Nidhan
ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈసారి కప్పు కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్న కమిన్స్ సేన.. టైటిల్‌కు కొద్ది దూరంలో ఉంది.
ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈసారి కప్పు కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్న కమిన్స్ సేన.. టైటిల్‌కు కొద్ది దూరంలో ఉంది.
Nidhan
ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. తప్పక గెలవాల్సిన సిచ్యువేషన్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆడకుండానే నెక్స్ట్ స్టేజ్‌కు చేరుకుంది. వర్షం కారణంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. 15 పాయింట్లతో ఆరెంజ్ ఆర్మీ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది. ఇప్పటికే కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఈ నేపథ్యంలో మరో టీమ్‌కు మాత్రమే 16 పాయింట్లు సాధించే ఛాన్స్ ఉండటంతో ఎస్ఆర్హెచ్ మూడో జట్టుగా ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గత మూడు సీజన్లలోనూ నిరాశపర్చిన ఆరెంజ్ ఆర్మీ.. 2020 తర్వాత ఫస్ట్ టైమ్ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది. ఇప్పుడు ఆ జట్టు కసి మీద ఉంది.
గ్రూప్ స్టేజ్‌లో తమను అవమానించిన ఆ బౌలర్ మీద కోపంతో రగిలిపోతోంది సన్‌రైజర్స్. అతడి బలుపు తీయాలని భావిస్తోంది. ప్లేఆఫ్స్‌లో అతడ్ని ఓ ఆటాడుకోవాలని చూస్తోంది. దొరికితే వీరబాదుడుతో మూడు చెరువుల నీళ్లు తాగించాలని చూస్తోంది. ఎస్ఆర్హెచ్ రివేంజ్ తీర్చుకోవాలని అనుకుంటోంది మరెవరి మీదో కాదు.. కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ హర్షిత్ రాణా పైనే. ఈ సీజన్ ఆరంభంలో కేకేఆర్‌తో మ్యాచ్‌లో పోరాడి ఓడింది కమిన్స్ సేన. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఆ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన హర్షిత్.. ఎస్ఆర్హెచ్ను అవమానించాడు. మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేశాక సన్‌రైజర్స్ డగౌట్ వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చాడు. దీంతో మయాంక్ అతడ్ని సీరియస్‌గా చూస్తూ వెళ్లిపోయాడు.
హర్షిత్ మీద అప్పటి నుంచి కోపంతో రగిలిపోతోంది ఎస్ఆర్హెచ్ క్యాంప్. అతడి బలుపు తీయాలని ఫిక్స్ అయింది. హర్షిత్‌పై కసిగా ఉన్న సన్‌రైజర్స్ బ్యాటర్లు.. అతడు బౌలింగ్‌కు వస్తే చావు మోత మోగించాలని చూస్తున్నారు. ఫోర్లు, సిక్సులతో అతడికి పీడకల ఎలా ఉంటుందో పరిచయం చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఆరెంజ్ ఆర్మీ రివేంజ్ తీరాలంటే ఒకటి జరగాలి. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయిన ఎస్ఆర్హెచ్ టాప్-2తో లీగ్ స్టేజ్‌ను ఫినిష్ చేయాలి. అందుకోసం ఆఖరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై నెగ్గాలి. అప్పుడు 17 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకుతుంది. అదే టైమ్‌లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడిపోవాలి. ఈ రెండూ జరిగితే ఎస్ఆర్హెచ్ టాప్-2లో ఫినిష్ చేస్తుంది. అప్పుడు తొలి క్వాలిఫయర్‌లో కోల్‌కతాను ఢీకొనొచ్చు. ఆ మ్యాచ్‌లో హర్షిత్ బలుపు తీయొచ్చు. మరి.. సన్‌రైజర్స్ తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుందని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.