Nidhan
టీమిండియా పించ్ హిట్టర్ రింకూ సింగ్ ఓ యంగ్ క్రికెటర్‌కు సారీ చెప్పాడు. తాను కావాలని అలా చేయలేదన్నాడు.
టీమిండియా పించ్ హిట్టర్ రింకూ సింగ్ ఓ యంగ్ క్రికెటర్‌కు సారీ చెప్పాడు. తాను కావాలని అలా చేయలేదన్నాడు.
Nidhan
రింకూ సింగ్.. భారత క్రికెట్‌కు దొరికిన మరో ఆణిముత్యం. ఈ మధ్య కాలంలో టీమిండియాలోకి తరంగాల్లా దూసుకొచ్చిన యంగ్ క్రికెటర్స్‌లో రింకూ ఒకడు. పవర్ హిట్టర్‌గా, సూపర్బ్ ఫీల్డర్‌గా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడతను. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో టీమ్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. వరల్డ్ కప్ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ నుంచి రీసెంట్గా జరిగిన ఆఫ్ఘానిస్థాన్ సిరీస్ వరకు టీ20ల్లో బ్యాటింగ్‌లో దుమ్మురేపి అందరి మనసుల్ని దోచుకున్నాడు. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ నయా హిట్టర్.. ఇప్పుడు క్యాష్ రిచ్ లీగ్ నెక్స్ట్ సీజన్ ప్రిపరేషన్స్‌లో బిజీ అయిపోయాడు. అయితే ఓ యంగ్ క్రికెటర్‌కు అతడు క్షమాపణలు చెప్పాడు. అసలు రింకూ ఎందుకు సారీ చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆఫ్ఘానిస్థాన్ టీ20 సిరీస్ తర్వాత నుంచి ఖాళీగా ఉన్న రింకూ ఈ గ్యాప్‌లో తన ఫిట్నెస్ను మరింత మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాడు. అలాగే బ్యాటింగ్ టెక్నిక్‌ను కూడా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఐపీఎల్ కొత్త సీజన్‌కు టైమ్ దగ్గర పడుతుండటంతో తాను ప్రాతినిధ్యం వహించే కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌తో కలిశాడు. నెట్స్‌లో చెమటోడ్చుతున్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. బిగ్ షాట్స్ ఎలా కొట్టాలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే గ్రౌండ్లో రింకూ సాధన చేస్తున్న సమయంలో అతడు కొట్టిన ఓ భారీ షాట్ ఒక టీనేజ్ క్రికెటర్ నుదుటికి తగిలింది. ఈ విషయం తెలుసుకున్న స్టార్ బ్యాటర్.. వెంటనే ఆ బాలుడి దగ్గరకు వెళ్లి గాయాన్ని పరిశీలించాడు. ఆ బాలుడికి సారీ చెప్పిన రింకూ.. కావాలని అలా చేయలేదన్నాడు.
కేకేఆర్ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ కూడా ఆ యంగ్ క్రికెటర్‌ను కలిశాడు. అతడికి తన టోపీని బహూకరించాడు. ఆ టోపీ మీద రింకూ సంతకం చేసి ఇచ్చాడు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియోను కోల్‌కతా ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైరల్‌గా మారిన ఈ వీడియో మీద నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. రింకూది గొప్ప మనసు అని కామెంట్స్ చేస్తున్నారు. బాల్ తగిలిందని వదిలేయకుండా ఆ బాలుడ్ని కలసి అతడికి సారీ చెప్పడం రింకూ వ్యక్తిత్వం ఎలాంటిదో చెబుతోందని అంటున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనిషి తాలూకు స్వభావం, వ్యక్తిత్వం, మంచితనానికి అద్దం పడతాయని చెబుతున్నారు. రింకూ చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగిన వ్యక్తి అని.. అందుకే ఎవరితో ఎలా నడుచుకోవాలో అతడికి బాగా తెలుసునని.. అతడి మంచి మనసుకు సెల్యూట్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. రింకూ క్షమాపణ ఘటనపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: రోహిత్ ఎలాంటి వాడంటే..? ముంబై బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్!
All heart, Rinku Bhaiya! 💜 pic.twitter.com/C04HlEDXmF
— KolkataKnightRiders (@KKRiders) March 12, 2024