iDreamPost
android-app
ios-app

MS Dhoni- Virat Kohli: ఇది కదా ధోని గొప్పదనం.. డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీతో ఏమన్నాడో తెలుసా?

  • Published May 21, 2024 | 7:37 AM Updated Updated May 21, 2024 | 7:37 AM

RCB-ధోని వివాదం తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చిన విరాట్ కోహ్లీతో ధోని ఏమన్నాడో తెలిసిపోయింది. ఆ మాటలకు కోహ్లీ-ధోని ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకీ డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీతో ధోని ఏమన్నాడో తెలుసా?

RCB-ధోని వివాదం తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చిన విరాట్ కోహ్లీతో ధోని ఏమన్నాడో తెలిసిపోయింది. ఆ మాటలకు కోహ్లీ-ధోని ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకీ డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీతో ధోని ఏమన్నాడో తెలుసా?

MS Dhoni- Virat Kohli: ఇది కదా ధోని గొప్పదనం.. డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీతో ఏమన్నాడో తెలుసా?

IPL 2024 చివరి దశకు వచ్చింది. ప్లే ఆఫ్స్ చేరిన నాలుగు జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్ కంటే ముందే.. అంతకంటే క్రేజ్ ఉన్న మ్యాచ్ జరిగింది. ప్లే ఆఫ్స్ కోసం ఆర్సీబీ వర్సెస్ చెన్నై జట్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో చెన్నైకి షాకిచ్చి.. ఆర్సీబీ నాకౌట్స్ కు దూసుకెళ్లింది. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. బెంగళూరు ఆటగాళ్లకు మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా ధోని గ్రౌండ్ విడిచి వెళ్లిపోయాడని కొందరు అతడిని తప్పు బట్టారు. కానీ అసలు విషయం తెలిసి.. ధోనిని అపార్థం చేసుకున్నారని ఆ తర్వాత అనుకున్నారు. అయితే తాజాగా డ్రెస్సింగ్ రూమ్ లో ధోని-కోహ్లీలు ఏం మాట్లాడుకున్నారో తెలిసిపోయింది. దీంతో ఇది కదా ధోని గొప్పదనం అంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్-ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరిగి రోజులు గడుస్తున్నా.. ఇంకా ఆ మ్యాచ్ గురించి ఏదో ఒక వార్త వైరల్ గా మారుతూనే ఉంది. ఈ మ్యాచ్ పెద్ద వివాదానికి దారి తీసిన విషయం మనకు తెలిసిందే. అసలు విషయం తెలియకుండా ధోని ఆర్సీబీ ఆటగాళ్లను అవమానించాడని పెద్ద రాద్దాంతం చేశారు. అయితే ధోని అలాంటి వాడు కాదని, గుజరాత్ టైటాన్స్ తో గత ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ధోని చేసిన గొప్ప పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దాంతో ధోనిని తిట్టిన నోర్లు ఒక్కసారిగా మూతపడ్డాయి.  ఈ నేపథ్యంలో మ్యాచ్ తర్వాత చెన్నై డ్రెస్సింగ్ రూమ్ కు విరాట్ కోహ్లీ వెళ్లాడు. అయితే వీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు అన్నది అప్పుడు తెలియలేదు.

కాగా.. తాజాగా డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీ-ధోని ఏం మాట్లాడుకున్నారో బయటకి వచ్చింది. ధోని ఆర్సీబీ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్స్ ఇద్దామని వేచి చూశాడు. కానీ వారు రాకపోవడంతో డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయాడు. ఇక గెలుపు సంబరాలు ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ చెన్నై డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చి ధోనిని ప్రత్యేకంగా కలిశాడు. ఈ క్రమంలో ధోని.. “విరాట్ నువ్వు ఫైనల్ కు చేరాలి, కప్ కొట్టాలి, గుడ్ లక్” అంటూ చెప్పాడు. ఈ విషయం కాస్త బయటకి రావడంతో, ఇది కాదా ధోని గొప్పదం అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒడిపోయిన బాధలో ఉన్నప్పటికీ తన ఫ్రెండ్ కప్ కొట్టాలంటూ కోరుకున్నాడు ధోని. ఇంత గొప్ప మనిషిని పట్టుకుని విమర్శలు చేశారా? అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.