iDreamPost

RR vs RCB: రాజస్థాన్ vs బెంగళూరు.. గెలిచేదెవరంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

  • Published Apr 05, 2024 | 4:52 PMUpdated Apr 05, 2024 | 4:52 PM

ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్తున్న రాజస్థాన్​కు, గెలుపు కోసం తహతహలాడుతున్న బెంగళూరుకు మధ్య మ్యాచ్​కు అంతా సిద్ధమైంది. ఈ మ్యాచ్​లో ఏ జట్టు విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్తున్న రాజస్థాన్​కు, గెలుపు కోసం తహతహలాడుతున్న బెంగళూరుకు మధ్య మ్యాచ్​కు అంతా సిద్ధమైంది. ఈ మ్యాచ్​లో ఏ జట్టు విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 05, 2024 | 4:52 PMUpdated Apr 05, 2024 | 4:52 PM
RR vs RCB: రాజస్థాన్ vs బెంగళూరు.. గెలిచేదెవరంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్తున్న టీమ్ ఒకటి. వరుస పరాజయాలతో డీలాపడ్డ టీమ్ మరొకటి. ఈ రెండింటి మధ్య ఆసక్తికర పోరుకు అంతా సిద్ధమైంది. ఈ రెండు జట్లు మరేవో కాదు.. ఒకటి రాజస్థాన్ రాయల్స్, మరొకటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. హ్యాట్రిక్ విజయాలతో ఐపీఎల్-2024లో బ్రేకుల్లేని బుల్డోజర్​లా దూసుకెళ్తోంది సంజూ సేన. అలాంటి టీమ్ రేపు ఆర్సీబీని ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్​లో నెగ్గి విజయాలో జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఇక, ఆడిన 4 మ్యాచుల్లో మూడింట్లో ఓడిన బెంగళూరు ఎలాగైనా ఈ మ్యాచ్​తో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ టీమ్స్ ప్లేయింగ్ ఎలెవన్, విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

రాజస్థాన్ రాయల్స్

హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉంది రాజస్థాన్. బ్యాటింగ్​లో రియాన్ పరాగ్ రఫ్ఫాడిస్తుండటం టీమ్​కు కలిసొచ్చే అంశం. అతడితో పాటు మిగతా బ్యాటర్లు కూడా ఫర్వాలేదనిపిస్తున్నారు. కానీ ఎవరూ బిగ్ స్కోర్స్ చేయడం లేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్ నుంచి భారీ ఇన్నింగ్స్​లు కోరుకుంటోంది టీమ్. ఇప్పటివరకు గెలిచిన మ్యాచుల్లో పరాగ్ ఒక్కడే అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. ఒకవేళ పరాగ్ ఫెయిలైతే పరిస్థితి ఏంటనేదది అర్థం కాకుండా ఉంది. బౌలింగ్​లో యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, నండ్రే బర్గర్ సూపర్ ఫామ్​లో ఉండటం బిగ్ ప్లస్. సంజూ శాంసన్ బ్యాట్​తో ఫర్వాలేదనిపిస్తున్నాడు. కెప్టెన్సీలో అతడు తన మార్క్​ను చూపిస్తూ టీమ్​ను విజయాల బాటలో నడిపిస్తున్నాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

రెండో మ్యాచ్​లో నెగ్గి టోర్నీలో బోణీ కొట్టిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. వరుస ఓటముల కారణంగా ఆటగాళ్లతో పాటు ఆ టీమ్ ఫ్యాన్స్ కూడా డీలాపడ్డారు. బ్యాటింగ్​లో విరాట్ కోహ్లీ తప్ప ఎవరూ రాణించడం లేదు. టీమ్​కు అతిపెద్ద బలమైన కింగ్ ఫెయిలైతే పరిస్థితి ఏంటనేది అర్థం కావడం లేదు. మొదట్లో అదరగొట్టిన దినేష్ కార్తీక్ గత మ్యాచ్​లో ఫెయిలయ్యాడు. మహిపాల్ లోమ్రోర్, అనూజ్ రావత్ లాంటి డొమెస్టిక్ ప్లేయర్లు ఫర్వాలేదనిపిస్తున్నారు.

కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్​వెల్, కామెరాన్ గ్రీన్ అట్టర్ ఫ్లాప్ అవుతుండటం బెంగళూరును దెబ్బతీస్తోంది. బౌలింగ్​లో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఫ్లాప్ షో టీమ్​కు బిగ్ మైనస్​గా మారింది. అల్జారీ జోసెఫ్ ప్లేస్​లో వచ్చిన రీస్ టోప్లే కూడా భారీగా రన్స్ లీక్ చేస్తున్నాడు. ఇలా ప్లస్​ల కంటే ఆర్సీబీలో మైనస్​లే ఎక్కువ. వరుస ఓటముల కారణంగా ఆ టీమ్ ప్లేయర్ల బాడీ లాంగ్వేజ్ కూడా డౌన్​లో ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి డ్రెస్సింగ్ రూమ్​లో కోహ్లీ నిరుత్సాహంగా కనిపించడం, ఓటమి బాధతో బల్లను కొట్టడమే ఎగ్జాంపుల్​గా చెప్పొచ్చు.

ప్రిడిక్షన్

ఈ ఇరు జట్ల బలాబలాలు గమనించాక రేపటి మ్యాచ్​లో రాజస్థాన్​ గెలవడం పక్కా. ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటిదాకా 30 మ్యాచ్​లు జరిగాయి. అందులో 15 సార్లు బెంగళూరు నెగ్గగా.. 12 సార్లు రాజస్థాన్​ను విజయం వరించింది. అయితే ఆర్సీబీ టీమ్ కాంబినేషన్ సరిగ్గా లేకపోవడం, బ్యాటింగ్​తో పాటు బౌలింగ్ యూనిట్ ఫెయిల్యూర్, వరుస ఓటములతో డీలా పడిపోవడాన్ని బట్టి రేపటి మ్యాచ్​లో సంజూ సేనను నిలువరించడం ఆ టీమ్ వల్ల కాదు.

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

రాజస్థాన్: యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, శివమ్ దూబె, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్​మెయిర్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, నండ్రే బర్గర్.

బెంగళూరు:
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్​వెల్, కామెరాన్ గ్రీన్, అనూజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్, మయాంక్ డగర్, రీస్ టోప్లే, మహ్మద్ సిరాజ్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి