iDreamPost

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బంపర్‌ ఆఫర్‌! SRH ప్లేయర్లను నేరుగా కలిసే ఛాన్స్‌..

  • Published Mar 18, 2024 | 4:44 PMUpdated Mar 18, 2024 | 4:44 PM

క్రికెట్ అభిమానులకు సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు బంపర్ ఆఫర్ ప్రకటించింది. నేరుగా ఎస్​ఆర్​హెచ్ ప్లేయర్లను కలిసే ఛాన్స్ ఇస్తోంది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

క్రికెట్ అభిమానులకు సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు బంపర్ ఆఫర్ ప్రకటించింది. నేరుగా ఎస్​ఆర్​హెచ్ ప్లేయర్లను కలిసే ఛాన్స్ ఇస్తోంది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Mar 18, 2024 | 4:44 PMUpdated Mar 18, 2024 | 4:44 PM
క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బంపర్‌ ఆఫర్‌! SRH ప్లేయర్లను నేరుగా కలిసే ఛాన్స్‌..

ఇప్పుడు ఎక్కడ చూసినా ఐపీఎల్ గురించే మాట్లాడుకుంటున్నారు. క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ ఆరంభానికి ఇంకా నాలుగు రోజుల సమయమే మిగిలి ఉంది. మ్యాచుల నిర్వహణ కోసం స్టేడియాలు ముస్తాబవుతున్నాయి. చాలా చోట్ల టికెట్ సేల్స్ కూడా స్టార్ట్‌ అయ్యాయి. టీమ్స్ అన్నీ ఫుల్ ప్రాక్టీస్​లో మునిగిపోయాయి. ఒక్కొక్కరుగా ప్లేయర్లు అందరూ జట్లతో చేరుతున్నారు. కెప్టెన్, కోచ్​తో పాటు టీమ్ మేనేజ్​మెంట్స్ ఎలా ట్రోఫీని నెగ్గాలి? ఎలాంటి టీమ్ కాంబినేషన్​తో వెళ్లాలి? అనే దానిపై కసరత్తులు చేస్తున్నాయి. ఐపీఎల్​లో హ్యూజ్ ఫాన్ బేస్ కలిగిన జట్లలో ఒకటైన సన్​రైజర్స్ హైదరాబాద్ కూడా సన్నాహకాలు మొదలుపెట్టేసింది. సారథి పాట్ కమిన్స్​ టీమ్​తో జాయిన్ అవడంతో ప్రాక్టీస్ సెషన్స్​లో హీట్ మరింత పెరిగింది. ఈ తరుణంలో క్రికెట్ అభిమానులుకు ఎస్​ఆర్​హెచ్​ బంపర్ ఆఫర్ ఇచ్చింది.

సన్​రైజర్స్ ప్లేయర్లను ఫ్యాన్స్ నేరుగా కలిసే లక్కీ ఛాన్స్. ఈ అవకాశాన్ని ఎస్​ఆర్​హెచ్​ ఫ్రాంచైజీ కల్పిస్తోంది. అయితే ఇష్టమైన క్రికెటర్లను కలవడం అంత ఈజీ కాదు. అందుకు ఓ షరతు పెట్టింది ఎస్​ఆర్​హెచ్. తాము అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన వారికి మాత్రమే ఆ ఛాన్స్ అని తెలిపింది. మార్చి 18వ తేదీన సాయంత్రం 5 గంటలకు సన్​రైజర్స్ ఓ కంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో కొన్ని క్వశ్చన్స్​ను అడుగుతారు. వీటికి ఇవాళ సాయంత్రం 6 గంటల లోపు ఆన్సర్ చేయాలి. ఈ ప్రోగ్రామ్​కు ఎవరు అర్హులు అనేది ఎస్​ఆర్​హెచ్​ ట్విట్టర్ హాండిల్​లోకి వెళ్లి తెలుసుకోవచ్చు. మీట్ అండ్ గ్రీట్ పేరిట నిర్వహిస్తున్న ఈ కాంపిటీషన్​లో సరైన సమాధానాలు చెప్పిన వారిలో నుంచి 25 మందిని ఎంపిక చేస్తారు. విజేతలుగా నిలిచిన వారు మాత్రమే క్రికెటర్లను కలిసేందుకు అర్హులు.

A bumper offer for cricket fans

మీట్ అండ్ గ్రీట్​లో గెలిచిన వారికి ఎస్​ఆర్​హెచ్ మెసేజ్ పంపిస్తుంది. వాళ్లు చెప్పిన ప్లేస్​కు, చెప్పిన టైమ్​కు వస్తే ఆటగాళ్లను కలవొచ్చు. ఎవరైతే నిర్దేశిత సమయానికి రాలేదో వాళ్లు ఆటగాళ్లను కలిసే ఛాన్స్ కోల్పోతారు. ఈ విషయాలను గురించి స్పష్టంగా వివరిస్తూ ఎస్​ఆర్​హెచ్ తమ ఎక్స్​ హ్యాండిల్​లో ఓ ప్రకటనను ఉంచింది. ఒకవేళ సన్​రైజర్స్ ప్లేయర్లను కలవాలని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ కాంపిటీషన్​కు సంబంధించిన మరిన్ని వివరాలను సన్​రైజర్స్ ట్విట్టర్​ అకౌంట్​లోకి వెళ్లి తెలుసుకోండి. కాగా, ఎస్​ఆర్​హెచ్ ఆఫర్ మీద సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఆటగాళ్లను నేరుగా కలిసే అవకాశాన్ని కల్పించడం సూపర్బ్ అని కామెంట్స్ చేస్తున్నారు. తాము కూడా ఈ కాంపిటీషన్​లో పాల్గొంటామని చెబుతున్నారు. మరి.. ఎస్​ఆర్​హెచ్​ నిర్వహించే పోటీలో పాల్గొనాలని అనుకుంటున్నట్లయితే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: సీఎస్​కేను వదలని దరిద్రం.. సీజన్​కు మరో స్టార్ ప్లేయర్​ దూరం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి