iDreamPost

Mohammed Shami: హార్దిక్, గిల్​పై షమి షాకింగ్ కామెంట్స్.. తోటి ఆటగాళ్లని చూడకుండా..!

  • Published Jan 17, 2024 | 9:58 PMUpdated Jan 17, 2024 | 9:58 PM

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తోటి ఆటగాళ్లు అని కూడా చూడకుండా హార్దిక్, గిల్​ మీద అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తోటి ఆటగాళ్లు అని కూడా చూడకుండా హార్దిక్, గిల్​ మీద అతడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

  • Published Jan 17, 2024 | 9:58 PMUpdated Jan 17, 2024 | 9:58 PM
Mohammed Shami: హార్దిక్, గిల్​పై షమి షాకింగ్ కామెంట్స్.. తోటి ఆటగాళ్లని చూడకుండా..!

ఐపీఎల్-2024కు మరికొన్ని వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. మార్చి నెల మూడో వారంలో క్యాష్​ రిచ్ లీగ్ కొత్త సీజన్ షురూ అయ్యే అవకాశం ఉందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ ఏడాది వేసవిలో లోక్​సభ ఎన్నికలు ఉండటంతో ఐపీఎల్ షెడ్యూల్ విషయంలో బీసీసీఐ తర్జనభర్జనలు పడుతోంది. దీంతో అసలు ఈసారి ఐపీఎల్​ను మన దేశంలో నిర్వహిస్తారా లేదా ఇతర దేశానికి తరలిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. అటు క్రికెటర్లు అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. క్రికెట్​కు దూరంగా ఉంటున్న ఎంఎస్ ధోనీతో పాటు గాయాల నుంచి కోలుకుంటున్న మహ్మద్ షమి, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లు ఐపీఎల్ కోసం ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసేశారు. ఈ తరుణంలో షమి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్​ను హార్దిక్ పాండ్యా వీడటం మీద అతడు రియాక్ట్ అయ్యాడు. పాండ్యా పోయినా ఎవరికీ నష్టం లేదన్నాడు.

హార్దిక్ వెళ్లిపోయినా నష్టం లేదని చెప్పిన షమి.. శుబ్​మన్ గిల్ టీమ్​ను వీడినా పోయేదేమీ లేదన్నాడు. టీమ్ సమతూకంతో ఉందా? లేదా? అనేదే మాత్రమే చూడాల్సిన అంశమన్నాడు. ‘ఎవరు జట్టులో నుంచి వెళ్లిపోయినా పెద్దగా ఫరక్ పడదు. టీమ్ బ్యాలెన్స్​డ్​గా ఉందా లేదా అన్నదే ఇంపార్టెంట్. హార్దిక్ ఒకప్పుడు కెప్టెన్​గా ఉన్నాడు. మమ్మల్ని సక్సెస్​ఫుల్​గా ముందుకు నడిపించాడు. రెండు సీజన్లలో టీమ్​ను ఫైనల్స్​కు తీసుకెళ్లాడు. ఒకసారి గెలిపించాడు కూడా.. అయినా పాండ్యాతో లైఫ్​ టైమ్​కు సరిపడా గుజరాత్ టైటాన్స్ అగ్రిమెంట్ చేసుకోలేదు కదా! టీమ్​తో ఉండాలా, వీడాలా అనేది అతడి డెసిజన్. ఇప్పుడు గిల్ సారథి అయ్యాడు. కెప్టెన్​గా తనకూ ఎక్స్​పీరియెన్స్ వస్తుంది. ఏదో ఒక రోజు శుబ్​మన్ కూడా జట్టును వదిలి వెళ్లే ఛాన్స్ ఉంది’ అని షమి చెప్పుకొచ్చాడు.

ఫ్రాంచైజీ క్రికెట్​లో లాయల్టీకి చోటు లేదని ఇన్​డైరెక్ట్​గా చెప్పాడు షమి. గేమ్​లో ఇవన్నీ కామన్ అని తెలిపాడు. ప్లేయర్లు వస్తుంటారు.. పోతుంటారని పేర్కొన్నాడు. వచ్చే సీజన్​లో గిల్ కెప్టెన్​గా, బ్యాట్స్​మన్​గా తన రెస్పాన్సిబిలిటీని సక్రమంగా నెరవేరుస్తాడనే నమ్మకం ఉందన్నాడు. ప్లేయర్ల నుంచి అద్భుతమైన ప్రదర్శన రాబట్టగలిగితే సారథి పని సులువవుతుందని షమి వివరించాడు. అయితే గిల్, హార్దిక్​ను ఉద్దేశించి షమి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అతడ్ని కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు ఇంత బోల్డ్​గా మాట్లాడటం ఏందని అంటున్నారు. షమి చెప్పిన దాంట్లో తప్పు లేదని.. ఫ్రాంచైజీ క్రికెట్​ ఇలాగే ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఫలానా ప్లేయర్ ఫలానా టీమ్​కే ఎప్పటికీ ఆడుతూ ఉండాలంటే కుదరని పని అని చెబుతున్నారు. మరి.. షమి వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Gautam Gambhir: వీడియో: మోదీ పిలుపుతో ఆలయాన్ని శుభ్రం చేసిన టీమిండియా క్రికెటర్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి