iDreamPost

సీఎస్​కేను వదలని దరిద్రం.. సీజన్​కు మరో స్టార్ ప్లేయర్​ దూరం!

  • Published Mar 18, 2024 | 3:51 PMUpdated Mar 18, 2024 | 3:51 PM

చెన్నై సూపర్ కింగ్స్​ను దరిద్రం వదలడం లేదు. ఐపీఎల్-2024 సీజన్ మొదలవడానికి ముందే ధోని సేనకు మరో షాక్ తగిలింది.

చెన్నై సూపర్ కింగ్స్​ను దరిద్రం వదలడం లేదు. ఐపీఎల్-2024 సీజన్ మొదలవడానికి ముందే ధోని సేనకు మరో షాక్ తగిలింది.

  • Published Mar 18, 2024 | 3:51 PMUpdated Mar 18, 2024 | 3:51 PM
సీఎస్​కేను వదలని దరిద్రం.. సీజన్​కు మరో స్టార్ ప్లేయర్​ దూరం!

ఐపీఎల్ జాతరకు సమయం దగ్గర పడుతోంది. అద్భుతమైన బ్యాటింగ్ విన్యాసాలు, కళ్లు చెదిరే ఫీల్డింగ్ ఎఫర్ట్స్, మైండ్ బ్లాంక్ చేసే బౌలింగ్ ఫీట్లతో ఆడియెన్స్​ను అలరించడానికి ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. మరో నాల్రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ కొత్త సీజన్ స్టార్ట్ కానుంది. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఐపీఎల్ నిర్వహణ కమిటీ చేస్తోంది. అన్ని జట్లు తమ ప్రాక్టీస్ సెషన్స్​ను స్టార్ట్ చేసేశాయి. అలాగే గెలవడానికి కావాల్సిన స్ట్రాటజీలు రెడీ చేస్తూ బిజీ అయిపోయాయి. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా సన్నాహకాల్లో బిజీగా ఉంది. అయితే ఆ జట్టుకు మరో బ్యాడ్ న్యూస్. గాయం కారణంగా ఇంకో స్టార్ ప్లేయర్ ఈ టీమ్​కు దూరమయ్యాడు. ఎవరా ఆటగాడు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త సీజన్ మొదలవడానికి ముందే సీఎస్​కేకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ గాయం బారిన పడ్డాడు. శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న మూడో వన్డేలో అతడికి ఇంజ్యురీ అయింది. అప్పటికే 2 వికెట్లు తీసిన బంగ్లా స్పీడ్​స్టర్.. 48వ ఓవర్ తొలి బాల్ వేస్తుండగా తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఆ నొప్పిని భరించలేక గ్రౌండ్​లోనే కుప్పకూలాడు. పెయిన్​ను భరించలేక విలవిలలాడుతున్న ముస్తాఫిజుర్​ను సపోర్ట్ స్టాఫ్ స్ట్రెచర్ మీద తీసుకెళ్లారు. ఈ పేసర్ ఎన్ని రోజుల్లో రికవర్ అవుతాడు? అనేది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే ఓపెనర్ డెవాన్ కాన్వే, యంగ్ పేసర్ మతీశ పతిరానాలు ఇంజ్యురీ కారణంగా ఐపీఎల్ ఫస్ట్ ఫేస్​లోని మ్యాచులకు దూరమయ్యారు. ఇప్పుడు ముస్తాఫిజుర్ రూపంలో మరో దెబ్బ తగలడంతో సీఎస్​కేకు ఎటూ పాలుపోవడం లేదు.

గతేడాది టైటిల్ నెగ్గి మంచి ఊపు మీదున్న ధోని సేన ఈసారి కూడా ఛాంపియన్​గా నిలవాలని భావిస్తోంది. మాహీ రూపంలో మిరాకిల్ కెప్టెన్ ఉండటం.. జడేజా, రుతురాజ్, రహానే లాంటి స్టార్స్​తో పాటు టీమ్ నిండా మంచి టాలెంట్ ఉన్న యంగ్​స్టర్స్ ఉండటంతో ఈసారి కూడా సీఎస్​కేదే కప్పు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ ఆ టీమ్​ను మాత్రం బ్యాడ్ లక్ వదలడం లేదు. ఒక్క మ్యాచ్ కూడా స్టార్ట్ కాకుండానే పతిరానా, కాన్వేతో పాటు ఇప్పుడు ముస్తాఫిజుర్ రూపంలో ముగ్గురు కీలక ఆటగాళ్లు టీమ్​కు దూరమయ్యారు. వీళ్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తారో ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో టీమ్ కాంబినేషన్​ను సెట్ చేయడం కెప్టెన్ ధోనీతో పాటు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్​కు తలకు మించిన పనిగా మారింది. దీన్ని వాళ్లిద్దరూ ఎలా పరిష్కరిస్తారు? ఆ ముగ్గురు లేని లోటును కనపడనీయకుండా విజయాల బాట ఎలా పట్టిస్తారు? అనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. సీఎస్​కే ఫ్యాన్స్ మాత్రం మాహీ ఉన్నాడు.. అతడు చూసుకుంటాడు, నో వర్రీస్ అంటున్నారు. మరి.. ముస్తాఫిజుర్ రూపంలో చెన్నైకి మరో షాక్ తగలడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: RCB ఓపెనింగ్ జోడీలో మార్పు! ఏకంగా కోహ్లీ ఆర్డర్ మార్చేశారు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి