్లు కూడా జోరు మీద ఉండటం టీమ్​కు కలిసొచ్చే అంశం. బౌలింగ్​లో నటరాజన్, ప్యాట్ కమిన్స్ తొలి మ్యాచ్​లో ఆకట్టుకున్నారు. మయాంక్ మార్కండే ఎక్కువ రన్స్ ఇచ్చుకున్నా కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, మార్కో యాన్సెన్ ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం, వికెట్లు కూడా తీయకపోవడం టీమ్​కు అతి పెద్ద మైనస్​గా మారింది.

ముంబై ఇండియన్స్

ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, బ్రేవిస్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా రూపంలో స్టార్ బ్యాటర్లు ముంబై టీమ్​లో ఉన్నారు. ఎంతో ఎక్స్​పీరియెన్స్ ఉన్న హిట్​మ్యాన్ జట్టులో ఉండటం ఆ టీమ్​కు అతిపెద్ద బలం. అయితే ఫస్ట్ మ్యాచ్​లో రోహిత్, బ్రేవిస్ తప్ప ఎవరూ రాణించలేదు. బౌలింగ్​లో జస్​ప్రీత్ బుమ్రా, కొయెట్జీ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. వీళ్లిద్దరూ గుజరాత్​తో మ్యాచ్​లో రాణించారు. బుమ్రా 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అతడు సూపర్ ఫామ్​లో ఉండటం ముంబైకి బిగ్ ప్లస్. అయితే ఆ టీమ్​కు అతిపెద్ద బలహీనతగా కొత్త కెప్టెన్ హార్దక్ పాండ్యాను చెప్పొచ్చు. తొలి మ్యాచ్​లో బ్యాటర్​గా, బౌలర్​గా, కెప్టెన్​గా పాండ్యా ఫెయిలయ్యాడు. ఈజీగా నెగ్గాల్సిన మ్యాచ్​లో ముంబై ఓటమికి అతడు తీసుకున్న చెత్త నిర్ణయాలే కారణమని మాజీ క్రికెటర్లు కూడా విమర్శిస్తున్నారు. హార్దిక్ తీరు మార్చుకోకపోతే ఆ జట్టుకు మరింత నష్టం తప్పేలా లేదు.

ప్రిడిక్షన్

రెండు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్ విక్టరీ కొట్టే అవకాశం ఉంది. అయితే.. ఎస్‌ఆర్‌హెచ్‌ గెలవాలంటే.. ముంబై ఓపెనర్‌ రోహిత్‌ శర్మను త్వరగా అవుట్‌ చేయాలి. అలాగే ఎస్‌ఆర్‌హెచ్‌ టాప్‌ ఆర్డర్‌ రాణించాలి. క్లాసెన్‌పైనే ఎక్కువగా ఆధారపడకూడదు. ఇక బౌలింగ్‌ కూడా తమ స్థాయిమేర రాణిస్తే.. సన్‌రైజర్స్‌కు విజయం దక్కొచ్చు.  ఇప్పటిదాకా ఈ రెండు టీమ్స్ మధ్య 21 మ్యాచులు జరిగాయి. అందులో 9 మ్యాచుల్లో ఎస్​ఆర్​హెచ్​.. 12 మ్యాచుల్లో ముంబై విజయం సాధించాయి. అయితే సన్​రైజర్స్ బ్యాటింగ్ యూనిట్ ఫస్ట్ మ్యాచ్​లో ఆడిన తీరు, హోమ్ గ్రౌండ్​లో మ్యాచ్ జరగనుండటం, లోకల్ ఆడియెన్స్ సపోర్ట్, కొత్త కెప్టెన్ కమిన్స్​ టీమ్​ను నడిపిస్తున్న తీరును బట్టి ఎస్​ఆర్​హెచ్​ బోణీ కొట్టడం ఖాయం. అదే టైమ్​లో ముంబై టీమ్​లో సారథి హార్దిక్ పెద్ద వీక్​నెస్​గా మారడం, జట్టులోని ఆటగాళ్ల మధ్య లుకలుకలు.. ఇవన్నీ కలసి ఎస్ఆర్​హెచ్​కు బిగ్ ప్లస్ అవ్వడం పక్కాగా కనిపిస్తోంది.

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

సన్​రైజర్స్ హైదరాబాద్:
అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠీ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి. నటరాజన్.

ముంబై ఇండియన్స్:
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రేవిస్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, నమన్ ధీర్, పీయుష్ చావ్లా, గెరాల్డ్ కొయెట్జీ, జస్​ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్.

ఇదీ చదవండి: IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్.. 32 ఏళ్లలో తొలిసారి ఇలా..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి