iDreamPost

IPL 2024 ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ కు భారీ షాక్!

IPL 2024 సీజన్ ప్రారంభానికి ముందే ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఎన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉండడు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

IPL 2024 సీజన్ ప్రారంభానికి ముందే ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఎన్ని మ్యాచ్ లకు అందుబాటులో ఉండడు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

IPL 2024 ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ కు భారీ షాక్!

ఐపీఎల్ 2024 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇక ఈ మెగాటోర్నీలో సత్తాచాటాలని అన్ని జట్లు ఊవ్విళ్లూరుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను ప్రాక్టీస్ కు కూడా దింపాయి. ఈ క్రమంలో ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ తొలి మ్యాచ్ లకు దూరం కానున్నట్లు సమాచారం. మరి ఆ బ్యాటర్ ఎవరు? ఎన్ని మ్యాచ్ లకు దూరమైతాడు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ కు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా ప్లేయర్, ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తొలి రెండు మ్యాచ్ లకు దూరం కానున్నట్లు సమాచారం. ఈ ఏడాది మెుదట్లో స్పోర్ట్స్ హెర్నియా అనే సర్జరీ చేయించుకున్నాడు. దీంతో ముంబై ఆడే తొలిరెండు మ్యాచ్ లకు స్కై అందుబాటులో ఉండే ఛాన్స్ లు తక్కువేనని ఎంఐ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు.

అయితే ఇటీవలే తన సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను షేర్ చేశాడు సూర్యకుమార్. అందులో ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియోలు ఉన్నాయి గానీ.. ఎక్కడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు లేవు. దీంతో అతడు ఇంకా పూర్తిస్థాయిలో ఫిట్ నెస్ సాధించలేదని అర్ధమవుతోంది. అయితే ఎంఐ ఈ మెగాటోర్నీలో తొలి మ్యాచ్ ఆడటానికి ఇంకా 12 రోజుల సమయం ఉండటంతో.. సూర్య పూర్తి ఫిట్ నెస్ సాధించేందుకు అవకాశం ఉంది. ఇక ముంబై తన తొలి మ్యాచ్ మార్చి 24న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ ను ఢీ కొనబోతోంది. దీంతో పాండ్యా-రోహిత్ మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.

ఇదికూడా చదవండి: టీ20 వరల్డ్ కప్.. పంత్ రీ ఎంట్రీపై ఆందోళన పెడుతున్న జై షా వ్యాఖ్యలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి