Somesekhar
చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన తొలి మ్యాచ్ ప్రత్యర్థి అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కు హెచ్చరికలు పంపాడు. మరి ధోని ఆర్సీబీకి పంపిన వార్నింగ్ ఏంటి? చూద్దాం పదండి.
చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన తొలి మ్యాచ్ ప్రత్యర్థి అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కు హెచ్చరికలు పంపాడు. మరి ధోని ఆర్సీబీకి పంపిన వార్నింగ్ ఏంటి? చూద్దాం పదండి.
Somesekhar
క్రికెట్ లవర్స్ ను ఎంతగానో ఉర్రూతలూగించే ఐపీఎల్ మెగా జాతర మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఇందు కోసం ఇప్పటికే అన్ని జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ఇక తొలిపోరులో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడేందుకు కాలు దువ్వుతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. ధోని-విరాట్ పోరు కోసం ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. మార్చి 22న చెపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి టీమ్ కు ముందే హెచ్చరికలు పంపాడు కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని. మరి ఇంతకీ ధోని ఆర్సీబీకి పంపిన వార్నింగ్ ఏంటి. చూద్దాం పదండి.
మహేంద్రసింగ్ ధోని.. గాయం నుంచి కోలుకున్న బెబ్బులిలా ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ మెుదలుపెట్టిన ఈ చెన్నై కెప్టెన్ తన తొలి ప్రత్యర్థి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి హెచ్చరికలను పంపాడు. ప్రాక్టీస్ లో తన ధనాధన్ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. స్పీడ్ బౌలింగ్ లో హెలికాఫ్టర్ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. 42 ఏళ్ల వయసులో పైగా మోకాలికి సర్జరీ చేయించుకున్నా కూడా తనలో పస తగ్గలేదని నిరూపించుకున్నాడు. తన ట్రేడ్ మార్క్ షాట్ అయిన హెలికాఫ్టర్ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
ఇదిలా ఉండగా.. గత సీజన్ లో తన మార్క్ ఫినిషింగ్ ఇన్నింగ్స్ లు ఆడకపోయినా, కెప్టెన్ గా సత్తాచాటి.. కప్ ను అందించాడు. ఇక ఇప్పుడు మునుపటి ధోనిని గుర్తుకు తెస్తూ.. హెలికాఫ్టర్ షాట్లతో దుమ్మురేపుతుండటం సీఎస్కేకు సంతోషాన్ని కలిగించే అంశం. కానీ ఈ సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై టీమ్ కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కీలక ఆటగాళ్లు గాయాల బారినపడటం ఆ టీమ్ కు పెద్ద సమస్యగా మారింది. కాన్వే, పతిరణ తో పాటుగా ముస్తాఫిజుర్ రెహ్మన్ లాంటి ఆటగాళ్లు ఇంజ్యూరీ అయ్యారు. మరి తొలి మ్యాచ్ కు ముందే ఆర్సీబీకి హెలికాఫ్టర్ షాట్లతో ధోని హెచ్చరికలు పంపడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
MS Dhoni with a helicopter shot in the practice session.
– MSD is preparing hard for the IPL.pic.twitter.com/6YDYRK8QQy
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2024
ఇదికూడా చదవండి: ఈ IPLలో టాప్ 5 బౌలర్లు! పేర్లు చూస్తే బ్యాటర్లు వణకాల్సిందే!