iDreamPost

బుమ్రానే భయపెట్టాడు.. ఎవరీ అశుతోష్‌? టీమిండియాకు మరో సూర్య దొరికేసినట్టేనా?

  • Published Apr 19, 2024 | 8:40 AMUpdated Apr 19, 2024 | 8:40 AM

Ashutosh Sharma, MI vs PBKS: బుమ్రా దెబ్బకు ఇంటర్నేషనల్‌ స్టార్‌ వికెట్‌ సమర్పించుకుంటే.. ఓ కుర్రాడు మాత్రం బుమ్రా అయితే ఏంటి అంటూ బ్యాటింగ్‌ చేశాడు. మ్యాచ్‌ ఓడిపోయానా హీరోగా నిలిచాడు. అతనే అశుతోష్‌ శర్మ. అసలు ఎవరీ అశుతోష్‌ శర్మ.. అతని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Ashutosh Sharma, MI vs PBKS: బుమ్రా దెబ్బకు ఇంటర్నేషనల్‌ స్టార్‌ వికెట్‌ సమర్పించుకుంటే.. ఓ కుర్రాడు మాత్రం బుమ్రా అయితే ఏంటి అంటూ బ్యాటింగ్‌ చేశాడు. మ్యాచ్‌ ఓడిపోయానా హీరోగా నిలిచాడు. అతనే అశుతోష్‌ శర్మ. అసలు ఎవరీ అశుతోష్‌ శర్మ.. అతని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Apr 19, 2024 | 8:40 AMUpdated Apr 19, 2024 | 8:40 AM
బుమ్రానే భయపెట్టాడు.. ఎవరీ అశుతోష్‌? టీమిండియాకు మరో సూర్య దొరికేసినట్టేనా?

193 పరుగుల టార్గెట్‌.. కానీ, 77 పరుగులకే 6 వికెట్లు పడిపోయాయి. ప్రత్యర్థి జట్టులో బుమ్రా లాంటి నిప్పులు చెరిగే బౌలర్‌ ఉన్నాడు. అయినా కూడా అతను ఏ మాత్రం భయపడలేదు, బెదరలేదు. ప్రత్యర్థి బౌలర్లను వణికించాడు. విజయం అసాధ్యం అనుకున్న టైమ్‌.. తన భీకర బ్యాటింగ్‌తో ముంబై ఇండియన్స్‌ను వణికించి.. ఆల్‌ మోస్ట్‌.. ఆల్‌ మోస్ట్‌ మ్యాచ్‌ గెలిపించేశాడు. చివరి ఓవర్‌లో మ్యాచ్‌ ఓడిపోయినా.. హీరోగా నిలిచింది మాత్రం అతనే. ఆ కుర్రాడి పేరు అశుతోష్‌ శర్మ. ఎప్పుడు పేరు కూడా సరిగ్గా వినలేదు.. అంత పెద్ద తోపా అని అనుకుంటున్నారా? అవును తోపే. ప్రస్తుతం అతను ఆడుతున్న చూస్తుంటే ప్రత్యర్థి జట్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బుమ్రా లాంటి బౌలర్‌ యార్కర్లు సంధిస్తుంటే.. వికెట్లు కాపాడుకోలేని బ్యాటర్లు ఎంతో మంది ఉన్నారు. కానీ, స్విప్‌ షాట్‌తో సిక్స్‌ కొట్టే గట్స్‌ ఉన్న బ్యాటర్‌ను ఎప్పుడైనా చూశారా? అతనే ఈ అశుతోష్‌ శర్మ. గురువారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో పెను విధ్వంసం సృష్టించాడు. అతని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఛండీఘడ్‌లోని ముల్లాన్‌పూర్‌లోని క్రికెట్‌ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మధ్య హైఓల్టేజ్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో చివరి ముంబై విజయం సాధించినా.. పంజాబ్‌ జట్టు మనసులు గెలుచుకుంది. ముఖ్యంగా పంజాబ్‌ యువ క్రికెటర్‌ శశాంక్‌ సింగ్‌, అశుతోష్‌ శర్మ హీరోలుగా నిలిచారు. 193 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో సామ్‌ కరన్‌, ప్రభుసిమ్రాన్‌ సింగ్‌, రిలీ రోసోవ్‌, లిమ్‌ లివింగ్‌స్టోన్‌ ఇలా స్టార్లంతా విఫలమైనా.. ఈ ఇద్దరు కుర్రాళ్లు మ్యాచ్‌పై ఆశలు రేపారు. 14 పరుగులకే 4 వికెట్లు, 77 రన్స్‌కే 6 వికెట్లు పడిపోయినా.. పంజాబ్‌ 183 పరుగులు చేసిందంటే.. అది శశాంక్‌, అశుతోష్‌ వల్లే. బుమ్రా సూపర్‌ బౌలింగ్‌తో దుమ్మురేపినా.. అశుతోష్‌ మాత్రం బుమ్రాకు లొంగలేదు. 28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సులతో 61 రన్స్‌తో బుమ్రాకే చుక్కలు చూపించాడు. దీంతో.. అసలు ఎవరీ అశుతోష్‌ శర్మ? దేశవాళి క్రికెట్‌లో ఏ టీమ్‌కు ఆడుతున్నాడు? ఇన్ని రోజులు ఎక్కడుండిపోయాడు? అంటూ క్రికెట్‌ అభిమానులు ఆరాలు తీస్తున్నారు.

Who is Ashutosh Sharma

అశుతోష్‌ శర్మగ 1998 సెప్టెంబర్ 15న మధ్యప్రదేశ్‌లో జన్మించాడు. క్రికెట్‌పై ఇష్టంతో చిన్నతనం నుంచే గొప్ప క్రికెటర్‌ కావాలని కలలు కన్నాడు. వాటిని నిజం చేసుకునేందుకు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. దేశవాళి క్రికెట్‌లో రాణిస్తున్నా.. ఐపీఎల్‌తోనే అశుతోష్‌కు మంచి గుర్తింపు వచ్చింది. క్రికెటర్‌గా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన అశుతోష్‌.. 2019-20 విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపున 16 అక్టోబర్ 2019న తన లిస్ట్ ఏ అరంగేట్రం చేశాడు. 2023 అక్టోబర్‌లో టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్‌ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అశుతోష్‌ కేవలం 11 బంతుల్లోనే ఈ ఫీట్‌ సాధించి, యువరాజ్‌ సింగ్‌ 2007 టీ20 వరల్డ్‌కప్‌ సందర్భంగా 12 బంతుల్లో చేసిన హాఫ్‌ సెంచరీ రికార్డును బ్రేక్‌ చేశాడు. ఇక.. ఐపీఎల్ 2024 కోసం జరిపిన వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ మ్యాచ్‌ కంటే ముందు కూడా మంచి ఇన్నింగ్స్‌లతో అశుతోష్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం అశుతోష్‌ ఆటను చూస్తున్న క్రికెట్‌ అభిమానులు టీమిండియాకు మరో సూర్యకుమార్‌ యాదవ్‌ దొరికేశాడు అని సంతోష పడుతున్నారు. మరి అశుతోష్‌ ఆడుతున్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి