Nidhan
రాజస్థాన్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌తో గంగూలీ, పాంటింగ్ గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఎందుకీ గొడవ జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..
రాజస్థాన్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌తో గంగూలీ, పాంటింగ్ గొడవకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఎందుకీ గొడవ జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
క్రికెట్ మ్యాచ్‌లో గొడవలు సాధారణమే. ఒక టీమ్ ప్లేయర్లు ఇంకో టీమ్ ప్లేయర్లతో ఫైట్‌కు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అప్పుడప్పుడూ అంపైర్లతో ఆటగాళ్లు గొడవకు దిగడం కూడా చూస్తూనే ఉంటాం. అయితే అంపైర్లతో కోచింగ్ స్టాఫ్ ఫైట్ చేయడం ఎప్పుడూ చూసుండరు. కానీ అలాంటి గొడవకు ఐపీఎల్-2024 వేదికగా మారింది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో అంపైర్లతో గొడవపడ్డారు డీసీ కోచింగ్ బృందం. ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్, టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీలు ఫోర్త్ అంపైర్‌తో వాదనకు దిగారు. మ్యాచ్ సమయంలో ఇది పెద్దగా ఎవరి దృష్టికి రాలేదు. మ్యాచ్ తర్వాత దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అసలు ఏంటీ గొడవ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు హెడ్ కోచ్ పాంటింగ్, డైరెక్టర్ గంగూలీ ఫోర్త్ అంపైర్‌తో వాగ్వివాదానికి దిగారు. దీంతో డీసీ క్యాంప్ వేడెక్కింది. అంపైర్‌తో తొలుత పాంటింగ్ వాదులాటకు దిగాడు. ఆ తర్వాత గంగూలీ అందులో కలుజేసుకున్నాడు. అక్కడ జరిగింది ముమ్మాటికీ తప్పు అంటూ దాదా, పాంటింగ్ అంపైర్‌పై సీరియస్ అయ్యారు. దీంతో కొద్దిసేపు ఆట ఆగిపోయింది. అయితే చివరికి ఫోర్త్ అంపైర్ వాళ్లిద్దర్నీ కన్విన్స్ చేశాడు. దీనంతటికీ కారణం సబ్‌స్టిట్యూట్ ఫీల్డరే. ఈ మ్యాచ్‌లో షిమ్రాన్ హెట్మెయిర్కు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బర్గన్ను టీమ్‌లోకి తీసుకుంది రాజస్థాన్ రాయల్స్. అయితే ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన వెంటనే బర్గర్‌ను డగౌట్‌కు పంపించి.. అతడికి బదులుగా సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా రోమెన్ పావెల్‌ను తీసుకుంది. దీని మీద పాంటింగ్, గంగూలీ అభ్యంతరం వ్యక్తం చేశారు.
రూల్స్‌కు విరుద్ధంగా 5 మంది ఓవర్సీస్ ప్లేయర్లను ఉపయోగిస్తున్నారంటూ గంగూలీ, పాంటింగ్ సీరియస్ అయ్యారు. ఇది కరెక్ట్ కాదని.. ఫోర్త్ అంపైర్‌తో గొడవకు దిగారు. అయితే దీని మీద అంపైర్ క్లారిటీ ఇచ్చారు. ప్లేయింగ్ ఎలెవన్‌లోకి నలుగురు ఫారెన్ ప్లేయర్లను తీసుకున్నారని.. బర్గర్‌కు బదులుగా పావెల్‌ను సబ్‌స్టిట్యూట్‌గా మాత్రమే బరిలోకి దింపారని వివరించారు. దీంతో ఆ గొడవ అక్కడితో సద్దుమణిగింది. ఇక, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన డీసీ ఓవర్లన్నీ ఆడి 173 పరుగులు చేయగలిగింది. ఆ టీమ్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మాస్ బ్యాటింగ్‌తో అదరగొట్టిన రియాన్ పరాగ్ (45 బంతుల్లో 84 నాటౌట్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరి.. అంపైర్‌తో దాదా, పాంటింగ్ గొడవపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Nihari Korma (@NihariVsKorma) March 29, 2024
Ricky Ponting and Sourav Ganguly are not happy with the umpires! 👀
📷: Jio Cinema#IPL2024 #RRvDC #Cricket #Sportskeeda pic.twitter.com/YlgsUSUVP3
— Sportskeeda (@Sportskeeda) March 28, 2024