iDreamPost

Travis Head: ట్రావిస్ హెడ్ మెరుపు శతకం.. ఇది ఊచకోతకు కొత్త నిర్వచనం!

  • Published Apr 15, 2024 | 8:32 PMUpdated Apr 15, 2024 | 8:41 PM

సన్​రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మరోమారు విధ్వంసం సృష్టించాడు. ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. మెరుపు శతకంతో చెలరేగిపోయాడు.

సన్​రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మరోసారి విధ్వంసక ఇన్నింగ్స్​తో చెలరేగాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశాడు. ఆ బౌలర్, ఈ బౌలర్ అనే తేడాల్లేకుండా అందర్నీ ఉతికి ఆరేశాడు. 39 బంతుల్లోనే 100 పరుగుల మార్క్​ను చేరుకున్నాడు హెడ్. మాస్ హిట్టింగ్​తో ఆర్సీబీకి మైండ్​బ్లాంక్ అయ్యేలా చేశాడు. 9 బౌండరీలు కొట్టిన హెడ్.. ఏకంగా 8 భారీ సిక్సులు బాదాడు. ఫోర్లు, సిక్సుల ద్వారానే 84 పరుగులు పిండుకున్నాడతను. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

హెడ్​కు మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34) కూడా మంచి సపోర్ట్ అందించాడు. వీళ్లిద్దరూ కలసి ఎడాపెడా షాట్లు బాదుతుండటంతో ఆర్సీబీ కెప్టెన్​ ఫాఫ్ డుప్లెసిస్​కు ఏం చేయాలో పాలుపోలేదు. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 7 మంది బౌలర్లను మార్చాడు డుప్లెసిస్. అయినా సన్​రైజర్స్ స్కోరుకు బ్రేకులు పడలేదు. ముఖ్యంగా హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడటంతో బెంగళూరు బౌలర్లు గుడ్లు తేలేశారు. సెంచరీ తర్వాత మరో రెండు పరుగులు చేసి ఔటయ్యాడు హెడ్. ఎస్​ఆర్​హెచ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాటర్​గా అతడు చరిత్ర సృష్టించాడు. మరి.. హెడ్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి