Nidhan
ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెడితే చాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఏకంగా టాప్-2లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో క్వాలిఫయర్-1లో ఆడే గోల్డెన్ ఛాన్స్‌ను కొట్టేసింది కమిన్స్ సేన.
ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెడితే చాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఏకంగా టాప్-2లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో క్వాలిఫయర్-1లో ఆడే గోల్డెన్ ఛాన్స్‌ను కొట్టేసింది కమిన్స్ సేన.
Nidhan
ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెడితే చాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఏకంగా టాప్-2లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో క్వాలిఫయర్-1లో ఆడే గోల్డెన్ ఛాన్స్‌ను కొట్టేసింది కమిన్స్ సేన. టాప్-2లో నిలవాలంటే పంజాబ్ కింగ్స్‌ను తప్పక ఓడించాల్సిన స్థితిలో ఉన్న ఆరెంజ్ ఆర్మీ.. నిన్న ఆ టీమ్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. పంజాబ్ సంధించిన 215 పరుగుల లక్ష్యాన్ని ఇంకో 5 బంతులు ఉండగానే అందుకుంది. డేంజరస్ ట్రావిస్ హెడ్ ఫస్ట్ బాల్కే ఔటైనా తగ్గేదేలే అంటూ చెలరేగింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 66), హెన్రిచ్ క్లాసెన్ (26 బంతుల్లో 42) విధ్వంసక ఇన్నింగ్స్‌లతో టీమ్‌కు విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది ఎస్ఆర్హెచ్. అటు కేకేఆర్‌తో ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో రాజస్థాన్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
కోల్‌కతా మీద నెగ్గితే రాజస్థాన్ టాప్-2లోకి వచ్చేది. కానీ వాన కారణంగా ఒక్క బాల్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. పాయింట్లలో ఎస్ఆర్హెచ్-ఆర్ఆర్ సమానంగా నిలిచినా, నెట్ రన్ రేట్ పరంగా ఆరెంజ్ ఆర్మీ ముందుండటంతో క్వాలిఫయర్-1లో ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. దీంతో ఎస్ఆర్హెచ్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. క్వాలిఫయర్-1లో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరే ఛాన్స్, ఒకవేళ ఓడితే క్వాలిఫయర్-2లో ఆడాల్సి ఉంటుంది. ఇలా ఫైనల్లో చోటు కోసం ఎస్ఆర్హెచ్కు రెండు అవకాశాలు దక్కనున్నాయి. మరోవైపు రాజస్థాన్ ఫ్యాన్స్ డీలాపడిపోయారు. ఈజీగా టాప్-2లో నిలవాల్సిన టీమ్ క్వాలిఫయర్‌లో ఛాన్స్ కోసం బెంగళూరును తప్పక ఓడించాల్సిన పరిస్థితి నెలకొంది. అది ఆ జట్టుకు నాకౌట్ మ్యాచ్ కానుంది. ఓడితే ఇక ఇంటికే. అయితే రాజస్థాన్‌కు ఈ సిచ్యువేషన్ ఏర్పడటానికి ఆ టీమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
రాజస్థాన్ తన చెట్టును తానే నరుక్కుందని, ఆ జట్టు మూర్ఖత్వం సన్‌రైజర్స్‌కు వరంగా మారిందని అంటున్నారు. సాధారణంగా సంజూ సేన ఆడే హోమ్ మ్యాచులన్నీ జైపూర్‌లోనే జరుగుతాయి. ఈ టైమ్‌లో దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అలాగే నిన్న కేకేఆర్-ఆర్ఆర్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన గౌహతిలోని బసాపురా స్టేడియం దగ్గరా భారీ వర్షం పడింది. వాన ఎంతకీ ఆగకపోవడంతో మ్యాచ్ రద్దయింది. ఈ సమయంలో జైపూర్‌లోనూ వర్షాలు పడుతున్నాయి. అయితే అక్కడ వాన వల్ల మ్యాచ్‌లు పూర్తిగా రద్దయిన సందర్భాలు చాలా అరుదు. ఒకవేళ వర్షం పడినా ఎన్నో కొన్ని ఓవర్లతో మ్యాచ్‌లు నిర్వహించేవారు. అలాంటిది అక్కడ మ్యాచ్ పెట్టాల్సింది పోయి రాజస్థాన్ టీమ్ గౌహతి గ్రౌండ్‌ను ఎంచుకుంది. ఈ ఏరియాలో ఈ సమయంలో భారీ వర్షాలు పడతాయని తెలిసినా, ఆఖరి లీగ్ మ్యాచ్‌లతో ప్లేఆఫ్స్ ఛాన్సులు తారుమారవుతాయని తెలిసినా రాజస్థాన్ మేనేజ్మెంట్ ఈ డెసిషన్ ఎందుకు తీసుకుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫ్రాంచైజీ మూర్ఖత్వం వల్ల జట్టుకు తీవ్ర నష్టం కలిగిందని, ఇది ఎస్ఆర్హెచ్కు కలిసొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.