iDreamPost

Hardik Pandya: ముంబై మ్యాచ్ గెలిచినా.. కెప్టెన్ గా పాండ్యా అట్టర్ ఫ్లాప్! నిన్న మ్యాచ్ లో ఈ 3 తప్పులు గమనించారా?

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీమ్ గెలిచినా.. కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో అతడు 3 బిగ్ మిస్టెక్స్ చేశాడు. అవేంటంటే?

పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీమ్ గెలిచినా.. కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో అతడు 3 బిగ్ మిస్టెక్స్ చేశాడు. అవేంటంటే?

Hardik Pandya: ముంబై మ్యాచ్ గెలిచినా.. కెప్టెన్ గా పాండ్యా అట్టర్ ఫ్లాప్! నిన్న మ్యాచ్ లో ఈ 3 తప్పులు గమనించారా?

ఏ క్రీడలో అయిన ఓ జట్టు విజయం సాధించాలంటే ప్లేయర్లు అందరూ ఎంతో కష్టపడాలి. ఇక వారందరిలో ఆత్మవిశ్వాసం నింపి.. టీమ్ విజయానికి తోడ్పడుతూ ముందుండి నడిపించాలి కెప్టెన్. తన మాస్టర్ మైండ్ తో ప్రత్యర్థి వ్యూహాలను దెబ్బతీసేలా కౌంటర్ ఎటాక్ చేస్తుండాలి. ఇలాంటి కెప్టెన్ ఉన్న టీమ్స్ విజయాలు సాధిస్తూ.. టోర్నీలో ముందుకుసాగుతూ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు అదృష్టవశాత్తు కెప్టెన్ తప్పులు చేసినా.. మ్యాచ్ లు గెలుస్తూ ఉంటాయి. తాజాగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఇదే జరిగింది. ముంబై మ్యాచ్ గెలిచినా.. కెప్టెన్ గా పాండ్యా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. నిన్నటి పోరులో 3 బ్లండర్ మిస్టేక్స్ చేశాడు పాండ్యా. ఆ తప్పులేంటో తెలుసుకుందాం పదండి.

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న(ఏప్రిల్18) పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 9 పరుగులు తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముంబై నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 183 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఈ సీజన్ లో 3వ విజయంతో పాయింట్ల పట్టికలో 7వ ప్లేస్ లోకి వచ్చింది. ఇక ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ముంబై గెలిచినప్పటికీ ఈ మ్యాచ్ లో పాండ్యా 3 మిస్టెక్స్ చేశాడు. కెప్టెన్ గా అనుభవం ఉన్న పాండ్యా ఇలాంటి తప్పులు ఎలా చేశాడా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ హార్దిక్ చేసిన తప్పులు ఏంటంటే?

ఈ సీజన్ లో పాండ్యా ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ లో పూర్తిగా విఫలం అవుతూ వస్తున్నాడు. బ్యాటింగ్ లో అయితే మరీ దారుణం అనే చెప్పాలి. ఇలాంటి టైమ్ లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో ముందొచ్చాడు. టిమ్ డేవిడ్ కంటే ముందే బ్యాటింగ్ కు దిగాడు. కానీ ఇరగదీసింది ఏమీ లేదు. 6 బంతుల్లో 10 పరుగులు చేసి ఔటైయ్యాడు. ఇక రెండో తప్పు విషయానికి వస్తే.. వరల్డ్ క్లాస్ స్పిన్నన్ అయిన మహ్మద్ నబికి ఈ మ్యాచ్ లో బౌలింగ్ ఇవ్వకపోవడం. నబికి ఐపీఎల్ లో మంచి రికార్డ్ ఉంది. పైగా పొదుపుగా బౌలింగ్ చేస్తూ.. వికెట్లు కూల్చగల సత్తాఉన్న బౌలర్. ఇలాంటి బౌలర్ చేత ఒక్క ఓవర్ కూడా వేయించకపోవడం పెద్ద తప్పు. పాండ్యా తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది.

ఇక మూడో తప్పు ఏంటంటే? చివరి ఓవర్ పెద్దగా అనుభవం లేని ఆకాశ్ మధ్వాల్ కి ఇవ్వడం. చివరి ఓవర్లో 12 పరుగులు చేయాలి. టీ20ల్లో ఇది పెద్ద విషయం కాకపోయినప్పటికీ.. ఏ నిమిషానికి ఏమీ జరుగుతుందో చెప్పలేం. రెండు బాల్స్ సరిగ్గా బ్యాట్ కు కనెక్ట్ అయితే చాలు, మ్యాచ్ ఓడిపోవాల్సిందే. ఇలాంటి టైమ్ లో అప్పటికే 3 ఓవర్లు వేసి 44 రన్స్ కొట్టించుకున్న మధ్వాల్ కు బంతిని అప్పగించడం నిజంగా షాకింగ్ డెసిషనే. బౌలర్లు లేరా అంటే అదీకా శ్రేయస్ గోపాల్ తో పాటుగా అనుభవం ఉన్న షెఫర్డ్ కూడా ఉన్నాడు. వీరిలో ఎవరికైనా ఇవ్వొచ్చు. కానీ పాండ్యా ఆ పని చేయలేదు. అదృష్టవశాత్తు ఈ మ్యాచ్ లో గెలిచారు కాబట్టి.. ఈ తప్పులను ఎవ్వరూ ఎత్తిచూపడం లేదు. లేదంటే, హార్దిక్ పై విమర్శల వర్షం కురిసేదే. మరి ఇప్పటికైనా కెప్టెన్ గా ఈ తప్పులను సరిదిద్దుకుంటూ టోర్నీలో ముందుకు వెళ్తేనే పాండ్యా ముంబైకి విజయాలు అందించగలడు. ఈ మ్యాచ్ లో హార్దిక్ చేసిన తప్పుల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి