iDreamPost
android-app
ios-app

IPLలో స్టార్క్​కు 25 కోట్లు.. నీకు 55 లక్షలేనా? ఈ క్వశ్చన్​కు రింకూ దిమ్మతిరిగే ఆన్సర్!

  • Published May 28, 2024 | 7:58 PM Updated Updated May 28, 2024 | 7:58 PM

ఐపీఎల్-2024లో కేకేఆర్ ఛాంపియన్​గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ ఫైట్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ను ఓడించి విజేతగా ఆవిర్భవించింది కోల్​కతా. కప్పు గెలిచిన ఆనందంలో నుంచి ఆ టీమ్ ప్లేయర్లు ఇంకా బయటపడటం లేదు.

ఐపీఎల్-2024లో కేకేఆర్ ఛాంపియన్​గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ ఫైట్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ను ఓడించి విజేతగా ఆవిర్భవించింది కోల్​కతా. కప్పు గెలిచిన ఆనందంలో నుంచి ఆ టీమ్ ప్లేయర్లు ఇంకా బయటపడటం లేదు.

  • Published May 28, 2024 | 7:58 PMUpdated May 28, 2024 | 7:58 PM
IPLలో స్టార్క్​కు 25 కోట్లు.. నీకు 55 లక్షలేనా? ఈ క్వశ్చన్​కు రింకూ దిమ్మతిరిగే ఆన్సర్!

ఐపీఎల్-2024లో కేకేఆర్ ఛాంపియన్​గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ ఫైట్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ను ఓడించి విజేతగా ఆవిర్భవించింది కోల్​కతా. ఆ జట్టు టైటిల్ నెగ్గడం ఇది మూడోసారి. పదేళ్ల తర్వాత కప్పు గెలవడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఆ టీమ్ ప్లేయర్లు కూడా ఆనందంలో నుంచి ఇంకా బయటపడటం లేదు. కేకేఆర్ కప్పు గెలవగానే అందరికంటే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకున్నాడు ఫినిషన్ రింకూ సింగ్. తోటి ఆటగాళ్లను కౌగించుకొని కేరింతలు కొట్టాడు. ఈలలు వేస్తూ గోల చేశాడు. సాధించామని అరుస్తూ కప్పుకు ముద్దులు పెట్టాడు. కేకేఆర్ సెలబ్రేషన్స్​లో రింకూనే హైలైట్​గా నిలిచాడు. అయితే గత కొన్ని సీజన్లుగా ఆ టీమ్ విజయాల్లో కీలకంగా మారిన అతడికి దక్కే పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు.

ఈ సీజన్​లో ఆడినందుకు గానూ రింకూకు దక్కేది రూ.55 లక్షలు మాత్రమే. గత కొన్ని సీజన్లుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడతను. ఫినిషర్​గా ఎన్నో మ్యాచుల్లో సింగిల్ హ్యాండ్​తో టీమ్​కు విక్టరీలు అందించాడు. టీమిండియా తరఫున ఇంటర్నేషనల్ లెవల్​లోనూ అదరగొట్టాడు. అయినా అతడికి అంత తక్కువ రెమ్యూనరేషన్ ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐపీఎల్-2024కు ముందు జరిగిన మినీ ఆక్షన్​లో మిచెల్ స్టార్క్​ను రూ.25 కోట్లు పోసి కొనుక్కుంది కోల్​కతా. దీంతో రింకూ-స్టార్క్ రెమ్యూనరేషన్స్​పై చర్చ నడిచింది. తాజాగా ఈ విషయంపై రింకూ రియాక్ట్ అయ్యాడు. తనకు రూ.55 లక్షల పారితోషికం చాలా ఎక్కువని అతడు అన్నాడు. క్రికెట్​లో ఈ రేంజ్​కు చేరుకుంటానని ఎప్పుడూ అనుకోలేదన్నాడు.

‘నా దృష్టిలో రూ.55 లక్షల పారితోషికం అంటే చాలా ఎక్కువ. క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసినప్పుడు ఈ స్థాయికి చేరుకుంటానని నేనెప్పుడూ అనుకోలేదు. నా చిన్నప్పుడు ఐదు రూపాయల కోసం పనిచేశా. ఇప్పుడు 55 లక్షలు సంపాదిస్తున్నా. ఇంతకంటే సంతోషం ఏం ఉంటుంది. దేవుడు నాకు ఏదైతే ఇచ్చాడో దానికి నేను తప్పకుండా సంతోషిస్తా. నా ఆలోచనలు ఇలాగే ఉంటాయి. లెక్కలు వేసుకునే అలవాటు నాకు లేదు. ఉన్నదాంతో హ్యాపీగా ఉన్నామా? లేదా? అనేదే ముఖ్యం. నా సంపాదనతో నేను సంతోషంగా ఉన్నా. ఒకప్పుడు ఇవి కూడా లేని రోజుల్ని చూశా. నాకు డబ్బుల విలువ బాగా తెలుసు’ అని రింకూ చెప్పుకొచ్చాడు. ఎవరమూ ఏమీ తీసుకురాలేదని, అలాగే ఏమీ పట్టుకుపోమన్నాడు. నేల విడిచి సాము చేయకూడదనేది తన సూత్రమని వివరించాడు. మరి.. రెమ్యూనరేషన్ విషయంలో రింకూ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.