Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ఐపీఎల్-2024 ఫైనల్స్‌కు చేరుకుంది కోల్‌కతా నైట్ రైడర్స్. అయితే తుది పోరుకు అర్హత సాధించినా సంతోషంగా లేనని అంటున్నాడు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. దానికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ఐపీఎల్-2024 ఫైనల్స్‌కు చేరుకుంది కోల్‌కతా నైట్ రైడర్స్. అయితే తుది పోరుకు అర్హత సాధించినా సంతోషంగా లేనని అంటున్నాడు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. దానికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
Nidhan
ఐపీఎల్-2024 గ్రూప్ స్టేజ్‌లో హవా నడిపించిన కోల్‌కతా నైట్ రైడర్స్.. అదే జోరును ప్లేఆఫ్స్‌లోనూ కంటిన్యూ చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్స్-1లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ గెలుపుతో నేరుగా ఫైనల్స్‌కు దూసుకెళ్లింది అయ్యర్ సేన. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో టఫ్ కాంపిటీషన్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఫస్ట్ బాల్ నుంచే ఫుల్ డామినేషన్ చూపించింది కేకేఆర్. ఆరెంజ్ ఆర్మీని 159 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత 13.4 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 164 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కమిన్స్ సేనను చిత్తు చేయడంతో కోల్‌కతా అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. తమ టీమ్ ఇంకో మ్యాచ్ నెగ్గితే చాలని కోరుకుంటున్నారు.
సన్‌రైజర్స్‌పై కోల్‌కతా విజయంతో ఆ టీమ్ ఫ్యాన్స్ అంతా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే తన జట్టు గెలిచి ఫైనల్‌కు చేరుకున్నా కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం సంతోషంగా లేడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే రివీల్ చేశాడు. ఎస్ఆర్హెచ్ను ఓడించినందుకు హ్యాపీగా ఉన్నానని.. కానీ పూర్తి సంతృప్తిగా లేనని అన్నాడు. దీనికి కారణం కప్పు వేటలో తాము ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉండటమేనని చెప్పాడు. ‘క్వాలిఫయర్స్‌లో గెలిచినందుకు సంతోషంగా ఉన్నాం. కానీ తృప్తి మాత్రం లేదు. ఎందుకంటే కప్పు కావాలంటే మేం ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉండటమే. ఎస్ఆర్హెచ్పై గెలుపు కోసం ప్రతి ఒక్కరూ తమ రెస్పాన్సిబిలిటీని నెరవేర్చారు. జట్టు కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ మ్యాచ్ రిజల్ట్ మాకు ఎంతో విలువైంది’ అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో వచ్చిన ప్రతి ఛాన్స్‌ను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించామని అయ్యర్ తెలిపాడు. బౌలింగ్‌లో వేరియేషన్స్ చూపిస్తే రిజల్ట్ పాజిటివ్‌గా వస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పాడు. స్టార్క్, సునీల్ నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేశారని మెచ్చుకున్నాడు. బ్యాటింగ్‌లోనూ అటాకింగ్ మంత్రాన్నే ఫాలో అయ్యామని.. వెంకటేశ్ అయ్యర్ ఆ ఊపును కంటిన్యూ చేయడం మంచి విషయమన్నాడు. ఫైనల్లోనూ ఇదే రకమైన ఆటతీరును కొనసాగిస్తామనే నమ్మకంతో ఉన్నామని శ్రేయస్ పేర్కొన్నాడు. కప్పు కోసం ఇంకో మ్యాచ్ ఆడాలనే ఊహ తనకు తృప్తిని ఇవ్వడం లేదని.. ఎస్ఆర్హెచ్పై విజయాన్ని పూర్తిగా ఆస్వాదించకపోవడానికి అదే కారణమని వివరించాడు. మరి.. కేకేఆర్ ఈసారి కప్పు నెగ్గుతుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
Shreyas Iyer said “We are happy but not yet satisfied because there is one more game to go”. pic.twitter.com/NKniWEeW9l
— Johns. (@CricCrazyJohns) May 22, 2024