iDreamPost

IPL 2024: రాజస్తాన్ తో కీలక పోరు.. మాక్స్ వెల్ ప్లేస్ లో చిచ్చర పిడుగు ఎంట్రీ!

రాజస్తాన్ తో జరగబోయే కీలక పోరు కోసం ఆర్సీబీ టీమ్ లో భారీ మార్పు చేస్తున్నట్లు సమాచారం. అట్టర్ ఫ్లాప్ అవుతున్న గ్లెన్ మాక్స్ వెల్ ప్లేస్ లో ఓ చిచ్చర పిడుగుని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

రాజస్తాన్ తో జరగబోయే కీలక పోరు కోసం ఆర్సీబీ టీమ్ లో భారీ మార్పు చేస్తున్నట్లు సమాచారం. అట్టర్ ఫ్లాప్ అవుతున్న గ్లెన్ మాక్స్ వెల్ ప్లేస్ లో ఓ చిచ్చర పిడుగుని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

IPL 2024: రాజస్తాన్ తో కీలక పోరు.. మాక్స్ వెల్ ప్లేస్ లో చిచ్చర పిడుగు ఎంట్రీ!

‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా తయ్యారైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ పరిస్థితి. ఐపీఎల్ 2024 సీజన్ లో నాలుగు మ్యాచ్ ల్లో ఒకే ఒక్క విజయంతో పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. జట్టులో వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఉన్నప్పటికీ.. వారు పేరుకే తప్ప రాణించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. విరాట్ కోహ్లీ ఒక్కడే బ్యాట్ తో రాణిస్తుండగా.. మిగిలిన వారిలో డుప్లెసిస్, మాక్స్ వెల్, కామెరూన్ గ్రీన్, దినేష్ కార్తిక్ లాంటి ప్లేయర్లు గొప్పగా ఆడటం లేదు. ఇక బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇదిలా ఉండగా.. రాజస్తాన్ తో జరగబోయే కీలక పోరు కోసం ఆర్సీబీ టీమ్ లో భారీ మార్పు చేస్తున్నట్లు సమాచారం. అట్టర్ ఫ్లాప్ అవుతున్న గ్లెన్ మాక్స్ వెల్ ప్లేస్ లో ఓ చిచ్చర పిడుగుని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

గ్లెన్ మాక్స్ వెల్.. సమకాలీన క్రికెట్ ప్రపంచంలో విధ్వంసకర ప్లేయరని మనందరికి తెలిసిందే. అతడు క్రీజ్ లో స్టాండ్ అయితే.. ప్రేక్షకులు సిక్సర్ల వర్షంలో తడిసిముద్ద అవ్వాల్సిందే, బౌలర్లు చుక్కలు లెక్కపెట్టాల్సిందే. కానీ ఇప్పుడా ప్రతాపం కనిపించడం లేదు. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ లో మాక్సీ మెరుపులు లేవు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో రెండు డకౌట్స్ తో కేవలం 31 రన్స్ మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్ లో పర్వాలేదనిపిస్తున్నాడు.

Will jacks

అయితే బ్యాటింగ్ లో దారుణంగా విఫలం అవుతున్న మాక్సీ ప్లేస్ లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ విల్ జాక్స్ ను తుది జట్టులోకి తీసుకోవాలని భావిస్తోందట ఆర్సీబీ మేనేజ్ మెంట్. ఆల్ రౌండర్ గ్రీన్ ను తీసేయడం కుదరదు.. ఎందుకంటే? అతడు బ్యాటింగ్ తో పాటుగా పేస్ బౌలర్ గా సేవలు అందిస్తున్నాడు. దీంతో మాక్స్ వెల్ నే తప్పించాల్సిన పరిస్థితి. క్రీడా పండితులు కూడా టీ20 లీగుల్లో దుమ్మురేపుతున్న విల్ జాక్స్ నే నెక్ట్స్ మ్యాచ్ ల నుంచి తుది జట్టులోకి తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. ఆసీస్ స్టార్ స్థానంలో ఇంగ్లండ్ విధ్వంసకర ప్లేయర్ ఎంట్రీ ఇవ్వడం ఖాయం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: నవ్వుతూ రోహిత్ లీకులు! ముంబై కెప్టెన్‌గా రీ ఎంట్రీ పక్కానా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి