iDreamPost

కొత్త జెర్సీలో RCB ప్లేయర్లు.. నెట్టింట భారీగా ట్రోలింగ్!

  • Published Mar 19, 2024 | 4:52 PMUpdated Mar 19, 2024 | 5:11 PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఐపీఎల్ కొత్త సీజన్​లో సరికొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. అయితే నయా జెర్సీ ఇలా ప్రవేశపెట్టారో లేదో వెంటనే నెట్టింట విమర్శల తాకిడి మొదలైంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఐపీఎల్ కొత్త సీజన్​లో సరికొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. అయితే నయా జెర్సీ ఇలా ప్రవేశపెట్టారో లేదో వెంటనే నెట్టింట విమర్శల తాకిడి మొదలైంది.

  • Published Mar 19, 2024 | 4:52 PMUpdated Mar 19, 2024 | 5:11 PM
కొత్త జెర్సీలో RCB ప్లేయర్లు.. నెట్టింట భారీగా ట్రోలింగ్!

ఐపీఎల్-2024 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సన్నద్ధమవుతోంది. ఆ టీమ్ ఫుల్ ప్రిపరేషన్ మోడ్​లో ఉంది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఎప్పుడో బెంగళూరుకు వచ్చేశాడు. సతీమణి అనుష్క శర్మకు డెలివరీ అవడం, కొడుకు పుట్టడంతో ఇన్నాళ్లూ లండన్​లోనే ఉండిపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా సోమవారం ఆర్సీబీ క్యాంపులో చేరాడు. దీంతో ఆ జట్టు ప్రాక్టీస్ సెషన్స్​లో మరింత జోరు పెంచింది. అయితే ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అన్​బాక్స్​ ఈవెంట్​ను ఘనంగా నిర్వహించింది ఆర్సీబీ. చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కెప్టెన్​గా డుప్లెసిస్​ను కన్ఫర్మ్ చేసింది. అలాగే ఈ సీజన్ కోసం నయా జెర్సీని కూడా ఆవిష్కరించింది. అయితే దీనిపై అప్పుడే నెట్టింట ట్రోలింగ్ మొదలైంది.

ఆర్సీబీ అన్​బాక్స్ ఈవెంట్ కోసం చిన్నస్వామి స్టేడియానికి భారీగా తరలివచ్చారు అభిమానులు. ఆర్సీబీ.. ఆర్సీబీ నినాదాలతో హోరెత్తించారు ఫ్యాన్స్. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రయాణిస్తున్న బస్సు రాగానే కోహ్లీ.. కోహ్లీ అంటూ స్లోగన్స్​తో రెచ్చిపోయారు. విరాట్ కూడా వాళ్ల వైపు చూసి నవ్వాడు. అయితే బెంగళూరు తీసుకొచ్చిన కొత్త జెర్సీ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్​గా మారింది. ఆర్సీబీ కొత్త జెర్సీలో ఆ టీమ్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్​తో పాటు కోహ్లీ ఫోజు ఇస్తున్న రెండు వేర్వేరు ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ టీమ్ అధికారికంగా జెర్సీ ఫొటోలు రిలీజ్ చేయలేదు. కానీ సిరాజ్​ కొత్త జెర్సీలో ఉన్న పిక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీటితో పాటు విరాట్, డుప్లెసిస్ కొత్త జెర్సీలు ధరించి కూర్చొని సరదాగా మాట్లాడుతున్న ఓ వీడియో కూడా చక్కర్లు కొడుతోంది.

కోహ్లీ, సిరాజ్, డుప్లెసిస్ ధరించిన జెర్సీ ఫొటోలపై నెట్టింట భారీగా ట్రోలింగ్ నడుస్తోంది. కొత్త దాని కంటే పాత జెర్సీనే చాలా బాగుందని, అందులో హుందాతనం కొట్టొచ్చినట్లు కనిపించేదని నెటిజన్స్ అంటున్నారు. ముంబై ఇండియన్స్ నుంచి బ్లూ కలర్​ను కాపీ చేసి ఈ జెర్సీలో వేశారా? అని మరికొందరు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. రెడ్, బ్లాక్ కాంబినేషన్​లో ఓల్డ్ జెర్సీ భలేగా ఉండేదని.. అనవసరంగా మార్చారు? ఎవరిదీ చెత్త ఐడియా అంటూ కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. 2016-17 సీజన్​లో సీఎస్​కే ప్లేయర్లు ధరించిన జెర్సీ నుంచి ఇన్​స్పైర్ అయ్యారా? అంటూ రకరకాల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రెడ్ అండ్ బ్లూ కాంబో అస్సలు బాగోలేదని.. దయచేసి పాత జెర్సీని రీప్లేస్ చేయమని ఆర్సీబీ హ్యాండిల్​కు మెసేజ్​లు పంపిస్తున్నారు. మరి.. ఆర్సీబీ కొత్త జెర్సీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: IPL జట్లన్నీ ఆ మృగం గురించే భయపడుతున్నారు! వాడిని ఆపే మగాడు ఎవరు?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి